top of page

మలబారు నికోబారు

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #MalabarNicobar, #మలబారునికోబారు #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

ఎవరి ఆలోచన వారిది

Malabar Nicobar - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 29/10/2025

మలబారు నికోబారు - తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ


సాధారణంగా మనము ఉన్న ప్రదేశము మరియు అక్కడ విషయాల గురించే ఆలోచిస్తాము. అంతేగాని రెండో కోణములో ఆలోచన ఉండకపోవటం సహజము. ఉదాహరణకి, I.T. (ఇన్ కం టాక్స్) కార్యాలయానికి వెళితే పన్నుల గురించే ఆలోచిస్తాము, అంతేగాని I.T. (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కార్యాలయానికి వెళితే పన్నుల గురించి ఆలోచించము. "I.T." అనే మాట వాడుకలో ఉన్నప్పుడు సందర్భానుసారంగా ఆలోచిస్తాము. అదేవిధముగా కొన్ని హాస్య సందర్భాలు తెలిపే చిరు ప్రయత్నము.


నలుగురు మిత్రులలో ఒకరికి ప్రమోషన్ వచ్చిన ఆనందంలో బార్ లో మద్యపానము చేస్తున్నారు. సాధారణముగా అయిదుగురు మిత్రులు కలిసి అన్ని చోట్లకి (రమేష్, సూరజ్, రఘు, నందు) వెళ్తుంటారు.


నందు, "సూరజ్, మన మోహన్ వస్తానని ఇంకా రాలేదేమిటి?" అని అడిగాడు.


"నాకు గంట క్రితము మోహన్ కాల్ చేసి చెప్పాడురా, అనుకోకుండా 'మలబారు' కి వెళ్తున్నాని ఈసారి పార్టీకి రాలేక పోతున్నాని చెప్పాడు."


"అంటే మోహన్ మనతో కాకుండా వేరే వాళ్లతో మందు కొట్టేందుకు వేరే 'బారుకి' వెళ్లాడన్న మాట. మనకి తెలియకుండా ఆ కొత్తబారు ఎప్పుడు ప్రారంభించరురా?" అని అడుగుతాడు నందు.


"ఆగరా, మలబారు అంటే మనము మందుకొట్టే బారు కాదురా, అది కేరళలో ఉందిరా, వాడు అక్కడకి అత్యవసర పనిమీద వెళ్ళాడు."


"ఓహో అలాగా," అని, "సరే గాని ఇంకో పెగ్ పోయిరా."


నందు, "నీవు ఎప్పుడయినా నికోబార్ వెల్లావురా?" అని అడుగుతాడు రఘు.


"రఘు, నీవు అన్ని కొత్తబారులు గురించి అడిగితే చెప్పడము కష్టము. నేనయితే మనకి తెలిసిన మూడు బార్లలోనే మందు తాగేనురా," అని జవాబిస్తాడు నందు.


"నందు, నికోబార్ అంటే బారు కాదురా. అది దీవి. అండమాన్ & నికోబార్ దీవి."


"ఇప్పుడు మనము స్కూల్ లో లేము, బార్లో ఉన్న సంగతి మర్చిపోవద్దు." నందు ఆలోచన ఒకవిధముగా సబబే అని నందుని సమయానుసారంగా సమర్థిస్తాడు సూరజ్.



"సరేగాని, మనము ఈ సారి డిన్నరకి ఏదయినా కొత్త హోటల్ కి వెళదాము," అంటాడు రఘు.


"ఓకే, ఇష్టా నికి వెళదాము," అని జవాబిస్తాడు సూరజ్.


"ఏమంటున్నావు, హోటల్ పేరు చెప్పకుండా, ఇష్టానికి వెళ్తానంటున్నావు. ఇంతకీ ఎవరిష్టమురా?" అని అయోమయముగా అడుగుతాడు రఘు.


"కోప్పడకురా రఘు, నే చెప్పింది హోటల్ 'ఇష్ట' బరకత్పురా లో ఉందిరా."


"ఇటువంటి హోటల్ పేర్లతో ఇబ్బందేరా," అని నలుగురు బార్ నుంచి బయటకు వస్తారు.


అందరు హోటల్ లో భోజనము చేస్తున్న సమయములో సూరజ్, "పదార్ధాలు రుచిగా ఉన్నాయి," అన్నాడు.


"నాకు మాత్రము పప్పు రుచిగా అనిపించలేదు," అని అభిప్రాయము చెప్పాడు నందు.


"సరే, ఈ సారి రుచిలో తిందాము," అంటాడు రఘు.


"ఏమంటున్నావు, రుచిలో తిందాము ఏమిటి, రుచిగా ఉన్నచోట తిందాము అనాలికదా?" అని అంటాడు సూరజ్.


"మీరు విన్నది, నే చెప్పింది నిజమే, నెక్స్ట్ టైం మనము రుచి హోటల్ లో డిన్నర్ చేద్దాము."


"ఈ హోటల్ పేర్లతో తికమకగా ఉంది," అంటాడు రఘు.


"మీరు ఇంకా విచిత్రమయిన పేర్లు విన లేదేమో. కొన్ని హోటల్ పేర్లు వివాహ భోజనము, తిన్నంత భోజనము, అరిటాకు వగైరా," అని వివరిస్తాడు రఘు.


***

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


Comments


bottom of page