top of page
Original.png

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 1

1 hour ago
3 min read

హిమవత్పర్వతంపై శ్రీకృష్ణుడు, రుక్మిణి సమక్షంలో గౌరీ శంకరుల సంవాదాన్ని చెప్పేందుకు సిద్ధమైన నారద మహర్షి

Gouri Sankarula Samvadam - Part 1 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 1 తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 21/09/2026


గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 1 (మహాభారతం నుండి గ్రహించబడింది)


మహాభారతంలోని అనుశాసనిక పర్వం ఆధారంగా బి. ఆర్. కె. వి. భాస్కరరావు అందిస్తున్న గౌరీ శంకరుల సంవాదం మొదటి భాగం ఇది. హిమవత్పర్వతంపై ఉన్న శ్రీకృష్ణుడు ఉత్తమ ఇతిహాస కథను వినాలనగా, నారద మహర్షి ఉమామహేశ్వరుల సంవాదాన్ని చెప్పేందుకు సిద్ధపడతాడు.



"ఓం నమః శివాయ"


శ్రీ వేదవ్యాస మహర్షుల వారు కలియుగంలోని ప్రతి మానవుడూ తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ, దేహత్యాగం చేశాక నరకకూపానికి బలికాకుండాను, పునర్జన్మ రాహిత్యాన్ని పొందడానికి తదేక దీక్షతో సంస్కృతంలో మహాభారత కావ్యాన్ని రచించారు.


నిజానికి మహాభారతం అసలు పేరు "జయం".

తాను రచించిన జయ కావ్యాన్ని చదివినా, విన్నా మానవులు తరిస్తారని ఆ మహానుభావుడు నొక్కి వక్కాణించాడు. 


"ఎప్పుడో ద్వాపరయుగం నాటి చరిత్ర కలియుగ వాసులకెందుకు?" అని చాలామంది సందేహించవచ్చు. కానీ ఆయన భారత కావ్య రచన మొదట్లోనే, మహాభారతంలో ఉన్నదే కలియుగంలో జరుగుతుంది; అంతకుమించి ఒక్క అంగుళం కూడా అదనంగా జరగదని శాసించాడు.


నేడు మనం చూస్తున్నది, అనుభవిస్తున్నది, భవిష్యత్తులో అనుభవించబోయేది ప్రతిఒక్కటి మహాభారతంలోని పాత్ర ద్వారా కానీ, సన్నివేశం ద్వారా కానీ, ఒక కథగా కానీ మనకు దృగ్గోచరమౌతుంది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు.


అంతటి గొప్ప ఇతిహాస కావ్యమైన మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో గౌరీ శంకరుల సంవాదం ఉంది. వారిది కేవలం సంవాదం కాదు; కలియుగంలోని మానవుల యొక్క నడవడిక, ధర్మాలను దిశానిర్దేశం చేసే పలుకులవి. వారిద్దరి మధ్యలో జనించే ప్రశ్నోత్తరాలు నేటికీ శిరోధార్యాలే. వాటిని తూచా తప్పకుండా అనుసరిస్తే వేదవ్యాసుల వారి ఆశయం సిద్ధించినట్టే.


భవుని ఆరాధించడం పూర్వజన్మ సుకృతం. భవాని నిత్య అనపాయినిగా ఆయన శరీరంలో సగభాగమై దర్శనమిస్తుంది.


ఆది దంపతుల సంవాదాన్ని క్లుప్తంగా కవిత్రయ విరచితమైన శ్రీమదాంధ్ర మహాభారతం నుండి సేకరించి అందించడమైంది.


శ్రీకృష్ణ పరమాత్మ తన దేవేరి అయిన రుక్మిణీ దేవితో కలసి పుత్ర సంతానార్థి అయి హిమవత్పర్వతంపై పన్నెండు సంవత్సరాలు వ్రతం చేసి కృశించి ఉన్నాడు. ఆ సమయంలో నారద మహర్షి తన శిష్య సమూహంతో వచ్చి వాసుదేవుని చుట్టూ కూర్చున్నప్పుడు, మురారి ఋషులను "ఓ ఉత్తమ ఇతిహాస కథను" చెప్పమని కోరాడు. 


వారంతా ఆ పనికి నారద మహర్షియే సమర్థుడని చెప్పారు. దానికి మహర్షి సంతోషంతో సమ్మతించి ఉమామహేశ్వరుల సంవాదాన్ని వినిపించడానికి ఉద్యుక్తుడయ్యాడు.



గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 2 త్వరలో మీ ముందుకు వస్తుంది. 



*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page