top of page

మహోన్నతుడు దేవుడు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MahonnathuduDevudu, #మహోన్నతుడుదేవుడు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 98


Mahonnathudu Devudu - Somanna Gari Kavithalu Part 98 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/07/2025

మహోన్నతుడు దేవుడు - సోమన్న గారి కవితలు పార్ట్ 98 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


మహోన్నతుడు దేవుడు

----------------------------------------

ఉంటేనే దైవము

ఉంటుందోయ్ విశ్వము

ప్రపంచం నడుస్తుంది

లేక కకావికలము


సృష్టికి ఆధారము

చూడంగా దేవుడు

మోక్షానికి ద్వారము

చేర్చునోయి గమ్యము


ఈ సృష్టి లయ కారుడు

ఇహపరాల్లో ఉన్నతుడు

ఆశ్రయిస్తే గనుక

అతడు ఆపద్భాంధవుడు


దేవునితో ఆటలు

కాదు కాదు క్షేమము

నిప్పులతో సమానము

వద్దోయ్ దుస్సాహసము

ree

















టీచరమ్మ సూక్తులు

----------------------------------------

మనిషిలోని సద్గుణాలు

మాత్రమే చూడాలోయ్!

కల్గియుంటే లోపాలు

మెలుకువతో దిద్దాలోయ్!


మనసులోని పలు కలతలు

ఆదిలోన త్రుంచాలోయ్!

శృతిమించిన పొరపాట్లు

దిద్దుకుంటే మంచిదోయ్!


అనవసరపు విషయాలు

పట్టించుకోరాదోయ్!

బాగున్న కాపురాలు

ముక్కలు చేయరాదోయ్!


సున్నితమైనవి మనసులు

గాయం రేపరాదోయ్!

గొప్పవి మనోభావాలు

దెబ్బ తీయ రాదోయ్!

ree























చూడాలని ఉన్నది

------------------------

అపకారం చేయని

అపనిందలు వేయని

సరికొత్త లోకాన్ని

చూడాలని ఉన్నది


మాటలతో గుచ్చని

అసూయతో చూడని

ప్రేమగల మనసులను

చూడాలని ఉన్నది


బేధాలే ఉండని

బాధలు సృష్టించని

మరో ప్రపంచాన్ని

చూడాలని ఉన్నది


వెన్నుపోటు పొడవని

మానవత్వం వీడని

మహోన్నత మనుషులను

చూడాలని ఉన్నది


దేశభక్తి శ్వాసగా

దేశకీర్తి ధ్యాసగా

కల్గియుండు వారిని

చూడాలని ఉన్నది


మనుషులుగా బ్రతికే

ఆదర్శం ఒలికే

మంచోళ్లను కళ్లెదుట

చూడాలని ఉన్నది


విశ్వశాంతి కోరే

సమైక్యతే పారే

సమ సమాజాన్ని ఇల

చూడాలని ఉన్నది


ఒకే కొమ్మ పువ్వులు

స్వచ్ఛమైన నవ్వులు

విరబూసే చోటును

చూడాలని ఉన్నది

ree














చెట్టు చెప్పిన పాఠాలు

----------------------------------------

మార్పు లేని జీవితాన

ఉండదోయ్ క్రొత్తదనము

కష్టాల కడలిలోన

ఉండాలోయ్ నిబ్బరము


పొరుగువారి బ్రతుకుల్లో

పోయకు నిప్పుల కుప్పలు

వారి ఉజ్వల భవితలో

కల్గించకు ఇబ్బందులు


చేతనైతే సాయము

అందించాలి నేస్తము

విస్మరించకు ఈ నిజము

గుర్తించుకో అనిశము


అతిముఖ్యము స్నేహమే

చేయకూడదు ద్రోహమే

మేలు చేసిన వారికి

చూపరాదు కృతఘ్నతే

ree














సుభాషిత రత్నాలు

--------------------------------------

పాపాయి నవ్వుల రీతిలో

పండు వెన్నెలలా జగతిలో

రవిచంద్రుల బోలి అందరూ

వెలిగిపోవాలోయ్ బ్రతుకులో


అమ్మానాన్నల సేవలో

వారి విలువైన ప్రేమలో

బహు ఆశీర్వాదాలతో

వర్ధిల్లాలోయ్ లోకంలో


అపజయాలెన్ని ఎదురైనా

సునామీలై ఏతెంచినా

కించిత్ అధైర్యపడరాదు

పట్టుదల సడలనీయరాదు


మనోనిబ్బరం ఆయుధంగా

సానుకూల దృక్పధం శ్వాసగా

ఉండాలోయి నిరంతరము

బ్రతుకున దేదీప్యమానంగా


-గద్వాల సోమన్న

Comments


bottom of page