top of page

మానవ ధర్మము



'Manava Dharmamu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 09/12/2023

'మానవ ధర్మము' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


తొలియమ్మ మనయమ్మ

మలియమ్మ మహియమ్మ

పుడమిన సృష్టికి మూలము ఇనుడన

పంచభూతము లందొకడగు

రెండవ దనగను పుడమియె

మూడవ దనగను జెప్పగ

జీవికి శ్వాసను ఇచ్చెడి జీవన మనగను

నాలుక దడుపను నారమె

ఐదవ దనగను ఆకస మందురు

పంచ భూతములు లేకను జీవికి

ఎంచను బతుకన ఎరుగరు జూడన్

కృతజ్ఞతా భావము జూపుచు

తలిదండ్రుల తోడుగ తగునని

పంచ భూతములకును నిత్యము

ప్రణమిల్ల మానవ ధర్మము

అనుచును దలువగ ఆరోగ్యంబే

నీరును నిప్పుయు నింగియు

నింగిచూలియు నిశ్చల

నిజమగు దేవత లనుచును

పరమాత్మ రూపమనుచును

ప్రణమిల్ల ప్రశాంత జీవన మగునిక

-------------------------

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.

31 views0 comments
bottom of page