కుక్క కావాలి
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 5
- 3 min read
#KukkaKavali , #కుక్కకావాలి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Kukka Kavali - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 05/05/2025
కుక్క కావాలి - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
ప్రసాద్ నర్సింగ్ హోమ్ పేషెంట్లతో కోలాహలంగా ఉంది. బయట వెయిటింగ్ హాల్లో జనం వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు.
"కుక్క కావాలి, నాకు జిమ్మీ కావాలి" హాస్పిటల్ బెడ్ మీద కలవరిస్తున్నాడు పదేళ్ల కిరణ్.
"ఎలా ఉంది డాక్టర్ ?" ఆత్రుతగా అడుగుతున్నాడు తండ్రి శంకరం.
కొడుక్కి ఏమైందోనని బెదిరిపోతోంది అరుణ.
అన్నయ్య పరిస్థితి అర్థం కాక బిక్కమొహంతో నిలబడింది కమల.
కిరణ్ ని పరిక్షించిన డాక్టరు ప్రసాదు " హై ఫీవర్ ఉంది. మానసిక షాక్ కి గురయ్యాడు. మైకంలో 'కుక్క కావాలి' అంటు కలవరిస్తున్నాడు. నీర్సంగా ఉన్నాడు. సలైన్ పెట్టి ఇంజక్షన్ చేసింది సిస్టర్.
“నిద్ర పోతాడు. ఆందోళన పడాల్సిన అవుసరం లేదు. " దైర్యం చెబుతు, “ఈ కుక్క సంగతేంటి? " అన్నారు.
శంకరం, డాక్టరు సంశయం తీరుస్తూ " =అదా, మా ఇంట్లో జిమ్మీ పేరుతో ఒక జూలు కుక్క పెంచుతున్నాం. నాలుగు సంవత్సరాల క్రితం పిల్లగా ఉన్నప్పుడు మా ఇంటి గుమ్మంలో కొచ్చింది. దాన్ని చూసిన మా అబ్బాయి కిరణ్ పాలు పోసి చేరదీసాడు.
ఎవరిదో ఏమిటో బయట వదిలేయమన్నా విడిచి పెట్టలేదు. దాని ముద్దు మొహం, చలాకితనం చూసి మేమూ కాదనలేక పోయాం. అప్పటి నుంచి జిమ్మీ మా ఇంటి సబ్యురాలైంది.
కిరణ్ స్కూల్ నుంచి వస్తూనే దాంతో ఆటలు పరుగులు పెట్టేవాడు. తినడానికి ఏమిచ్చినా ముందు జిమ్మీకి పెట్టిన తర్వాతనే తను తినేవాడు. రాను రాను స్కూల్లో కడుపు నొప్పి అని ఏదో సాకుతో ఇంటి కొచ్చి దాంతో కాలక్షేపం మొదలెట్టాడు. జిమ్మీని గొలుసుతో కట్టనిచ్చేవాడు కాదు. రాత్రి పక్కలో పడుకోబెట్టుకునేవాడు. ఇలా జిమ్మీతో వాడి అనుబంధం పెరిగింది.
వాడి ప్రవర్తనతో చిరాకు పుట్టి జిమ్మీని మా బంధువుల కిచ్చేస్తే దాన్ని తిరిగి తెచ్చేవరకు అన్నం తిననని మొండిపట్టు పట్టేడు.
జిమ్మీ గట్టిగా అరుస్తోందని, మలమూత్రాలు వాళ్ల గుమ్మాల ముందుచేస్తోందన్న కారణంగా ఇరుగుపొరుగు వారితో వాగ్వివాదాలు జరిగి మామద్య మనస్పర్థలు వచ్చాయి. వాళ్ళు చివరకు పోలీసు కంప్లైంటు ఇచ్చారు.
కిరణ్ చదువు పాడవుతోందని విసుగెత్తి, హైదరాబాదు బంధువులఇంట్లో పంక్షన్ ఉంటే, వాడు మమ్మీతో వెళ్లినప్పుడు జిమ్మీని జీవకారుణ్య సంస్థ వారికి అప్పగించి వచ్చాను.
వారం రోజులు గడిచి పోయాయి.
కిరణ్ హైదరాబాదు నుంచి వస్తూనే జిమ్మీని వెతకడం మొదలెట్టాడు. చదువు పాడవుతోందని తలిచి దాన్ని దూరంగా విడిచి పెట్టామని చెప్పగానే, ఇంట్లో హంగామా మొదలెట్టాడు. ఎన్ని విధాల నచ్చచెప్పినా వాడు వినలేదు. తిండి మానేసాడు.
ఆఖరికి, మాకు ఇష్టం లేకపోయినా వాడి బాధ చూడలేక జీవకారుణ్య సంస్థ వారిని సంప్రదిస్తే, వారు జిమ్మీని ఎవరికో దత్తత ఇచ్చినట్లు తెల్సింది. దత్తత తీసుకున్న వార్ని ఎంత ప్రయత్నించినా అందుబాటులో లేరు.
రెండు రోజుల్నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక జిమ్మీ ఫోటోతో పరిస్థితి వివరిస్తూ దినపత్రికలో ప్రకటన ఇచ్చాము. పేపరు ప్రకటన చూసి జిమ్మీని దత్తత తీసుకున్నవారు ఫోన్లో
సమాచారమిస్తు తీసుకెళ్లమని చిరునామా వివరాలు ఇచ్చారు.
నిన్నటి నుంచి కిరణ్ ప్రవర్తనలో సడన్ మార్పు వచ్చి పిచ్చి పిచ్చిగా కేకలేస్తూ కింద పడిపోయాడు. వెంటనే మీ హాస్పిటల్ కి తీసుకు వచ్చాము. " అని జరిగిన సంగతంతా డాక్టరుకి వివరించి
“ఈరోజే వెళ్లి మా ఇలవేలుపు జిమ్మీని తీసుకువచ్చి కిరణ్ కి చూపించి మామూలు మనిషిని చేస్తాను " అన్నాడు శంకరం.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments