top of page

మధ్య వయసు


'Madhya Vayasu' New Telugu Story Written By M. Bhanu

'మధ్య వయసు' తెలుగు కథ

రచన: M. భాను

(కథాపఠనం:కే. లక్ష్మీశైలజ)


ప్రతి ఒకరి జీవితంలో మధ్య వయసు పున్నాగ వనం లాంటిది. ఎన్నో సౌరభాలను తీసుకువస్తుంది. జీవితం మీద అవగాహనతో మరింత అందంగా తీర్చుకోవచ్చు. మధ్య వయసులో వచ్చే కష్టాలను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేస్తే జీవితం నందనవనమే!


సాధారణంగా 40 నుంచి 60 వరకు మధ్య జీవితాన్ని మధ్య వయసు అని పేర్కొంటారు. మధ్య వయసులో వచ్చే ముఖ్యమైన అనారోగ్యాలు, బీపీ షుగర్ లాంటివి.

ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. చెప్పుకోలేరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఇంట్లో బాధ్యతలు ముందు ఈ సమస్యలు చిన్నవిగానే అనిపిస్తాయి. ఆ ఏముందిలే ఈ వయసులో వచ్చే సమస్యలే కదా కొన్నాళ్లకపోతే ఇవే తగ్గిపోతాయని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఏదైనా ఊరు వెళ్లినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బందులు వలన చాలా కష్టమవుతుంది.


అలాంటి ఇబ్బందే లతకు వచ్చింది. లత వయసు 50 సంవత్సరాలు. ఆడపిల్లకు పెళ్ళి చేసింది మగ పిల్లవాడు ఉన్నాడు. కూతురు పుట్టినప్పుడు ఆరో నెలలోనే గర్భసంచి జారిపోయిందని డాక్టరు ఆపరేషన్ చేసింది. అప్పుడు పనులు ఒత్తిడిలో బాధ్యతలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి ఈ మధ్య కొత్తగా యూరిన్ కంట్రోల్లో లేకపోవడం, కొంచెం చల్లగా ఉంటే యూరిన్ కి ఎక్కువగా వెళ్లవలసి రావడం, నిద్ర పట్టకపోవడం, చికాకు కోపం ఎక్కువ అవడం జరుగుతుంది.


భర్తకి లత విషయాలు ఏమి పట్టవు. తనకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా ఒకటే చూసుకుంటాడు. భార్య ఆరోగ్యం గురించి పట్టదు. ఉన్న ఒక్క ఆడపిల్ల అత్తారింటికి వెళ్లిపోయింది చెప్పుకునే ఆడదిక్కులేదు. ఈ సమస్య ఈ మధ్య మరీ ఇబ్బంది పెడుతోంది. భర్తతో డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నీకేమి గుండ్రాయిలా ఉన్నావు అంటాడు తప్పితే మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.


రాత్రంతా నిద్రలేమి వల్ల ఉదయాన్నే లేవలేకపోవడం సరైన సమయానికి అన్ని అందించలేక పోవడంతో భర్త కొడుకు విసుక్కుంటున్నారు. దానితో లత కి డిప్రెషన్ ఎక్కువైపోయి ఊరికి ఊరికే ఏడుపు వస్తోంది.


ఇలాంటి ఇబ్బందుల వల్ల ఫంక్షన్స్ కి వెళ్లడం మానేస్తోంది. రావటం లేదని చుట్టాలు అందరికీ కోపంగా ఉంటుంది. కానీ ఈ మధ్య తప్పని సరిగా ఒక ఫంక్షన్ కి వెళ్లవలసి వచ్చింది. అది కూడా రెండు రోజులు ముందుగా. లత కి ఏమాత్రం ఉత్సాహం లేదు భయం భయంగా వెళ్ళింది.


ఎవరైనా జోక్ చేస్తే గట్టిగా నవ్వడానికి భయం ఎక్కడ యూరిన్ అయిపోతుందని,నవ్వుల పాలవుతానని. సరదాగా నలుగురు ఉన్నచోట కూర్చోవడం లేదు. ఈ టెన్షన్ వలన ఎక్కువగా బాత్ రూమ్ కూడా వెళ్ళవలసి వస్తుంది.


అందరిలో ఉత్సాహంగా తుళ్లుతు ఉండే లతను చూసి చెల్లి కూతురికి కొత్తగా అనిపించింది.

సమయం చూసుకొని ఒంటరిగా ఉన్న లత దగ్గరికి వెళ్ళింది రమణి. ‘దొడ్డమ్మా..’ అంటూ మృదువుగా పిలిచింది. పరధ్యానం గా ఉన్న లత ఉలిక్కిపడింది.


రమణను చూసి నవ్వు తెచ్చుకుంటు ‘ఏమిటి రమణి’ అని అడిగింది.


“ఏమీ లేదు దొడ్డమ్మా! నిన్ను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకు. అందరిలో ఉత్సాహంగా ఉండే దానివి ఎందుకు అలా భయం భయంగా బిక్కుమంటూ ఒక్కదానివే కూర్చున్నావు? ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు” అంది.


రమణి మెత్తని మాటలకు లత కళ్ళమ్మట నీళ్లు జలజల కారిపోయాయి. అది చూసి కంగారు పడిన రమణి భుజం చుట్టూ చేతులు వేసి “దొడ్డమ్మా.. ఎందుకు? ఏమైంది”అని అడిగింది.


దానికి లత వెక్కుతూ అసలు విషయం చెప్పింది. ఆ మాటలకి రమణ “అయ్యో! ఈ మాత్రం దానికా అంత భయపడుతున్నావు? ఏమీ పర్వాలేదు. దీనికి పరిష్కారం నేను చెబుతాను.


దొడ్డమ్మా! నువ్వు యూరిన్ కి వెళ్ళినప్పుడు కొంచెం బిగ బెట్టి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళు. ఈ సమస్య తీరే వరకు నువ్వు డైపర్ వాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంగారు ఉండదు.


తాడాసన వేయాలి. దీన్నే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. నిలబడి వేసే ఆసనం. శ్వాస తీసుకుంటూ చేసే స్ట్రెచింగ్ ఆసనం.


ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.


కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం చేస్తే అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది. జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే అతి మూత్రం సమస్య తగ్గుతుంది.


ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి.


ఇంకేమైనా నీకు ఇన్ఫెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గర చూపించుకో. నిర్లక్ష్యం చేస్తే రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.


ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్లి డైపర్లు తెచ్చి దొడ్డ చేతిలో పెట్టింది.


ఆశ్చర్యంగా చూసింది లత.


“ఇవి మా అమ్మ కోసం తెచ్చానులే. వెళ్లి వేసుకుని రా. హాయిగా నవ్వుతూ ఉండు. ఏ బాధలు ఉండవు.

అయినా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ చెల్లి తో అయినా చెప్పాలి కదా.’


రమణి మాటలకు లత తేలికైన మనసుతో రమణి ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళింది.వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత ధైర్యంగా అందరిలో కూర్చుని అంత్యాక్షరి ఆడుతోంది.


ఫంక్షన్ అంతా అయిన తర్వాత రమణి దగ్గరికి వెళ్లి “మరో జన్మను ప్రసాదించావు” అంది చమర్చిన కళ్ళతో.


ఇక అక్కడి నుంచి ఏ ఫంక్షన్ అయినా మానకుండా వెళుతుంది. ఇదివరకటి లత లాగా హుషారుగా ఉంటోంది.

***

M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/bhanu/profile

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏
33 views0 comments
bottom of page