మతం - సమ్మతం
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jul 28
- 3 min read
#MathamSammatham, #మతంసమ్మతం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

Matham Sammatham - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 28/07/2025
మతం సమ్మతం - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"మన భారతావనిలో ముఖ్యమైన మతాలు నేడు వున్నవి నాలుగు.
1. హిందూమతం 2. ఇస్లాం మతం 3. ఈసాయి మతం 4. బౌద్ధమతం
మతం అంటే ఏమిటి?... గొప్ప ప్రశ్న!....
సమాధానం!....
మానవుల మనుగడను (జీవిత విధానాన్ని) క్రమబద్ధంగా ఆ వ్యక్తి, అతనికి అయిన వారికి ఆనందం, శాంతిని, సంతోషాన్ని కలిగించు జీవన విధానం (పద్ధతులు, ఆచార వ్యవహారాలు, దైవ ఆరాధనా విధానాలు) దాన్నే ’మతం’ అంటారు. ఆ మతానికి మరోపేరు ’తల్లి’
ఒక తల్లి మనకు జన్మనిస్తుంది. మనలను తన స్థన్యంతో పెంచుతుంది, పెద్ద చేస్తుంది.
అలాగే మనం ’మతం’ అనే మన మరో ’తల్లి’ మనలను మంచి పౌరునిగా, విద్యావేత్తగా, సభ్య సమాజంలో మంచి మనిషి అన్న పేరుతో మన జీవిత గమనాన్ని సాగిస్తుంది.
అన్ని మతాలు వున్న ఈ మనదేశం మనందరికీ తల్లితో సమానం. ఈ భారత అవని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తికి మన భరత మాత తల్లితో సమానం.
కనుక... కన్నతల్లిని ఏ రీతిగా గౌరవించి అభిమానించి ప్రేమించి ఆదరిస్తామో, అలాగే మన మతాన్ని, మన భారత అవనిని, మన మతం పేరు ఊరు భాష ప్రాంతం వేరైనా తల్లి భారతిని గౌరవించాలి, అభిమానించాలి, ఆదరించాలి. అది ప్రతి ఒక్క మానవుని (ఈ భూమిపై పుట్టిన) యొక్క విద్యుక్త ధర్మం... కర్తవ్యం... ఇదే సత్యం!.... కాదని ఎవరైనా అనగలరా!... ఆ తత్వాన్ని (భావనను) వ్యతిరేకించగలరా!... ఆ భావనకు వ్యతిరేకులైన వారిని ఏమని పిలవాలి?... దేశద్రోహులు అనడం సమంజసం అవుతుంది కదూ!!??..
’ఓం నమః శివాయ... ఓం నమో నారాయణాయ....’ హైందవుల పలుకు.
’బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి’ బౌద్ధుల భావన.
’అల్లాహు అక్బర్....’ ముస్లింల మాట.
’జీసస్ ఈస్ మై లార్డ్’ క్రీస్తుల వాక్కు.
పై నాలుగు వాక్యాలు వారి వారి సిద్ధాంతాల రీత్యా వారు.... ఆ దైవాన్ని ఆరాధించే.... పిలిచే... కొలిచే విధానాలు... ఎవరి వాక్కు, స్తుతి, ప్రార్థనా వాక్యం, వారికి గొప్ప.....
మరొకరి (అన్య మతస్థులు) వేరొక మతస్థుల దైవ ప్రార్థనా విధానాలను గురించి చర్చించడం, విమర్శిమ్చడం అనుచితం, అసంబద్ధం... అమానుషత్వం...
సత్యం... ధర్మం.... న్యాయం.... దానం.... నీతి.... నిజాయితీ ఈ ఐదూ మానవ మనుగడకు మార్గ దర్శకాలు. అలాగే భూమి... ఆకాశం, నీరు, అగ్ని, వాయువు ఈ యావత్ జగతిని శాసించే పంచ దైవత్వాలు (పంచ భూతాలు) వీటి పట్ల ప్రతి మానవునకు, ఏ మతం వారైనా... సదా గౌరవం, అభిమానం, ఆదరణం అత్యవసరం... వారు... వారు ప్రశాంతమైన జీవితాన్ని సాగించేదానికి!?
