top of page
Original_edited.jpg

మేమే బాలలం

  • Writer: Gadwala Somanna
    Gadwala Somanna
  • 4 days ago
  • 1 min read

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NithyaSathyalu, #నిత్యసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 141

Meme Balalam- Somanna Gari Kavithalu Part 141 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/11/2025

మేమే బాలలం - సోమన్న గారి కవితలు పార్ట్ 141 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


మేమే బాలలం

-------------------------------------------

బాలలం బాలలం

భానుని కిరణాలం

ముద్దబంతి పూవులం

మమతల కెరటాలం


దేవుని రూపాలం

గృహమున దీపాలం

అందాల బాలలం

మందార మాలలం


పున్నమి రోజుల్లో

వెన్నెలమ్న వెలుగులం

కన్నోళ్ల గుండెల్లో

ప్రేమలొలుకు చెలమలం


అందరికీ ఇష్టులం

స్నేహానికి గుర్తులం

వెన్నలాంటి మనసులం

కన్నవారి శ్వాసలం

ree









బహు శ్రేష్టం మానవ జన్మ!

------------------------------

మానవ జన్మ మహత్తరము

సృష్టిలోనే మనోహరము

సద్వినియోగం కావాలి

చరిత్ర తిరిగి రాయాలి


మితిలేని చెడు వ్యసనాలతో

చెరుపు చేసుకోకూడదోయ్!

అర్ధమే లేని వాటితో

వ్యర్థమసలు కాకూడదోయ్


భగవంతుడిచ్చిన వరమది

ఎన్నో జన్మల పుణ్యఫలమది

సాటిలేని మేటి జన్మది

ఈ జన్మలో నిన్ను వరించినది


ఈ ఘన మానవ జన్మలో

శ్వాస ఉండగా నాసికలో

ఇక మేలుకో ఓ మానవా!

ఇల సార్ధకం చేసుకోవా!

ree















చిరు మందహాసము

--------------------------------------

విజ్ఞానం వికాసము

పంచుతుంది వినోదము

ఆర్జిస్తే జీవితము

అగును వర్ణశోభితము


మనసారగ నవ్వితే

ప్రకాశించును వదనము

పైసా ఖర్చు లేనిది

ఆరోగ్యం పెంచునది


చిరునవ్వులే ఔషదము

మనసు గెలుచు ఆయుధము

అందుంది గొప్పతనము

పంచుతుంది చక్కదనము


పారిజాత పుష్పమది

రోగాలకు విరుగుడది

మనిషికది బహుమానము

వెలలేని ఆభరణము


డబ్బులతో కొనలేనిది

సృష్టిలో శ్రేష్టమైనది

చిరు మందహాసమే

బ్రతుకున గంభీరమైనది

ree






దైవమే నా జీవము

-----------------------------------------

దైవాన్ని నమ్ముతాను

హృదయాన్ని అర్పిస్తాను

ఎవరేమనుకున్నాను

భక్తి బాట నడుస్తాను


దైవ నామ స్మరణలో

వారి పాద సేవలో

మలినాలు కడుగుకుంటాను

ప్రక్షాళనం చేసుకుంటాను


భగవంతుడే గురిగా

జీవితాన్ని సరిగా

తీర్చిదిద్దుకుంటాను

మహర్షిగా మారుతాను


దైవమే నా ప్రాణము

దేవుడే నా సర్వము

జీవిత కాలమంతా

నడుచుకుంటా! ఈ విధము

ree














తేజోమయుడు దేవుడు

-------------------------------------------------

భగవంతుడు లేకుంటే

సృష్టి ఎలా నడిచేది!

ఆ పుణ్య నామ స్మరణ

లేక పవిత్రత ఏది!


సకల జీవుల పోషకుడు

కనురెప్పల్లాంటి వాడు

ఆశ్రయిస్తే ఆసన్నుడు

కోటి కాంతుల సమానుడు


భక్తకోటి సంరక్షకుడు

తామస గుణ సంహారకుడు

నమ్మిన వారికైతే

అగును ఆపద్భాంధవుడు


ఆ దివ్య తేజోమయుని

నమ్మి చెడిన వారు లేరు

గుణంలోన శ్రీమంతుని

కాదని జీవించలేరు

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page