మందుకి వెళ్ళి మాసికానికి వచ్చినట్లు
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #MandukuVelliMasikanikiVellinatlu, #మందుకివెళ్ళిమాసికానికివచ్చినట్లు, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #తెలుగుసామెతలు

Manduku Velli Masikaniki Vachhinatlu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 24/08/2025
మందుకి వెళ్ళి మాసికానికి వచ్చినట్లు - తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
లక్ష్మీనరసమ్మకి 78 సంవత్సరాలు. కొడుకు శంకరం దగ్గరే ఉంటోంది. షుగరు, బి.పి పుష్కలంగా ఉన్నాయి. సమయానికి ఏదో ఒకటి నోట్లో పడకపోతే విపరీతమైన నీరసం వచ్చి ప్రాణం గిల గిల లాడిపోతుంది.
ఉదయం రెండు ఇడ్లీలు, మధ్యాహ్నం పిడికెడు అన్నం, రాత్రికి గోధుమ నూక జావ ఆమె ఆహారం.
ఒక్కోరోజు రాత్రిపూట కూడా ఇడ్లీ తిని, గ్లాసుడు పాలు తాగి పడుకుంటుంది. ఒకరోజు సాయంత్రం, “నాయనా శంకరం నాకు విపరీతమైన నీరసంగా ఉంది, రెండు ఇడ్లీలు తీసుకుని తొందరగా రా” అని కొడుక్కి చెప్పింది లక్ష్మీ నరసమ్మ.
“సరేనమ్మా” అని ఇడ్లీ తేవడానికి నడుచుకుంటూ బయలుదేరి వెళ్ళాడు శంకరం. దారిపొడవునా మిత్రులతో ఫోన్ మాట్లాడుకుంటూ కిలోమీటరు దూరంలో ఉన్న హోటల్ కి వెళ్ళాడు.
మాట్లాడుతూ, మాట్లాడుతూ తల్లి చెప్పిన విషయం మర్చిపోయాడు. కాసేపటికి తెలివి తెచ్చుకుని రెండు ఇడ్లీలు కొని ఇంటికి తిరుగుముఖం పట్టాడు శంకరం.
అలా సాయంత్రం ఆరు గంటలకు వెళ్లినవాడు రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి చేరాడు. ఇడ్లీలు పట్టుకెళ్ళి తల్లి చేతిలో పెట్టాడు.
“మా నాయనే గుడ్లు గూట్లోకి వచ్చాయి. నీలాంటి వాడే మందుకి వెళ్ళి మాసికానికి వచ్చాడట” అని అంది తల్లి కొడుకు శంకరంతో.
తల్లి అల్పాహారం తిన్నాక “అమ్మా ఇందాక నువ్వు 'మందుకి వెళ్ళి మాసికానికి వచ్చాడట’ అన్నావు. అంటే ఏమిటో వివరంగా చెప్పు” అని అడిగాడు కొడుకు శంకరం.
“పూర్వం సీతాపురం అగ్రహారంలో అరవై బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అందులో పిచ్చయ్యశాస్తి కుటుంబం ఒకటి. పిచ్చయ్య శాస్త్రికి ఇద్దరు కొడుకులు రామనాథశాస్త్రి, సోమనాథశాస్త్రి.
పిచ్చయ్యశాస్త్రికి ఎనభై ఎనిమిదేళ్లు. నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. తండ్రిని పట్నంలో ఉన్న పెద్దాసుపత్రికి తీసుకువెళ్లి చూపించారు కొడుకులు.
కొన్నాళ్లపాటు మందులు వాడమని చెప్పారు వైద్యులు. ఆ ప్రకారంగా మందులు వాడుతున్నారు. కొన్ని మందులు అయిపోతే కొనడం కోసమని పట్నం బయలుదేరి వెళ్లాడు రామనాథశాస్రి.
పెద్దగా చదువుకోకపోవడం, పైగా అమాయకుడు కావడంతో పట్నంలో జనాలను చూసి భయపడ్డాడు. మందుల చీటి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడు.
అతడికి ఎక్కడా మందుల దుకాణం కనపడలేదు. బారులు తీరిన వాహనాలు, వచ్చిపోయే జనాలతో రద్దీగా ఉండటంతో గాబరా పడ్డాడు రామనాధం.
అన్ని రోడ్లు ఒకేలా ఉండడం తో వచ్చిన దారి మరచిపోయాడు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో అలా తిరిగి తిరిగి నెలరోజులకు ఇంటికి చేరుకున్నాడు.
సరిగ్గా అదే సమయానికి తండ్రికి మాసికం పెడుతున్నాడు సోమనాథశాస్త్రి. కొడుకు రాకను గమనించిన తల్లి “కొడకా! మందుకు వెళ్ళి మాసికానికి తిరిగి వచ్చావురా” అంది.
అలా ఆనాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఏ పనిమీద వెళ్ళామో ఆ విషయం మర్చిపోయి ఆలస్యంగా వచ్చిన సందర్భంలో ఈ సామెత వాడుతున్నారు” అని వివరించింది లక్ష్మీనరసమ్మ.
చేసిన తప్పును తెలుసుకున్నాడు శంకరం.
(మాసం అంటే నెల. మాసికం అంటే మరణించిన వారికి నెలకొకసారి పెట్టే శ్రాద్ధకర్మ)
***********
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
13. 01-9-2024న సాలూరు సాహితీ మిత్ర బృందం సాలూరు వారి నుంచి అష్టమ సాహితీ పురస్కారం వేగావతీ భారతీ బిరుదును పొందడం జరిగింది.
14.సాలూరు సాహితీ మిత్రబృందం వారిచే 01-09-2024 వేగావతి భారతి బిరుదు ప్రధానం.
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
7.మౌనమేలనోయి
8.ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి(సామెతల కథల సంపుటి)
9.బుంగమూతి( జాతీయాల కథల సంపుటి)
అముద్రితాలు
1.ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
2.నీకోసం* భావ కవితా సంపుటి.
3.చెట్టు కథలు
4.పేదరాశి పెద్దమ్మ కథలు
5.మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷





Comments