మన శాస్త్రజ్ఞులు - 9 - జగదీష్ చంద్రబోస్
- Addanki Lakshmi

- 6 days ago
- 6 min read
జగదీష్ చంద్రబోస్, Jagadish Chandra Bose, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ శాస్త్రవేత్త, మొక్కలకు జీవం, క్రెస్కోగ్రాఫ్, వైర్లెస్ కమ్యూనికేషన్, రేడియో తరంగాలు, బోస్ ఇన్స్టిట్యూట్, తెలుగు కవిత

Mana Sasthrajnulu - 9 - Jagadish Chandra Bose - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 9 - జగదీష్ చంద్రబోస్ - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 09/07/2026
భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తీసుకువచ్చిన గొప్ప శాస్త్రవేత్తలలో జగదీష్ చంద్రబోస్ ఒకరు. మొక్కలకు కూడా జీవం ఉందని శాస్త్రీయంగా నిరూపించి, వైర్లెస్ కమ్యూనికేషన్ పరిశోధనలకు బాటలు వేసిన ఆయన విజ్ఞాన ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారు. అద్దంకి లక్ష్మి రచించిన "బహుముఖ ప్రజ్ఞాశాల" కవిత, జగదీష్ చంద్రబోస్ జీవిత విశేషాలు, శాస్త్రీయ విజయాలు, భారత విజ్ఞానానికి ఆయన చేసిన అపూర్వ సేవలను సరళంగా, ప్రేరణాత్మకంగా పరిచయం చేస్తుంది.
తూర్పు బెంగాల్ దేశములో జన్మించిన జగదీష్ చంద్రబోస్.
కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ పొందే.
వృక్షశాస్త్రము లోనూ భౌతిక శాస్త్రంలోనూ గొప్ప పరిశోధనలు చేసే.
మొక్కలకు జీవం ఉందని శాస్త్రీయంగా నిరూపించే.
వైర్లెస్ సాంకేతాలపై పరిశోధనలు సలిపే. మొక్కల పెరుగుదల, స్పందనలు తెలిపే క్రిస్టోగ్రాఫ్ ని కనుగొనే.
కలకత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించే మహానుభావుడు.
వైర్లెస్ కమ్యూనికేషన్ పితామహునిగా ప్రఖ్యాతి.
రేడియో తరంగాలను వైర్లెస్ ఈనాటి వైఫైలకు ఉపయోగకారి అయిన మూలపురుషుడు.
అమెరికా పేటెంట్ హక్కులు పొందిన తొలి భారతీయుడు.
శాస్త్రవేత్తల పరిశోధనలకు ఈయనే మార్గదర్శకులు.
బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్ చంద్రబోస్.
====================================

Mana Sasthrajnulu - 8 - Acharya Nagarjunudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 8 - ఆచార్య నాగార్జునుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 16/06/2026
భారతదేశ చరిత్రలో ఆచార్య నాగార్జునుడు ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్న మహనీయుడు. బౌద్ధమత తత్వవేత్తగా, మహాయాన సిద్ధాంత ప్రచారకుడిగా, రసాయన శాస్త్రవేత్తగా, వైద్యునిగా ఆయన చేసిన సేవలు అపారమైనవి. శూన్యత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి బౌద్ధ తత్వానికి కొత్త దిశను చూపిన నాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయంతో పాటు నాగార్జునకొండకు కూడా చిరస్థాయిగా గుర్తింపు తెచ్చారు. అద్దంకి లక్ష్మి రచించిన ఈ కవిత ఆయన జీవిత విశేషాలను సంక్షిప్తంగా, స్ఫూర్తిదాయకంగా పరిచయం చేస్తుంది.
ఆచార్య నాగార్జునడు బౌద్ధమత తత్వవేత్త. క్రీస్తుశకం రెండవ శతాబ్దానికి చెందినవాడు.
ఆంధ్రప్రదేశ్లో వేదలి గ్రామములో
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించె,
కనిష్క చక్రవర్తికి సమకాలీకుడు,
మహాయానా బౌద్ధ మతంలోని శూన్యత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే,
మూలపురుషుడిగా ప్రఖ్యాతిగాంచే,
నాగార్జున కొండను కేంద్రంగా చేసుకొని బౌద్ధ మతాన్ని విస్తరింపజేసే.
మాధ్యమిక కారిక, ప్రజ్ఞాపార మితి సూత్రాలు,సుహ్న లేఖ,
రత్నావళి గ్రంథాలకు కర్త,
తంత్ర యంత్ర విద్యలలో ప్రఖ్యాతి గాంచే.
రసాయనిక శాస్త్రంలో ప్రయోగాలు చేసే .
ఆయుర్వేద చికిత్సలో వైద్యుడిగా ప్రసిద్ధి పొందే.
లోహాలను పసిడిగా మార్చే రసవిద్య జ్ఞానం కలవాడు,
నలంద విశ్వ విద్యాలయంలో ఆచార్యుడు,
దక్షిణ భారతాన బౌద్ధ మతాన్ని నిలబెట్టిన ఆచార్యుడు,
రెండవ బుద్ధునిగా ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త.
=========================================

Mana Sasthrajnulu - 7 - Bhaskaracharyudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 7 - భాస్కరాచార్యుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 26/05/2026
🪐📖“గణితానికి గౌరవం తెచ్చిన భారత మహర్షి — భాస్కరాచార్యుడు”
ప్రేరణాత్మక తెలుగు కవిత ✨
మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో నివసించాడు. ఏడవ శతాబ్దానికి చెందిన
గణిత శాస్త్రజ్ఞుడు.
ఖగోళ గణిత పరిశోధనకు ప్రఖ్యాతి గాంచాడు.
భారతీయ బీజ గణితాన్ని పాశ్చాత్యులకు అందించాడు.
గ్రహాలన్నీ తమ తమ కక్ష్యలలో గురుత్వాకర్షణ శక్తితో పరిభ్రమిస్తున్నాయని తెలియజేశాడు.
చిన్నతనంలోనే పరిశోధనలు ప్రారంభించాడు.
ఉజ్జయినిలోని ఖగోళ గణిత శాస్త్ర అధ్యక్షులు.
కూతురు లీలావతితో కలిసి ఈ పరిశోధనలు చేశాడు.
అతని సిద్ధాంత శిరోమణి, లీలావతి గణితమనే గ్రంథాలు ప్రఖ్యాతి పొందాయి.
ధర్మాలను, వర్గాలను, వర్గమూలాలను విశదపరిచాడు.
వృత్త, క్షేత్ర వ్యాసాలు, పరిధులు, నిష్పత్తులు వివరించాడు.
ధనాత్మక, రుణాత్మక అంకెలను విపులీకరించాడు.
న్యూటన్ కనిపెట్టకముందే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని బోధించాడు. భారత శాస్త్రవేత్తలలో ప్రఖ్యాతిగాంచిన భాస్కరాచార్యుడు.
====================================

Mana Sasthrajnulu - 6 - Brahmagupthudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 6 - బ్రహ్మగుప్తుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 16/05/2026
అంశం: బ్రహ్మగుప్తుడు
శీర్షిక: గణిత శాస్త్రవేత్త
భారతీయ గణిత శాస్త్రవేత్తలలో ప్రముఖుడు.
గణిత, ఖగోళ శాస్త్రాలు రచనలు చేసిన మహా జ్ఞాని.
క్రీస్తుశకం ఆరవ శతాబ్దానికి చెందినవాడు.
వ్యాఘ్రముఖ మహారాజు ఆస్థాన వేత్త.
గుర్జర దేశ వాసీయుడు.
ఉజ్జయినిలో గల ఖగోళ వేధశాల పండితుడు.
ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర విషయాలు పరిశోధించినాడు.
సున్నాను సున్నాతో భాగించవచ్చని;
రెండు గుణ సంఖ్యల గుణకారం ధనాత్మకం అని తెలిపినాడు;
దశాంశ పద్ధతిని ప్రపంచానికి చాటినాడు.
గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని
న్యూటన్ కన్నా ముందుగా కనుక్కున్న శాస్త్రజ్ఞుడు.
చాదమేఖల, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం,
ఖండఖాద్యక గ్రంథం రచించిన శాస్త్రవేత్త.
చతురస్రపు భుజాల కొలతలు సూత్రీకరించాడు.
ఖగోళ పరిశోధన చేసి,
భూమి గుండ్రముగా ఉందని,
గురుత్వాకర్షణ కలిగి ఉందని చెప్పాడు.
భారతీయ అంకగణిత శాస్త్ర పరిశోధన నిపుణుడు.
=====================================

Mana Sasthrajnulu - 5 - Kanadudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 5 - కణాదుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 08/05/2026
గుజరాత్‌లోని ద్వారకలో జన్మించినాడు,
కశ్యప ప్రజాపతి వంశంలో ఉలూక మహర్షి కుమారుడు.
పరమాణు రహస్యాన్ని మొదట తెలియజేసిన విజ్ఞానవేత్త,
కణాదుడు అణు సిద్ధాంతకర్త.
అణువుల సంయోగమే పదార్థ రూపమని అన్నాడు,
అవి అవిభాజ్యమని తెలియజేశాడు.
సృష్టిలోని సమస్త ఆకారాలు వివిధ శైలి విన్యాసాల
పరమాణువుల సమ్మేళనమని అన్నాడు.
అణువు, పరమాణువుల రహస్యాన్ని వెల్లడి చేశాడు.
వైశేషిక దర్శన గ్రంథంలో భౌతిక సూత్రాలను రచించి,
వాటి రహస్యాలను వివరించాడు.
పరమాణువులు విచ్ఛిన్నం కావని తెలిపాడు.
విశ్వం ఆవిర్భావానికి అణు సంయోగమే కారణమని వివరించాడు.
పదార్థ లక్షణాలు ఆరు అని తెలియజేశాడు.
భౌతిక విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని
మొదట సమన్వయపరచిన వేదాంతవేత్త.
ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంత ప్రతిపాదనకు
మూలం మన కణాద ముని సిద్ధాంతమే.
భారతీయ శాస్త్ర విజ్ఞానం
ప్రపంచ శాస్త్రవేత్తలకు వెలుగుబాట.
=====================================

Mana Sasthrajnulu - 4 - Boudhayanudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 4 - బౌధాయనుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 28/04/2026
భారతీయ గణిత విజ్ఞానానికి పునాది వేసిన మహామేధావి బౌధాయనుడు.
గణితం, ధర్మం, శాస్త్రం – ఈ మూడు రంగాలలో ఆయన చేసిన సేవలను స్మరించుకునే కవిత ఇది.
భారతీయ ప్రాచీన గణిత శాస్త్రవేత్త బౌధాయనుడు.
క్రీస్తుపూర్వం 800 – 600 మధ్య కాలానికి చెందినవాడు.
కణ్వ మహర్షి కుమారుడు.
గణిత శాస్త్రానికి పునాదులు వేసిన పురాణ పురుషుడు.
పైథాగరస్, కల్ప, ధర్మ సూత్రాలను బోధించాడు.
వృత్తాలు, చతురస్రాలు, త్రిభుజాలకు ప్రమాణాన్ని వివరించాడు.
యజ్ఞ వేదికల నిర్మాణం, కొలతలను రూపొందించాడు.
గ్రహాలు, నక్షత్రాల దూరాలను గణించి చూపించాడు.
సంఖ్య యొక్క వర్గమూలాన్ని లెక్కించాడు. మనిషి ఆచరించవలసిన ధర్మాన్ని గ్రంథాలలో రచించాడు.
కృష్ణ యజుర్వేదపు సూత్రాలకు కర్త.
ధర్మాధర్మ విచక్షణకు అవసరమైన పద్ధతుల రూపకర్త.
మనిషి జన్మలో ఎన్నో తప్పులు చేస్తారు.
తప్పులు సవరించుకునే ప్రాయశ్చిత్తాలను సమాజానికి అందించిన మహద్గురువు.
=====================================

Mana Sasthrajnulu - 3 - Charakudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 3 - చరకుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 22/04/2026
ఆయుర్వేదానికి పునాది వేసిన చరకుడు, చరక సంహిత విశేషాలు, ఆరోగ్య సూత్రాలు – అద్దంకి లక్ష్మి రాసిన కవిత.
చరక సంహిత గ్రంథము రచించిన విజ్ఞాన వేత్త.
వృక్ష ఖనిజ రసాయన ఔషధాలు వినియోగించిన ఆయుర్వేద కర్త.
కుషాణ రాజు కనిష్కుని ఆస్థాన వైద్యుడిగా ప్రసిద్ధి,
క్రీస్తుపూర్వం రెండు నాలుగు శతాబ్దంలో ఆయుర్వేద వైద్య శిఖామణి.
పల్లపల్లెకు సంచరిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించిన సంఘ సేవకుడు.
ఆరోగ్య సూత్రాలను తెలియపరచిన వైద్య నిపుణుడు.
వాత పిత్త శ్లేష్మ దోషాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ,
ఉసిరి తాని కరక్కాయల తో త్రిఫల చూర్ణాన్ని కనుగెనె,
పక్షవాతం మూర్ఛ కుష్టు వ్యాధి రోగాలకు మందులు తయారు చేసె.
మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని తెలిపే.
అష్టాంగ స్థానములుగా రచించిన చరక సంహిత గ్రంథము.
ఆయుర్వేద వైద్యానికి మూలము.
మనిషి జీవనశైలియే ఆరోగ్య సూత్రము.
వేళకు భోజనం, వ్యాయామం, మంత్రోచ్ఛారణ ఆరోగ్యానికి మూలము.
ఆయువుని వృద్ధి చేసేదే ఆయుర్వేదము,
చరకుని సందేశము
=====================================

