top of page

మేము

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #Memu, #మేము,  #అమ్మభావన, #చిట్టికవితలు #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Memu - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 29/05/2025 

మేము - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


మా వయసెంతో తెలియక పోవడం ఒక వరం.

సివాళ్ళకు జోలపాడుతాము. 

పిల్లలతో ఆటలాడుతాము.

ఏ పనికైనా ముందు ఉంటాము.

ఎవరికైనా అందుబాటులో ఉంటాము.

కాసులు రాల్చేంత ఐశ్వర్యం లేకపోయినా కొండంత ప్రేమను పంచుతాము. 

పరుగెత్తే సత్తా లేకున్నా పదుగురిలో ఉంటాము.

పనికిరాని వస్తువులా పడిఉండము.

పందిరి నీడలో కూడా సేద తీరుతాము.

అధిక ప్రసంగాలకు దూరంగా ఉంటాము.

అందరినీ ఆత్మీయులుగా భావిస్తాము. 

దృష్టిమందగించినా ఎవరికీ అడ్డము రాము.

మంచిమాటలే ఊతకర్రగా ముందుకు నడుస్తాము.

మాట జారి కలతలు సృష్టించము.

మనసుతీరా నవ్వుకుంటాము.

మనుషిలోని మంచి మనసుకు దాసోహము అంటాము. 

మనసులేనివారి దగ్గర మనుగడ సాగించడము దుర్లభం.

మాకు మేమే ధైర్యం చెప్పుకుంటాము. 

మధురమే జీవితము అనుకుంటాము .
















అమ్మ భావన

------------------

పాప నా కంటిపాప

నేను కన్నపాప చిట్టి చేతులు

నా చెక్కిలిపై ఆడుకుంటాయి

నా గళము చుట్టూ అల్లుకుంటాయి

నా కళ్ళలో నీళ్ళు కిందపడకుండా ఒడిసిపట్టుకుంటాయి

నా భావనలకు ఆలంబన

నా కమ్మని కలల నిచ్చెన

నా కవితలకు ప్రేరేపణ

నా ప్రేమకావ్యానికి అభిభాషణ

నా చేయి పట్టి నడిపించే మార్గదర్సి

నా జీవితానికి పరమాత్మ ప్రసాదించిన బహుమతి














చిట్టి కవితలు

------------------

సృష్టిలో ప్రతిజీవికీ ఒక కధ ఉంటుంది

అన్ని కథలు కంచికే

అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా

దారి మాత్రము ఒక్కటే - నవసమాజస్థాపన


ఏ రంగులో ఉన్నా తినడానికి రుచి ముఖ్యము

కొత్తరకము వంటలు- కల్తీరాజ్యమేలుతోంది

ఎన్ని నేర్చినా స్త్రీ ఇల్లే స్వర్గము అనే భ్రమలోనే ఉంటుంది

ఇంటి యజమాని రోడ్డెక్కినా

తరాలు మారినా కన్నవారు ఒంటరిని చేసినా

తల్లి ప్రేమ అక్షయపాత్ర ప్రేమను పంచుతూనే ఉంటుంది



నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

2 Comments


వృద్దాప్యం వయసుకు, మనసుకు కాదు; వృద్ధాప్యం బధ్దకానికి, మన ప్రయత్నానికి కాదు అని ఎంతో చక్కగా చెప్పారు

Like

ఆత్మ విశ్వాసం వుంటే వృద్దాప్యం ఆశ్వా దించ వచ్చ. బాగుంది కవిత

Like
bottom of page