top of page

మాతృభూమి రక్షణ

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #MatrubhumiRakshana, #మాతృభూమిరక్షణ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Matrubhumi Rakshana - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 17/08/2025

మాతృభూమి రక్షణ - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


హాల్లో కెప్టెన్ గోపీచంద్ ది పెద్ద ఫోటో పెట్టారు. పెద్ద పూల దండ వేశారు. ఒక దీపం వెలిగించారు.

అమ్మా, నాయనమ్మ, తాతయ్య, అందరూ ఎందుకో అస్తమానం ఏడుస్తున్నారు. 


బంధు జనాలందరూ వస్తున్నారు. ‘ఏం చేస్తావమ్మా.. కర్మ ఇట్లా రాసి ఉంది’ అంటూ అనునయిస్తున్నారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతున్నారు.


పదేళ్ల చందు కి ఇదేమీ అర్థం కావటం లేదు, "అమ్మ.. అమ్మా.. ఏంటి ఇదంతా! డాడీ ఎప్పుడు వస్తారు" అంటూ అమ్మ ని అస్తమానం ప్రశ్నిస్తున్నాడు, ఆమె తన దగ్గరకు తీసుకుని కన్నీళ్లు కారుస్తోంది. 


తాతయ్య వెంటనే సమాధానం చెబుతున్నాడు. 

"వస్తాడు నాన్న, వస్తాడు. మీ డాడీ దేవుడు దగ్గరికి వెళ్ళాడు కదా. ఆయన పంపిస్తే మళ్లీ వస్తాడు, " అంటూ

బాధనంతా మనసులో దాచుకుంటూ.


ఈ సంఘటన ఏమి వాడికి తెలియటం లేదు.

అందరూ ఎందుకు వచ్చి ఇట్లా పరామర్శలు చేస్తున్నారో ఆ చిన్ని హృదయానికి అంతుపట్టడం లేదు. 


నాన్న ఎప్పుడు వచ్చినా ఇంటిలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేది, కావలసిన తీపి మిఠాయి చేస్తూ ఇల్లంతా ఆనందం.


 "ఒరేయ్ చందూ, డాడీ వస్తున్నారు, బుద్ది గా ఉండాలి. బాగా చదువుకుంటున్నానని చెప్పాలి, " అంటూ ఉండేది అమ్మ.


బామ్మ తాతయ్య అయితే సరే సరే, 

వాళ్ళందరూ తనకంటే ఎక్కువ ఆనందపడిపోయేవారు.


కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అర్థం కావటం లేదు.

అందరూ ఏడుపు ముఖాలతో ఉన్నారు. చిన్నారి చందు కి 10 సంవత్సరాలు కూడా లేవు. ఆ లేత మనసుకి ఏమీ అర్థం అవుతుంది?


మర్నాడు కెప్టెన్ గోపీచంద్ బాడీని తీసుకువచ్చారు

తండ్రిని ఆ విధంగా డబ్బాలో చూసి పిచ్చెక్కిపోయాడు "డాడీ! ఇదేమిటి ఇక్కడ ఉన్నావు? మాట్లాడు నాతో మాట్లాడు” అంటూ తండ్రి మీద పడి ఏడుస్తున్నాడు.

 

తల్లి పిల్లవాడిని దగ్గర తీసుకుంది. తాత, బామ్మ “మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడు, వస్తాడు,” అంటూ సంజాయిస్తున్నారు.


“లేదు. నేను ఇప్పుడే డాడీ తో మాట్లాడాలి” అంటూ ఒకటే గోల చేస్తున్నాడు. వాడిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది


ఆ వూరి ప్రజలందరూ, చుట్టాలందరూ చాలామంది వచ్చారు. సమయానికి మిలిటరీ పద్ధతుల ప్రకారం గౌరవం చేస్తూ గన్స్ పేల్చి లెఫ్ట్ రైట్ అంటూ, గోపీచంద్ బాడీని తీసుకువెళ్లారు. గ్రామం అంతా విషాదంగా కదలి వెళుతోంది.


చందు కిందపడి ఏడుస్తూ దొర్లుతున్నాడు. వాడిని పట్టుకోవడం కష్టంగా ఉంది తల్లికి. 

"మా డాడీ ని తీసుకెళ్లొద్దు.. మా డాడీని తీసుకెళ్లొద్దు.. మా డాడీని విడిచి పెట్టండి" అంటూ గట్టిగా ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. 


తరువాత మెల్లిమెల్లిగా చందు కి తల్లి తాతగారు బామ్మ చెప్తూ ఉండేవారు.. మనమంతా దేశభక్తిని చూపి దేశం గురించి పోరాడాలని, అట్లాగే తండ్రి గోపీచంద్ కూడా దేశం గురించి పోరాడి పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు అర్పించాడని. 


“నీ తండ్రి దేశభక్తుడు, భగవంతుని సన్నిధానానికి వెళ్ళాడు. ఆయనకు మోక్షం లభిస్తుంది" అంటూ తాత ఎంతో చెప్పేవారు.


"నేను కూడా వీర సైనికుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను కదరా"


కాని చందూ కిదంతాఅర్థం కాదు. ఆ పిల్ల వానిలో ఒక విధమైన కసి ఏర్పడింది. మిలటరీ ఉద్యోగం అంటే అందరూ చచ్చిపోతారు ఒక విధమైన ఈర్ష పెంచుకున్నాడు. పెద్ద అవుతున్న కొద్దీ మిలటరీ ఉద్యోగాలు అంటే, చందుకి ఆ మిలటరీ డ్రస్సులో తండ్రి ఫోటోలు చూస్తేనే చాలా కోపము అసహ్యము వస్తుంది. మనసులో ఈర్ష.


"ఈ దేశం తన తండ్రిని పొట్టను పెట్టుకుంది. తనకు తండ్రి ప్రేమ లేకుండా చేసింది" అంటూ తల్లి మీద మండిపడుతూ ఉండేవాడు.


అందుచేత పెద్దవాళ్లు కూడా ఆ టాపిక్కుని తెచ్చేవారు కాదు.పిల్లవాడి మనసు విరిగిపోయిందని వాళ్ళకి తెలుసు. 

ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.


చందూ పెద్దవాడయ్యాడు. డిగ్రీ చదువుతున్నాడు. సెలవలకి వాళ్ళ కాలేజీ విద్యార్థుల్ని పర్యటన ప్రదేశాలు తిప్పడానికి

పెద్ద బస్సు వేశారు. ఆడపిల్లలు మగ పిల్లలు ఎంతో ఎంజాయ్ గా అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు.


ఢిల్లీ వెళ్లారు. ఆగ్రా చూసారు. కాశ్మీర్ బయలుదేరింది ఆ బస్సు. కాశ్మీరులో ఆ పర్వతాలు ఆ పచ్చదనం, ఆ చెట్లు, చల్లటి ఆగాలి, పైన నీలాకాశములో మబ్బులు..


బస్సులో విద్యార్థులందరూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఎంతో ఆనందంగా వెళుతున్నారు.


వారి వెనకాల ఇంకా టూరిస్ట్ బస్సులు రెండు ఉన్నాయి.

ఒకటి గుజరాత్ నుంచి, మరి ఒకటి మద్రాసు నుంచి యాత్రికులు.

 

బస్సులో ఉండే గైడు ఒక్కొక్క ప్రదేశాన్ని చూపుతూ దాని గురించి వివరాలు చెప్తున్నాడు. అందరూ చాలా ఆనంద పడుతున్నారు ఆ ప్రకృతి దృశ్యాలను చూసి. కాశ్మీర్ అంటే ఇలలో స్వర్గం కదా! 


అక్కడ చిన్న అడవి ప్రాంతంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండల మీదనుండి జలజల పారే జలపాతాలు..

ఆ అందాలు చూద్దామని ఆ మూడు బస్సులు వాళ్ళు అక్కడ దిగారు. 


ఇంతలో ఆ పొదల నుంచి చెట్ల మధ్య నుంచి పాకిస్తానీ సైనికులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ.. డబ్బు, బంగారాలు, సెల్ ఫోనులు దోచుకుంటున్నారు. మాట్లాడితే పేల్చి చంపేస్తామని అంటున్నారు. స్త్రీలు పురుషులు భయపడిపోయి వణికి పోతున్నారు. నోరెత్తితే తుపాకీతో పొడిచి పొడిచి చంపుతున్నారు.

 

 స్టూడెంట్స్ అందరూ ఏకమై వారితో పోట్లాడితే వాళ్లని కింద పడేసి తన్ని తొక్కుతున్నారు. ఇంతలో మన భారతీయ సైనికులు నాలుగు జీపుల్లో వచ్చిరంగంలోకి దిగారు.

చక్కగా కాల్పులు జరిపారు. ఆ పాకిస్తాన్ సైనికులు కూడా కాల్పులు జరిపారు. భారతీ సైనికులు వాళ్ళని వెనుక నుంచి తరిమి తరిమి కొట్టారు.


ఈ కాల్పుల్లో గుజరాత్ నుంచి వచ్చిన ఇద్దరు టూరిస్టులు మరణించారు. విద్యార్థులకు కొంతమందికి గాయాలయ్యాయి.

వీరందరినీ ఆర్మీ వాళ్ళు దగ్గరగా ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్లారు.


ఇదంతా చూస్తున్న చందూ, అతడు స్నేహితులకు, దేశ పరిస్థితి అవగాహన అయింది. ఈ పాకిస్థాన్ దుండగులు మన దేశం పై పడి అత్యాచారాలు చేస్తున్నారు. మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి పన్నాగం..

 

తన తండ్రి లాంటివారు దేశభక్తితో ప్రజల్ని కాపాడుటకై మిలటరీలో జేరిదేశాన్ని కాపాడేవారు. దేశంలో ప్రజలందరూ ఎవరి ప్రాణం వారు తీపి అనుకుంటే ఈ దేశాన్ని రక్షించేది ఎవరు?


ఈ గ్రూపులోని విద్యార్థులందరూ ఇలా దేశరక్షణ గురించి మాట్లాడుకుంటూ అప్పుడే నిర్ణయించుకున్నారు ఇటువంటి శత్రువుల నుంచి దేశాన్ని మనం కాపాడుకోవాలి అని.


చందూ కి తన తండ్రి త్యాగనిరతి గురించి అప్పటికి అర్థం అయింది. కేవలం తన సుఖమే చూసుకుంటూ కూర్చుంటే దేశాన్ని రక్షించేది ఎవరూ?

 

తన తండ్రి ఎంత పుణ్యాత్ముడు! ‘దేశం గురించి ప్రాణ త్యాగం చేసిన దేశభక్తి వీరుడు.’ అంటూ దేశభక్తి గురించి చందు స్నేహితులకు వివరించేవాడు. 

విద్యార్థులందరూ కూడా చందు చెప్పింది నిజమని అంటూ, 

మనము కూడా మిలట్రీలో జేరి భారతమాతను శత్రువుల నుండి కాపాడాలి, తన స్వార్థం తన సుఖం గురించి కాక, ప్రజల గురించి పాటుపడాలి.. 


విద్యార్థులందరూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు, 


"నాన్నగారు పోయారని ఇంతవరకు నాకు, మిలటరీ ఉద్యోగం అంటే చాలా ద్వేషముగా ఉండేది. కానీ దేశం కోసం ప్రాణాలర్పించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన అమరవీరులు. ఈరోజు పాకిస్తాన్ దుండగులు దేశాన్ని కబళిస్తామని చూస్తున్నారు. మన యువత అందరూ ముందుకు వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి " అంటూ చందు స్నేహితులందరికీ ఆవేశంతో దేశభక్తిని ప్రబోధించాడు. 


"అమ్మ.. నేను మిలటరీలో చేరుతాను" అంటూ ఒక ఉదయం తల్లికి చెప్పేసరికి ఆమె ఆనంద భరితురాలై చందూని ప్రేమగా కౌగిలించుకొని,


"ఇదే నాన్నా నేను కోరుకునేది. నా కోరిక ఫలించింది. 

ఇప్పుడు నీవు అసలైన కెప్టెన్ గోపీచంద్ కుమారుడివి"

 అంటూ ఎంతో ఆనందపడిపోయింది.

 

డిగ్రీ పరీక్షలు అయ్యాయి. చాలామంది కాలేజీ విద్యార్థులందరూ మిలిటరీలో ఉద్యోగాలు గురించి దరఖాస్తులు పెట్టుకుని సెలెక్ట్ అయ్యి ఆర్మీలో చేరారు.

 

భరతమాత ముద్దుబిడ్డలు వీరు, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎదిరించి పోరాడే యువ శక్తి, మాతృ దేశ రక్షణకై ముందడుగులు వేస్తున్న వీర సైనికులు వీరు. 


***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comentarios


bottom of page