Mana Sasthrajnulu - 2 - Susruthudu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 2 - సుశ్రుతుడు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 18/04/2026
ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి ఆయుర్వేదం. ఆ వైద్య శాస్త్రాన్ని వ్యవస్థీకరించిన మహామేధావి సుశ్రుతుడు.
ఈ కవిత ఆయన మహిమను మనకు పరిచయం చేస్తుంది.
గుప్తుల కాలం నాటివాడు.
ఆరవ శతాబ్దంలో వారణాసిలో జన్మించిన సుశ్రుతుడు.
ఆయుర్వేద వైద్యవిద్యకు మూలకారకుడు.
సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద పుస్తకము
రాసిన వైద్య నిపుణుడు.
శరీరంలోని అవయవాలపై విశేష అవగాహన కలిగినవాడు.
ప్రకృతి చికిత్సలో ప్రసిద్ధి గాంచిన ఋషి పుంగవుడు.
వ్యాధుల నివారణ ఉపాయాలను విపులంగా వివరించాడు.
శరీరావయవాలపై పూర్తిగా అవగాహన కలవాడు.
విరిగిన అవయవాలను అతికించాడు.
నూతన పరికరాలను ఆవిష్కరించాడు.
ఇతడు ధన్వంతరి వద్ద విద్యను అభ్యసించాడు.
ప్రాచీన శస్త్ర చికిత్సకు మూలకారకుడు.
వైద్యో నారాయణో హరిః
====================================

Mana Sasthrajnulu - 1 - Aryabhattu - Telugu Poems | Addanki Lakshmi
మన శాస్త్రజ్ఞులు - 1 - ఆర్యభట్టు - తెలుగు కవితలు | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 13/04/2026
ప్రాచీన భారతదేశంలోనేశాస్త్ర విజ్ఞానం అత్యున్నత స్థాయికి చేరింది.
ఆ కాలంలోనే భూమి గమనాన్ని, గ్రహాల స్వభావాన్నిశాస్త్రీయంగా వివరించిన మహామేధావిAryabhata.
ఈ కవితలో ఆయన గొప్ప కృషిని తెలుసుకుందాం.
పాటలీపుత్రంలోని కుసుమపురిలో పుట్టిన ప్రతిభావంతుడు.
ప్రాచీన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు.
ప్రఖ్యాతి గాంచిన ఖగోళ శాస్త్రజ్ఞుడు.
చిన్న వయసులోనే వన్నెకెక్కిన గొప్ప మేధావంతుడు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని,
భూ భ్రమణం వలన పగలు రాత్రి ఏర్పడతాయని,
గ్రహాలకు స్వయం ప్రకాశ శక్తి లేదని; సూర్యకాంతి గ్రహాలపై పడుతుందని,
ఖగోళంపై ఎంతో పరిశోధనలు చేసిన మేధావి.
ఆర్యభట్టీయము రాసిన గ్రంథకర్త.
పై విలువలను నిరూపించిన సృష్టికర్త.
శూన్యం యొక్క ప్రాముఖ్యతను నిరూపించిన గణితవేత్త.
ప్రాచీన కాలములో అగ్రగణ్యుడుగా వెలిగిన తొలి శాస్త్రవేత్త.
భారతీయ తొలి ఉపగ్రహానికి ఆయన పేరుపై సార్థకత.
***
👉 మీకు ఇష్టమైన శాస్త్రవేత్త ఎవరు? కామెంట్‌లో చెప్పండి!
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments