top of page

మాలిని'Malini' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 21/06/2024

'మాలిని' తెలుగు కథ

రచన: శివ జ్యోతి


మాలిని పరికిణి జాకెట్టు వేసుకొని పొలం గట్టుపై నడుస్తుంటే ఆ పొలానికి అందం అధికమైందనిపించేలా వుంది. పొలానికి బహు దూరంగా పట్టణంలో ఒక కారు రోడ్డు మీద వెళ్తూ ఉంది. అందులో వైట్ షర్ట్, డార్క్ బ్లూ జీన్స్ కూల్ షేడ్స్ తో ఒకతను తన జాగ్వార్ ఎక్స్ జె ఆర్ 15 నుంచి దిగాడు ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. అతని అమ్మ తలుపు తీసింది. 


“హాయ్ మామ్” అంటూ కౌగిలించుకున్నాడు. 


“రా రాజేష్! భోంచేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పటికే లేట్ అయింది” అంది అమ్మ. 


వేడివేడిగా సంగటి, నాటుకోడి చేసి కొడుకుకి ప్రేమగా పెట్టింది. రాజేష్ అది తింటూ “వావ్! ఇంత అద్భుతంగా ఇంకెవ్వరూ వండలేరు. నీకు నువ్వే సాటి” అన్నాడు. 


అమ్మ “అదేం లేదురా! నేను ఊర్లో నేర్చుకున్నాను. ఊర్లో నాకన్నా ఇంకా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు” అంది. 


“తాతయ్య, బామ్మ నిన్ను అడుగుతూ ఉంటారు. ఒకరోజు రావా ఊరికి వెళ్దాం” అని అడిగింది. 

రాజేష్ తన బెస్ట్ ఫ్రెండ్, ఇంకా మేనేజర్ అయిన కిషోర్ వంక చూసి డేట్ అరేంజ్ చేయమన్నాడు. అమ్మ సంతోషంగా ఫీల్ అయింది. రాజేష్ ఇంకా కిషోర్ ఆఫీస్ కి వెళ్లారు. 


కిషోర్ “మన ఫ్రెండ్ మహతిని పెళ్లి చేసుకోవచ్చు కదరా ? తనకు కూడా నువ్వంటే ఇష్టమేగా” అని రాజేష్ ని అడిగాడు. 


రాజేష్ “మహతి నా టైప్ కాదురా” అన్నాడు. 


కిషోర్ “మరి నీ టైప్ ఎవరు.. వారిని చూసి చేసుకోవచ్చుగా. ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, ఒక పార్టీ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. ఎప్పుడూ కష్టపడటమేనా? సంతోషంగా ఉండడం కూడా అవసరమేరా. నీ ప్రపంచం నేను, అమ్మ, ఆఫీస్ దగ్గరే ఆగిపోయింది. ముందుకెళ్ళరా. పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు” అన్నాడు. 


“సర్లే చూద్దాంలే, వెళ్దాం రారా కిషోర్ ” అన్నాడు రాజేష్. 


ఇద్దరూ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఇన్స్పెక్షన్ చేశారు, మీటింగ్ అటెండ్ అయ్యారు, టెండర్స్ వేశారు, బిజీగా ఉన్నారు. ఇంటికి వెళ్లారు. 


 ఒకరోజు అమ్మ, రాజేష్, కిషోర్ ముగ్గురూ ఊరికి బయలుదేరారు. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసింది మాలిని. అందరూ తిన్నారు. వంట ఎవరు చేశారని అడిగాడు రాజేష్. అమ్మ మాలినినీ పిలిచింది. రాజేష్ మాలినిని చూశాడు. చూస్తూనే ఉన్నాడు. కిషోర్ రాజేష్ భుజం మీద చేయి వేసి కుదిపాడు. 


రాజేష్ తేరుకొని “మాలినీ! వంట బాగా చేశావు” అని చెప్పాడు. అమ్మ, రాజేష్, కిషోర్ ముగ్గురూ బయలుదేరి వెళ్లిపోయారు. 


 రాజేష్ మాలినిని గుర్తు చేసుకుంటున్నాడు. మాలినిని పెళ్లి చేసుకుంటానని కిషోర్తో విషయం చెప్పాడు. కిషోర్ రాజేష్ అమ్మతో చెప్పి ఊరికి వెళ్ళాడు. అమ్మ సంతోషించింది. 


కిషోర్ తనతో పాటు ఒక టీచర్ని, ఒక గ్రూమింగ్ ఎక్స్పర్ట్ ని, చాలా లగేజ్ ని కారులో తీసుకెళ్లాడు. 


“మాలినీ! రాజేష్ ని పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాడు. 


మాలిని చదువు రానిదే కానీ అమాయకురాలు కాదు. 


“నాకు అతను సమయం ఇవ్వాలి, ప్రేమగా చూసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు” అని అడిగింది. 


“నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతోనే నిన్ను పట్నానికి అనుకూలంగా మార్చడానికి ఈ ఏర్పాట్లన్నీ చేసి తీసుకొచ్చాను. నీకు అభ్యంతరం లేదుగా. ఒక టీచర్ని కూడా తెచ్చాను, నీకు చదువు నేర్పడానికి. సరేనా” అని అడిగాడు. సరేనంది మాలిని. 


ఆరు నెలలు గడిచాయి. మాలిని ఇంకా అందంగా ఎంతో హుందాగా తయారైంది. బాగా చదువుకుంది. మాలినిని చూచి ఎవరు అయినా ఊరి నుంచి వచ్చింది అని అనే లాగా లేదు. 

రాజేష్కి మాలినితో పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదట అబ్బాయి, తర్వాత అమ్మాయి పుట్టారు. 


కర్మాగార బాధ్యతలతో జీవితం ఎంత యాంత్రికంగా గడిచినా, వారు తమ ఆనందాలని సమయాన్ని, సంతోషాల్ని, సరదాల్ని కలిసి పంచుకుంటూ సంతోషంగా ఉన్నారు. 


రాజేష్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. పోస్టుమార్టం అయింది. రాజేష్ శవం ఇంటికి వచ్చింది. కిషోర్, మహతి ఈ ఆపద సమయంలో మాలినికి తోడుగా నిలిచారు. ధైర్యం చెప్పారు. మాలిని ఆఫీస్ బాధ్యతలు చేపట్టింది. కిషోర్, మహతి మాలినికి ఆఫీస్ లో చేదోడువాదోడుగా ఉన్నారు. 


ఒక అతను మాలినినీ తదేకంగా చూస్తున్నాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్లే సమయంలో మాలినినీ అతను ఫాలో అయ్యాడు. కార్ లోంచి మహతి కూడా దిగడంతో వారికి కనపడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఒకరోజు వారి ఇంటి దగ్గర గేటు ముందు బాగా గొడవ చేశాడు. నేను మాలినితో మాట్లాడాలి అని గట్టిగా అరిచాడు. ‘మాలిని.. మాలిని’ అంటూ గట్టిగా కేకలేశాడు. 


‘నీ భర్త చావుకి కారణం నీ మీద తనకున్న ప్రేమ’ అన్నాడు. 


‘నా మాట విను మాలిని..’ అన్నాడు. 


అక్కడే ఉన్న మహతి సెక్యూరిటీ కి కేకలేసి పోలీసులకి పట్టించమని చెప్పింది. అందరూ నెమ్మదిగా గాలి పీల్చుకున్నారు


పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మాలిని, మహతి ఇంకా కిషోర్ లను ఒప్పించి దగ్గరుండి మహతి కిషోర్ ల పెళ్లి చేసింది. కొంచెం కాలం గడిచింది. వాళ్లకు కూతురు పుట్టింది. 

మాలిని “అన్నయ్యా! నీ కూతురిని నా ఇంటి కోడల్ని చేయి” అని అడిగింది. 


కిషోర్ “అంతకంటేనా” అని అన్నాడు. కిషోర్ ని మహతి చూసింది మాలినినీ చూసి పళ్ళు బిగబట్టి నవ్వింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మాలిని కూతురు పెళ్లి అవుతుంది అందరూ హడావిడిగా ఉన్నారు. మాలిని తన గదిలో తయారవుతోంది. మాలిని రూముకు బయట కిషోర్ పనివాళ్లను పనికి పురమాయిస్తున్నాడు.


జైలు నుంచి రిలీజ్ అయిన ఖైదీ మాలిని రూముకు వచ్చి కత్తితో బెదిరించి రూమ్ తలుపులు వేశాడు. కాసేపటి తర్వాత మాలిని తలుపులు తీసుకొని బయటకొచ్చింది. కూతురు పెళ్లి ఘనంగా చేసింది. పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కొక్కళ్ళుగా బయలుదేరారు. అమ్మాయిని అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపింది. 


మహతి తను కూడా బయలుదేరుతానని కిషోర్ తో కలిసి వచ్చి చెప్పింది. మాలిని కుడి చెయ్యి పైకెత్తి కుడి చేయి వేళ్ళని కుడి వైపుకి కదిలిస్తూ చిరాకుగా వెళ్ళమని చెప్పింది. కిషోర్, మహతి వారి ఇంటికి వెళ్లి పోయారు 


మహతి కూతురు నిద్రపోయింది. కిషోర్, మహతి పడుకున్నారు. మహతి ఏదో ఆలోచిస్తోంది. కిషోర్ దిండు తీసుకుని మహతి ముఖం మీద పెట్టి గట్టిగా అదిమి చంపేశాడు. మహతి చనిపోయింది. కిషోర్ ఏడుస్తూ ‘నీలాంటి వారి వల్లే అయిన వారి దగ్గర కూడా అజాగ్రత్తగా ఉండకూడదని అంటారందరూ’ అని మహతి వైపు చూస్తూ అన్నాడు. 


కిషోర్ ని అరెస్ట్ చేయటానికి పోలీసులు వచ్చారు. కిషోర్ని తీసుకెళ్తున్నారు. కిషోర్ మాలిని చూచి “మాలిని, నీతో అతను చెప్పింది నేను విన్నాను. నీ భర్త చావుకి కారణమైన ఈ మూర్ఖురాలిని నేను చంపేశాను. నా కూతురు బాధ్యత నీది” అన్నాడు. 


మాలిని కిషోర్ కూతుర్ని అక్కున చేర్చుకుంది మాలిని. కొడుక్కి మహతి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది. 


ఒక ఆడది నిరాకరణని తట్టుకోలేక ఒక ప్రాణం తీస్తే మరో ఆడది చంపింది తన భర్తనే అయినా క్షమించి, చంపిన ఆవిడ కూతురిని మనస్ఫూర్తిగా తన కోడల్ని చేసుకుని తన మహత్యాన్ని చాటుకుంది. ఆడతనం విలువని వేయింతలు చేసింది. అటువంటి ఆడవారికి నా జోహార్లు. 

***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


98 views0 comments

Comments


bottom of page