మధురమైన జ్ఞాపకాలు
- Addanki Lakshmi

- May 11
- 4 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Madhuramaina Jnapakalu - Telugu Story on Mother | Addanki Lakshmi
మధురమైన జ్ఞాపకాలు - తెలుగు అమ్మ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 11/05/2026
తల్లి ప్రేమకు హద్దులు ఉండవు…
ప్రతి బిడ్డను ప్రత్యేకంగా చూసే అమ్మ మమకారాన్ని గుర్తు చేసే హృద్యమైన తెలుగు కుటుంబ కథ “మధురమైన జ్ఞాపకాలు”.
ఒక్కసారి తుఫాన్ వచ్చి వెలిసిన ప్రశాంతత. చుట్టాలు అందరూ వెళ్లిపోయారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వెళ్లిపోవాలి కదా?
అమ్మ పోయిన తర్వాత కార్యక్రమాలన్నీ శాస్త్రయుక్తంగా చక్కగా జరిపించారు ఆరుగురు పిల్లలు.
సీతమ్మ గారికి ఆరుగురు సంతానం. తండ్రి పోయి రెండేళ్లయ్యింది. ముగ్గురు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు.
సాయంకాలమైంది.
ఆమె మనవలందరూ బయట ఆడుకుంటున్నారు. కోడళ్లు ముగ్గురు వంటగదిలో పనిలో ఉన్నారు.
కొడుకులు, కూతుళ్లు కూర్చుని తల్లి గురించి ఎన్నో విషయాలను గుర్తుచేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
తల్లితో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. అమ్మ ప్రేమ ఎలాంటిదంటే, అమ్మ తననే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి సంతానానికి. అమ్మ ప్రేమకి ఎక్కడ విలువ కట్టగలం? ఎక్కడ తూకం వేయగలం?
"అమ్మకి నేనంటే చాలా ఇష్టం. అందరి కంటే నన్నే బాగా చూసేది. 'టెన్త్ పాస్ అయితే నాకు వాచీ కొనిపెడతాను, ఎవరికీ చెప్పొద్దు' అంటూ కొనిపెట్టింది తెలుసా?" అందరిలోకి చిన్నావిడ సంతోషంగా అంది.
"ఏం కాదు, నేనంటేనే అమ్మకు చాలా ఇష్టం. నేను పెద్దవాడిని కదా. నన్ను చాలా బాగా ముద్దుగా పెంచింది. నేను ఏదంటే అలా జరిపించేది. అమ్మకు నేనంటేనే చాలా ఇష్టం," అన్నాడు పెద్దవాడు గొప్పగా.
"అమ్మకి నేను అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే లెక్కల్లో నేను వీక్ కదా. 'ఈసారి ఫైలవకుండా 40 మార్కులు తెచ్చుకుంటే, నీకు ఇష్టమైన మైసూర్పాక్ చేసి పెడతాను' అని నన్ను ఊరించేది. నిజంగానే నేను 40 మార్కులు తెచ్చుకున్నప్పుడు నాకు చేసి పెట్టింది. మీకు ఎవ్వరికీ తెలియదు!"
"అమ్మకు నేను అంటేనే ఎక్కువ ఇష్టం," అన్నాడు రెండోవాడు.
నన్నే బాగా చూసేది అమ్మ. నేను చిన్నాడిని కదా. 'ఒరేయ్ చిన్నీ' అంటూ గారంగా పిలిచేది. నేను ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకునే ఉండేవాడిని. అస్తమానం నన్ను ఎప్పుడూ ముద్దుమురిపాలతో 'చిన్ని' అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకునేది.
"ఆ మాటకొస్తే అసలు అమ్మకి నేనంటే చాలా ఇష్టం.
సంక్రాంతి పండక్కి పట్టులంగా కుట్టించింది. అప్పుడు చెప్పింది: 'నీకే ఇది. ఆటల్లో ఫస్ట్ వచ్చావు కదా. అక్కకు, చెల్లికి కుట్టించలేదు, నీకే ఈ బహుమతి' అంది. నేను అంటేనే అమ్మకు ఎంతో ఇష్టం."
"అమ్మకి నేనంటేనే ఇష్టం. నన్నే బాగా చూసేది. నాకు చాక్లెట్ అంటే ఇష్టం కదా. అమ్మ నాకు డబ్బులు ఇచ్చి 'స్కూల్ దగ్గర చాక్లెట్లు తిను. ఎవరికీ చెప్పకు' అంటూ ఉండేది. అందుకనే అమ్మకి నేనంటే చాలా ఇష్టం....."
ఇలా ఆరుగురు పిల్లలు కూర్చుని తల్లిని, ఆమె ప్రేమాభిమానాన్ని ముచ్చటించుకుంటున్నారు. వారి అనుభవాలు ఎంతో మధురంగా ఉన్నాయి.
అది తల్లి ప్రేమ. ఎవ్వరినీ తక్కువగా చూసేది లేదు.
పిల్లలు అందరూ హాయిగా గలగల నవ్వుకున్నారు, అమ్మ తెలివి గురించి చెప్పుకొని.
"చూశావా! అమ్మ ఎంత తెలివైనదో. ఇంతమంది పిల్లల్ని ఎంత బాగా పెంచిందో, ఎవరికీ ఏ లోటూ రాకుండా. పిల్లలందరి మనసుల్లో 'అమ్మకి తనే ఎక్కువ' అనే భావాన్ని చక్కగా కలుగజేసింది. ఇదీ పిల్లల పెంపకం అంటే. నాన్నకి మాత్రం డబ్బు ఎక్కడ ఉంది? కొద్దిపాటి వ్యవసాయంతో ఈ పెద్ద కుటుంబాన్ని, బంధుజనాల్ని, పెద్ద సంసారాన్ని ఈడ్చుకు వచ్చేవాడు. అసలు నాన్నగారిని ఏమైనా అడిగేందుకే మనము భయపడేవాళ్ళము కదా? అన్నీ మనకు అమ్మే సమకూర్చేది, నాన్నగారితో చెప్పి. ఇప్పుడు మనమూ ఉన్నాము, ఇద్దరి పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని పెంచలేకపోతున్నాము. మనకి అంత సహనం, ఓర్పు ఎక్కడిది? అమ్మకు సాటి ఎవరూ లేరు. ఇలలో అమ్మే దైవము మనకు," అని పిల్లలందరూ అమ్మను మరీమరీ జ్ఞాపకం చేసుకున్నారు....
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments