top of page

వారం వారం బహుమతులు ఏప్రిల్ 2023


Weekly Prizes And Vijayadasami 2023 Story Competition By manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ వారి వారం వారం బహుమతులు ఇంకా విజయదశమి 2023 కథల పోటీలు


విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. ఏప్రిల్ 2023 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు

3. విజయదశమి 2023 కథల పోటీలు

4. రచయితల ప్రొఫైల్స్

5. కొత్త రచయితల సమాచారం కోసం...


1 .బహుమతులకు సహకరిస్తున్న వారు

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.


రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.


వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.


ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


2. ఏప్రిల్ 2023 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు:

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి )



విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 25/05/2023 లోగా అందజేస్తాము.

3. విజయదశమి 2023 కథల పోటీలు

సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022 మరియు ఉగాది 2023 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

ఇప్పుడు విజయదశమి 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.

02 /04 /2023 నుండి 15 /10 /2023 వరకు ప్రచురితమయ్యే కథల నుండి విజయదశమి 2023 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.

ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.


విజయదశమి 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15/10/2023

*ఫలితాలు 15/11/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

4. రచయితల ప్రొఫైల్స్

రచయితలందరినీ వారి ప్రొఫైల్ లో లాగిన్ కమ్మని కోరుతున్నాం.

వారి వారి ప్రొఫైల్స్ ను తమ సన్నిహితులకు షేర్ చేసి ఫాలో కమ్మని కోరమని అభ్యర్థిస్తున్నాము. అందువల్ల మీ రచనలు పబ్లిష్ అయినప్పుడు అనుసరించిన వారికి నేరుగా సమాచారం అందుతుంది. కామెంట్ చెయ్యడం కూడా సులభమవుతుంది.

మీ కథలకు సంబంధించి మేము పంపే లింక్ లను వాట్సాప్ ద్వారా, మీ వ్యక్తిగత బ్లాగ్ ల ద్వారా మీ సన్నిహితులకు షేర్ చేసి వారి కామెంట్స్ కోరండి.

ప్రచురించే ప్రతి కథకు సంబందించిన పోస్ట్ పేస్ బుక్ లో ఉంచుతున్నాము. మీ కథకు సంబంధించిన పోస్ట్ ను మీ పేస్ బుక్ పేజీ లో షేర్ చెయ్యండి.


అలాగే సాటి రచయితల ప్రొఫైల్స్ ను ఫాలో చెయ్యమని కోరుతున్నాం.

మనతెలుగుకథలు.కామ్ కి తరచుగా రచనలు పంపేవారు అరవై మందికి పైగా ఉన్నారు.

అప్పుడప్పుడు రచనలు పంపేవారు వంద మందికి పైగా ఉన్నారు.

రచయితలు సాటి రచయితల కథలను వీలునుబట్టి చదివి కామెంట్స్ పెడుతూ వుంటే వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

అన్ని రచనలు చదువుతూ, కామెంట్ చేసి ప్రోత్సహిస్తూ ఉన్న వారికి మా అభినందనలు.

ఇప్పుడు రచయితలే కాక, పాఠకులు కూడా తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని లాగిన్ కావచ్చును.



5. కొత్త రచయితల సమాచారం కోసం...


కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.


మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.


అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.


అక్టోబర్ 2022 నుండి మార్చ్ 2023 వరకు ప్రచురితమై, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి ఉగాది 2023 బహుమతులు ఎంపిక చెయ్యబడతాయి.


అలాగే ఏప్రిల్ 2023 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రచురింపబడి, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి విజయదశమి 2023 బహుమతులు ఎంపిక చేయబడతాయి.


ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.


ఉగాది కథల పోటీ గడువు 20 /03 /2023 తో ముగుస్తోంది.


కాబట్టి 21 /03 /2023 నుండి మాకు చేరే కథలు విజయదశమి కథల పోటీకి పరిశీలింపబడతాయి.


కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.


మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

ప్రచురింపబడే అన్ని కథలను మా యూట్యూబ్ ఛానల్ లో ఉంచుతున్నాము.

మా యూట్యూబ్ ఛానల్ ఉచితంగా సబ్స్క్రయిబ్ చేసుకొని ఆ కథలను వినవచ్చు.



మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com


మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.


వెబ్ సైట్ లింక్


మా ఫేస్బుక్ పేజీ లింక్


మా యూట్యూబ్ ఛానల్ లింక్


రచనలు పంపవలసిన మెయిల్ ఐ డి


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




107 views0 comments
bottom of page