ఆ శక్తులు ప్రతి మానవుని మనుగడ సాగే దానికి ఆధారాలు. వాటిని తిరస్కరించడం, ఆక్షేపించడం, అవమానపరచడం.. కారణంగా వారి వారి మనుగడ దుర్భర మౌతుంది. జీవితం వ్యాకుల పూరితంగా మారుతుంది. మనిషిలో సహజంగా వుండవలసిన మానవతా లక్షణాలకు బదులుగా దానవ (రాక్షస) లక్షణాలు ప్రబలి... చివరకు ఆ వ్యక్తిని అవి దహిస్తాయి. దహించడం అంటే చంపడం.
పరమత ద్వేషం విమర్శ మహాపాతం. సమతా మమతా సర్వజనులకు శాంతి ప్రదం. ఆనంద దాయకం.
వ్యక్తుల్లో స్వార్థం ప్రబలితే స్వాతిశయం పెరుగుతుంది. స్వాతిశయం అహంకారానికి మూలం. అహంకారికి ఆత్మ విమర్శ. అవలోకనం, విచక్షణా వుండదు. అతని వాంఛే అతనికి లక్ష్యం. దుర్భుద్ధితో ఏర్పడిన లక్ష్యం, వినాశనానికి దారి తీస్తుంది. ఆ తత్వం కలవారికి, మంచివారి మాటలు నచ్చవు. ఇష్టపడవు....మనస్సున కల స్వాతిశయం, హితుల ఆత్మీయుల మాటలను వినిపించుకోదు. లెక్కచేయదు. పర్యవసానం వారు ఊహించని రీతిగా పతనం అవుతారు.
ప్రియ సోదరులారా!... రహీమ్, రాబర్ట్.. పై విషయాలను అన్నింటినీ మా తాతగారు నాకు నేర్పారు. నేను వాటిని గురించి ఆలోచించాను. నా ఆలోచనా ఫలితం, అవన్నీ సత్యాలు, ఆచరణీయాలని గ్రహించాను. నా జీవిత గమనాన్ని నేను ఆ రీతిగానే సాగిస్తున్నాను.
మనం చిన్ననాటి నుంచి మంచి స్నేహితులం. మనం మన జీవితాంతం అలాగే వుండాలన్నది నా ఆశయం. మతం, కులం, పేరుతో, మనలోని సఖ్యతను మనం మరచి వేరు కాకూడదు. ఇది నా ధృడ సంకల్పం.
సఖ్యతతో సాధించలేనిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనం ముగ్గురం. మన జీవితాంతం ఇలాగే మంచి స్నేహితులుగా వుండాలి. మన సాటివారికి మన మంచి భావాలను తెలిపి.... వారిలో మంచి మానవత్వాన్ని పెంచాలి. దేశం అంటే మట్టి కాదు. మతం కాదు. మానవ సముదాయం. ఆ సముదాయం సఖ్యతతో ఆనందంగా అందరూ కలిసి మెలసి దేశ ప్రగతికి పాటు పడాలి. దేశంలోని అన్ని కుల మతాల వారు స్నేహ సౌభ్రాతృత్వాలతో వర్థిల్లేలా మనవంతు ప్రయత్నం మనం నిరంతరం సాగించాలి.
ఇది నా లక్ష్యం, ఆశయం. పరీక్షలు ముగిశాయి. మనం విడిపోయే సమయం ఆసన్నమైంది. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన ఆశయం మారకూడదు. మీరిరువురూ నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. నా చేతిలో చేయివేసి మీరు మీ సమ్మతిని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను." చెప్పడం ఆపి చిరునవ్వుతో రాము తన కుడి చేతిని ముందుకు సాచాడు.
రహీమ్, రాబర్ట్ లు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి పెదవులపై చిరునవ్వు. ఇరువురూ వారి కుడి చేతిని రాము చేతిలో వుంచారు. ’సమ్మతం’ ’ సమ్మతం’ అంటూ!....
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios