top of page

మరవరాదు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Maravaradu, #మరవరాదు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 69


Maravaradu - Somanna Gari Kavithalu Part 69 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 30/04/2025

మరవరాదు - సోమన్న గారి కవితలు పార్ట్ 69 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


మరవరాదు

----------------------------------------

నాసికలో శ్వాసలా

తోడుండే మిత్రులను

కష్టసుఖాలు పంచుకును

మరవరాదు ఆప్తులను


కంటిలోని వెలుగులా

ఇంటిలోని ప్రమిదలా

మేలు చేయు మనుషులను

మరవరాదు గురువులను


భువిని తల్లిదండ్రులను

బుద్ధి చెప్పు పెద్దలను

మరవరాదు బ్రతుకులో

నిలుపుకో! గుండెలో


నీడనిచ్చు తరువులను

అన్ని పంచు అడవులను

మరవరాదు నరకరాదు

అందమైన మొక్కలను

ree













అమ్మ నోట ఆణిముత్యాలు

----------------------------------------

నీ వైపు తప్పు లేకుంటే

ఎవరికి ఎప్పుడు తలవంచకు

నమ్మకం ఎండమావి అయితే

అచ్చోట అసలు వాదించకు


వయసులో పెద్దలను హేళన

నీ క్రింది వారిని చులకన

జీవితాన ఎన్నడు చేయకు

వ్యక్తిత్యాన్ని కోల్పోకు


సృష్టికి ఆధారము మహిళలు

కళకళలాడును సదనములు

వారిని గొప్పగా చూడాలి

ప్రత్యేక స్థానమివ్వాలి


తల్లిదండ్రులు పూజనీయులు

వారు గౌరవానికర్హులు

గుండెల్లో పెట్టుకోవాలి

సదా గూడు కట్టుకోవాలి

ree













బాధ్యత గుర్తించుకో!

----------------------------------------

ఓడినా ఓర్చుకొనుట నేర్చుకో

గెలిచినా ఒదుగుట అలవర్చుకో

గెలుపుఓటములు కడు సహజమే

ఈ నిజం వేగిరమే తెలుసుకో


శ్రమించి జీవితాన్ని మలచుకో

సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కో

పిరికితనం పారద్రోలి మదిలో

చురుకుదనం మెండుగా నింపుకో


అసూయ ద్వేషాలను మానుకో

పగ ప్రతీకారాలను త్రుంచుకో

మాతృభూమి పరిరక్షణ అందరి

కనీస బాధ్యత అని గుర్తించుకో


దేశభక్తి గుండెలో నిలుపుకో

దేశ ప్రగతి అనిశంబు కోరుకో

సమర యోధులను సదా స్మరిస్తూ

దేశకీర్తి అంతటా చాటుకో

ree





















అన్నీ! వచ్చిపోయేవే!!

----------------------------------------

చిన్న చిన్న సమస్యలకు

కుమిలి కుమిలి ఏడ్వకు

వచ్చిపోయె కష్టాలకు

హైరానా పడబోకు


ఏది కూడా స్థిరంగా

ఉండదని తెలుసుకో

గుండెను దిటవు చేసుకో

జీవించు ధైర్యంగా


అమావాస్య వెనువెంటే

పున్నమి అరుదెంచునోయ్!

కష్టనష్టాల పిమ్మటే

సుఖశాంతులు విరియునోయ్!


నీడలా వెన్నంటే

కన్న ప్రేమ కాయునోయ్!

భగవంతుని రక్షణే

కవచములా ఉండునోయ్!


అన్నీ వచ్చిపోయేవే!

చుట్టాల రీతిలోన

కలకాలం కాపురం

చేయవోయి! జీవితాన

ree









ప్రబోధ గీతిక-వెలుగుల దీపిక

----------------------------------------

ఇంటికి తలువులా

కంటికి రెప్పలా

అమ్మానాన్నలే!!

చేనుకు కంచెలా


చెట్టుకు వేరులా

చెరువుకు గట్టులా

స్నేహితులు మహిలో

భద్రత బ్రతుకులో


పడవకు తెడ్డులా

కడలికి ఒడ్డులా

ఆపద్బాంధవులు

అవనిలో వేల్పులు


విరిసిన తోటలా

కురిసిన చినుకులా

పరోపకారులే!!

బ్రతుకున కోటలా


-గద్వాల సోమన్న


Comments


bottom of page