top of page

మనిషి మనుగడ



'Manishi Manugada' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 27/04/2024  

'మనిషి మనుగడ' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


జీవితం చిత్రమైంది. మనిషి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకుని, ఎక్కడో ఉద్యోగాలు చేసి, ఎక్కడో రిటైర్ ఐ, వూహించని చోట మరెక్కడో తనువు చాలిస్తాడు. 


కాలేజీ రోజుల్లో అమ్మాయిల ప్రేమలో పడి చివరికి ప్రేమ దోమా అదంతా ట్రాష్ అని అమ్మ నాన్న చెప్పిన చెప్పిన అమ్మాయికి తాళికట్టేస్తాడు తలవంచుకుని. 


అక్రమమో సక్రమమో వీలైనంత సంపాదించి పెళ్లి పిల్లలు బాధ్యత నిర్వహించి దొరికితే దొంగలా దొరక్కపోతే దొరగా దర్జాగా నంగనాచిలా రిటైర్ అవుతాడు. 


మరొకడేమో డబ్బువున్నా లేకపోయినా తోటి మనిషికి సాయపడాలి అనుకుంటాడు.


దీన జనోద్ధరణకు నడుంకడతాడు మానవసేవే మాధవసేవగాఅనుకుని నిస్వార్ధంగా ఉంటాడు. 


ఉన్నంతలో చదువుకుని వుద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ


 పిల్లలు వృద్ధిలోకి వస్తే వారి నీడలో సుఖంగా వుండే సామాన్యుడి జీవితం ధన్యం. 


తరతరాలఆస్తులతో వ్యాపారాలుచేసి మరింత సంపాదించి 'దేశసేవ ''చేస్తానంటూ రాజకీయాల్లో ప్రవేశించి పదవులు కొనుక్కుని ''తీరనిదాహంతో '' అక్రమాలుచేసి చివరకు జైలులో శిక్ష అనుభవిస్తాడు. 


కాస్తంత కళ్ళుముక్కు తిన్నగా ఉంటే మిడిసి పడిపోయి మోడలింగ్ చేసి సినీ రంగంలో చేరటం,

కాలం కలిసివస్తే నింగికి ఎగబాకి లేదంటే పాతాళానికి పడిపోయి అనామకులుగా మిగిలిపోతారు. 


ప్రయత్నం చేయవచ్చు కానీ అక్రమాలు చేసి, అనైతికంగా విలువలు కోలుపోయి సంపాదన ''గోల్'' అనుకుని నిన్నునువ్వు మోసం చేసుకుని '' ఎలాగో అలా '' జీవించడం పతనానికి పరాకాష్ట అవుతుంది. 


నీకువున్న నైపుణ్యంతో ఎదిగి నీ కోసమే మంచి మార్గం ఎంచుకుని ఆదర్శంగా జీవించడం,


నిన్ను ఆధారంగా చేసుకున్నవారిని ఆదరించి ప్రేమించి మనుగడ సాధించడం సంతృప్తి కలిగిస్తుంది.

**************************************************************************

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



 మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)









34 views0 comments
bottom of page