మానవత్వం
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Oct 5
- 2 min read
#Manavathvam, #మానవత్వం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguPoem, #తెలుగుకవిత

Manavathvam - New Telugu Poem Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 05/10/2025
మానవత్వం - తెలుగు కవిత
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అప్పుడు సమయం సాయంత్రం ఏడుగంటలు....
ఆకాశం నిండా వర్షపు కారుమేఘాలు...
ఇలపై గగనం నుండి వర్షపు చినుకులు....
ఈదురుగాలి వురుములు మెరుపులు....
ఉద్యోగులు కార్యాలయాల నుండి....
ఎవరి వాహనాలపై వారు ఇండ్లకు బయలుదేరారు.....
ఏక్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక?....
వేగం ఆవేశం అనర్థానికి దారి తీస్తాయి....
ఆనంద్ స్కూటర్ జారి నేల కొరిగింది...
తలకు గాయం, రక్తం స్పృహ కోల్పోయాడు.....
ఎవరి అవసరం వారిది ఒకరినొకరు....
పట్టించుకొనే సమయం కాదది....
ఆనంద్ నిర్జీవ స్థితిలో వాననీటిలో రోడ్డు ప్రక్కన....
అవంతి ఆదృశ్యాన్ని చూచి ఆటోను ఆపింది...
డ్రైవర్ సాయంతో ఆనంద్‍ను ఆటోలో చేర్చింది....
హాస్పిటల్‍కు తీసుకొచ్చి డాక్టర్‍ను కలిసింది....
వైద్యుడు అతను నీకు ఏమౌతాడని అడిగాడు....
ఆందోళనతో వున్న అవంతి మా అన్నయ్య అంది....
ఆ మాట కాగితంపై రికార్డు చేయబడింది...
అతను బ్రతకాలి దైవాన్ని వేడుకొంటూ నర్స్ చూపిన....
చోట, అవంతి కాగితంపై సంతకం చేసింది....
వార్డుకు తీసుకెళ్ళి ఆనంద్‍కు చికిత్స ప్రారంభించారు....
ఒక నర్స్ అడిగింది, వారు నీకు ఎలా తెలుసని అవంతిని....
ఇంతకు ముందు మాకు పరిచయం లేదంది అవంతి…
వారిది మా ప్రక్క ఇల్లే వారు నాకు బాగా తెలుసు...
నర్స్ ఆనంద్ ఇంటికి పోన్ చేసి విషయాన్ని చెప్పింది....
వచ్చారు ఆనంద్ తల్లిదండ్రులు ఆఘమేఘాల మీద....
మీ కొడుకును ఆపదనుండి కాపాడినది ఈ అవంతి…
ఆ వృద్ధ తల్లితండ్రులు అవంతికి నమస్కరించారు కన్నీటితో....
నాకు కావలసింది మీ ఆశీర్వాదం అంది అవంతి....
మంచి మానవత్వం నాకు నేర్పింది మా అమ్మానాన్నలు.....
చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసింది ఆ బంగారు తల్లి....
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments