top of page

క్షమాగుణం శ్రేష్టం

#TeluguKavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KshamagunamSreshtam, #క్షమాగుణంశ్రేష్టం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 77


Kshamagunam Sreshtam - Somanna Gari Kavithalu Part 77 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/05/2025

క్షమాగుణం శ్రేష్టం - సోమన్న గారి కవితలు పార్ట్ 77 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


క్షమాగుణం శ్రేష్టం

----------------------------------------

అందరికీ ఉండదు

క్షమించే హృదయం

అదే గనుక ఉంటే

శత్రుత్వం మాయం


ఐక్యతకు రహదారి

క్షమాగుణం శ్రేష్టం

తెలుసుకొనుము చదువరి

ప్రతీకారం నష్టం


ప్రేమించే తత్వం

జయించే ఆయుధం

వసుధైక కుటుంబం

అవుటకదే మార్గం


విశాల దృక్పథం

అలవర్చుకుంటేనే

జీవితాన లాభం

లేదంటే కష్టం
















జీవితమే పోరాటం!

----------------------------------------

జీవితమే పందెం

గెలిస్తే గౌరవం

పరికింపగ అందం

మల్లెతీగ బంధం


యేరులా సాగాలి

శరంలా మారాలి

అడ్డంకులు వచ్చినా

రవి కిరణమవ్వాలి


పట్టుదల ఉండాలి

పోరాటం చేయాలి

చీకట్లు క్రమ్మినా

గెలుపు వశం కావాలి


జీవితం సాహసం

చేయాలోయ్! సతతం

చావో,రేవో తేల్చి

చరిత్రలో నిలవాలి

















అమ్మ హితోక్తులు

----------------------------------------

ఉక్రోషం ఉప్పెన

లేదు అందు సాంత్వన

వదిలితేనే నెమ్మది

లేదంటే సమాధి


అవుతుంది గాలివాన

విడిచిపెట్టు వాదన

దొరుకుతుంది శాంతం

లేకుంటే అంతం


ఎదిగేందుకు నిచ్చెన

పట్టుదల జీవితాన

కల్గియుంటే మేలు

మెండుగా లాభాలు


వద్దు మనోవేదన

మెత్తనైన హృదయాన

ఉండాలోయ్! దూరం

తరమాలోయ్! భారం











మేటి నేటి పలుకులు

----------------------------------------

గొప్పదై ఉండాలి

ఎంచుకున్న లక్ష్యం

చిత్తశుద్ధి కావాలి

చేరడానికి గమ్యం


క్షేమమే కోరాలి

క్షామమే పోవాలి

అందరూ హాయిగా

అవనిలో బ్రతకాలి


స్వార్ధగుణం వీడాలి

పరహితం చూడాలి

సంక్షేమ పథంలో

ముందుడగు వేయాలి


కన్నీరు తుడవాలి

తొలి పొద్దయి పొడవాలి

బేధాలు విడనాడి

ప్రేమతో గడపాలి














అక్షర హారాలు-జీవిత సత్యాలు

----------------------------------------

నేర్పును రైలు పట్టాలు

గొప్ప జీవిత సత్యాలు

విరితే మనసులు కలవవు

మరల అతికితే కుదరవు


ఎగసిపడే కెరటాలు

ఉదయించే కిరణాలు

బోధించును పాఠాలు

దిద్దునోయి! జీవితాలు


సుందర జలపాతాలు

విజయోత్సవ గీతాలు

పంచును నయనానందం

పెంచును హృదయానందం


ప్రతి ఒక్కటి సృష్టిలో

భగవంతుని దృష్టిలో

చూడ సర్వ సమానమే!

అక్షరాల వాస్తవమే!


-గద్వాల సోమన్న


Comments


bottom of page