top of page
Original.png

మంచి మనసు


ree

'Manchi Manasu' New Telugu Story




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సిరి ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తెలివైన,మంచి మనసున్న అమ్మాయి కూడా. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఇట్టే అప్పచెప్పేది. వీధిలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉండేది సిరి. అందుకే సిరి అంటే ఉపాధ్యాయులకే కాదు ఊరు వారందరికీ చాలా ఇష్టం.

పెద్దలతో మర్యాదగా మాట్లాడేది. అమ్మా నాన్నలకు ఇంటి పనిలో సహాయం చేసేది. ఏ పని చెప్పినా చిటికెలో చేసి పెట్టేది సిరి.


పాఠశాలకు వెళ్ళేటప్పుడు,వచ్చేటప్పుడు సిరికి దారి పొడవునా స్నేహితులే. అందరినీ మందలిస్తూ బాగోగులు తెలుసుకుంటూ పాఠశాలకు చేరుకునేది. చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలు ఉన్న సిరిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయేవారు.


ఒకరోజు సిరి అనారోగ్యానికి గురి కావడంతో మూడు రోజులు పాఠశాలకు వెళ్ళలేదు. సిరి కనిపించకపోవడంతో వీధిలోని బామ్మలంతా వాకబు చేస్తూ సిరి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయిన సిరి వాళ్ళ నాన్న 'ఇలా వచ్చారు ఏంటి బామ్మా!' అని అడిగారు.


'సిరి ఎలా ఉంది నాయనా! రెండు రోజుల నుండి కనిపించకపోయేసరికి మేమంతా భయపడిపోయి ఇలా వచ్చాము. సిరి పాఠశాలకు వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ మా బాగోగులు తెలుసుకొని మమ్మల్ని నవ్విస్తూ, మాతో గడిపేది. మాకు కావలసిన పనులను కూడా చేసి పెట్టేది” అని బామ్మలంతా చెప్పగానే తండ్రి చాలా సంతోషించాడు.


'సిరికి ఒంట్లో బాగోలేదు. అందుకే పాఠశాలకు రాలేదు. ఇప్పుడు కోలుకుంది. రేపటి నుండి పాఠశాలకు వస్తుంది” అని చెప్పాడు సిరి వాళ్ళ నాన్న. సిరి బాగోగులు తెలుసుకొని తమ వెంట తెచ్చిన పండ్లను సిరికి ఇచ్చి సంతోషంగా అక్కడి నుండి వెళ్లారు బామ్మలు.


తన కూతురికి చిన్న తనం నుండే వృద్ధులకు సేవ చేయాలి,వారితో మాట్లాడాలి అనే ఆలోచన వచ్చినందుకు,సేవా గుణం అలవడినందుకు ఎంతో సంతోషించాడు సిరి వాళ్ళ నాన్న వెంకటేష్.


***

ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed


స్కూల్ అసిస్టెంట్- తెలుగు

నల్గొండ జిల్లా

తెలంగాణా



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page