మెత్తటి మొట్టికాయ
- Mohana Krishna Tata

- Dec 5, 2025
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #MetthaniMottikaya, #మెత్తటి మొట్టికాయ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Metthani Mottikaya - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 05/12/2025
మెత్తటి మొట్టికాయ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"అమ్మాయి కావ్య.. ! నీకు ముప్పయి దాటాయి.. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు? నాకా వయసైపోతోంది. నీ పెళ్ళి చేస్తే, నా బాధ్యత తీరిపోతుంది.. అప్పుడు బకెట్ కిక్ చేసినా పర్వాలేదు.. నీ పాట్లేవో వచ్చిన అల్లుడు పడతాడు"
"అలా అనకండి నాన్నా.. ! మీ బకెట్ ఇంకా దేవుడు తయారు చెయ్యలేదు.. దానికి ఇంకా చాలా టైం ఉంది. నాకు పెళ్ళికొడుకు ఎలా ఉన్నా, జుట్టు మాత్రం బాగా ఉండాలి.. అదే నా షరతు"
"నీకా ముప్పయి ప్లస్.. దొరికే పెళ్ళి కొడుకు వయసు ఎక్కువే ఉంటుంది కదా మరి. మగవారికి జుట్టు ఎక్కడ ఉంటోంది ఈ రోజుల్లో? ముందే ఊడిపోతోంది. కొంతమందికి జుట్టు ముందుభాగంలో, కొంతమందికి మధ్యలో.. కొందరికైతే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ గుండే.. "
"అయినా సరే నాన్నా.. నాకున్న పొడుగాటి జడకు.. ఆ జుట్టు మ్యాచ్ అవ్వాలి అంతే"
"ఈ రోజుల్లో జుట్టుకేముందిలే.. అతికించేవారు బోలెడుమంది. అతికించిన జుట్టా, రంగు వేసినదా.. ఎవరిది ఒరిజినలో తెలియనంతగా ఉంటోంది. డబ్బులుంటే, ఏదైనా సాధ్యమే కదా.. అడ్జెస్ట్ చేసుకో"
"మ ఫ్రెండ్స్ అందరికి.. వాళ్ళ మొగుళ్ళకి జుట్టు లేదు. నాకూ అలాంటి మొగుడే రావాలని దేవుడిని తెగ మొక్కేసుకుంటున్నారు.. అందుకే నాకు మహర్షి లాగ జుట్టు పెంచుకున్న అబ్బాయిని చూసి పెళ్ళి చెయ్యండి.. అందరూ కుళ్ళుకోవాలి"
"ఇప్పుడు నేను అడవికి వెళ్లి వర అన్వేషణ చెయ్యలేను.. ఓపిక లేదు" జోక్ పేల్చాడు తండ్రి
"అందితే జుట్టు.. లేకపోతే కాళ్ళు అంటారుగా.. ఎప్పుడో పూజకో వ్రతానికో ఓకే గాని, మొగుడిని ప్రతీసారి కాళ్ళు పట్టుకోలేము కదా.. అలాంటప్పుడు జుట్టు అయినా చేతికి అందాలిగా మరి"
"మరీ అంతలాగా ఆలోచించాలా కావ్యా?"
"తప్పదు నాన్నా!"
"మరి పెళ్ళైన తర్వాత జుట్టు లేకపోతేనో?"
"నిజంగా పెళ్ళైన తర్వాత.. జుట్టు తగ్గినా, బట్టతల అని తెలిసినా, ఆ గుండు పైన మొట్టికాయలు పెట్టి చంపేస్తే, తర్వాత నాకు సంబంధం లేదు నాన్నా"
"అసలే ఇది మొండిది.. చేసినా చేస్తుంది"
కొన్ని రోజుల తర్వాత పెళ్ళిచూపుల సీన్ లో..
"పెళ్ళికొడుకుది విగ్ లేదా రియల్ అనేది టెస్ట్ చెయ్యరా డిబ్బు.. " అంది కావ్య
"దానికోసం ఏం చెయ్యను అక్కా?"
"వాక్యూమ్ క్లీనర్ తో జుట్టు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది"
"నైస్ ఐడియా!"
"అయ్యా! కాబోయే బావగారు.. ! మీ హెయిర్ చాలా బాగుంది.. అలా కాళ్ళు కడుక్కుని ఇలా వస్తారా?"
"ఎందుకు?"
"మా ఇంటికి వచ్చిన వారందరికి జుట్టుని క్లీన్ చేసి అప్పుడే ఇంట్లోకి రానిస్తాం.. ఈ మధ్య జుట్టు నుంచి పాకే కొత్త వైరస్ ఒకటి వచ్చిందంటా!'
"నా జుట్టు ఒరిజినల్ అండ్ సూపర్.. అలాంటివి ఏవీ ఉండవు.. నేను ఒప్పుకోను!"
"ఒప్పుకోండి.. ! బ్లడ్ టెస్ట్ కాదుగా.. " అంటూ కావ్య ఒక నవ్వు నవ్వింది.
వాక్యూమ్ క్లీనర్ పెట్టిన తర్వాత జుట్టు గాయబ్..
"ఇట్స్ గాన్ అక్కా.. !"
"ఒరేయ్ పెళ్ళికొడకా.. ! నెత్తిమీద పది వెంట్రుకలు లేని నీకు.. ఇంత పొడుగాటి జడ ఉన్న నాలాంటి అమ్మాయి అవసరమా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తప్ప.. సెంటర్ పిచ్ అంతా ఖాళీయేగా. ఒక పని చెయ్యి.. వీలునప్పుడు రా! మా డిబ్బు, నేను దానిమీద క్రికెట్ ఆడుకుంటాం. ఇప్పుడు వెంటనే వెళ్ళిపో.. లేకపోతే ఉన్న ఆ పది వెంట్రుకలకి కూడా రంగు వేసుకోలేకుండా పీకి పడేస్తా.. "
దెబ్బకి జడిసి.. పెళ్ళికొడుకు మాయం. "ఏమిటిది కావ్యా! ఈసారి మంచి సంబంధం చూస్తాను లే.. !" అన్నాడు తండ్రి.
ఎలాగో ఒప్పించి ఒక నెల తర్వాత ఇంకొక పెళ్ళి చూపులకి ఓకే చెప్పింది కావ్య.
"ఈసారి వాక్యూమ్ క్లీనర్ టెస్ట్ లో పెళ్ళికొడుకు పాస్.. "
"ఓకేనా తల్లీ.. ?"
"ఎస్ నాన్న.. !"
"ఫ్యూచర్ లో అతనికి బట్టతల వస్తే.. నాకు సంబంధం లేదు"
ఆ అబ్బాయితో కావ్య పెళ్ళి జరిగింది. పెళ్ళి తర్వాత ఒక రోజు..
"మీ పుట్టిన రోజుగా.. మీకు తల నేను రుద్దుతా" అంటూ ప్రేమగా అంది కావ్య
"వద్దు.. వద్దు.. ! నాకు అసలే సిగ్గు కావ్యా.. "
"నా దగ్గర మీకు సిగ్గేమిటి.. ? మీ మెత్తని జుట్టు పట్టుకోవాలని ఉంది. మ్యారేజ్ తర్వాత లైసెన్స్ వస్తుందిగా.. అప్పుడు పట్టుకుందామని ఆగాను"
భర్త తల రుద్ది కావ్య బయటకు వచ్చేసింది. స్నానం తర్వాత.. బాత్రూంలోంచి బయటకు వచ్చిన భర్తను చూసి..
"ఎవడ్రా నువ్వు.. ? మా ఇంట్లోకి ఎలా వచ్చావ్?" అని అడిగింది కావ్య
"నేనూ నీ మొగుడిని.. గుర్తుపట్టలేదా?"
"అదేంటి.. ప్రభాస్ జుట్టు లాగ ఉండే మీ హెయిర్ స్టైల్.. కట్టప్ప జుట్టులాగా మారిందేమిటి?"
"అదా.. ఫెవికాల్ వదిలేసినట్టుంది"
"ఫెవికాల్ ఏంటి?"
"అదా.. అదీ.. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు.. మా కంపెనీ ఫెవికాల్ తో జుట్టు అంటించి నీ టెస్ట్ లో పాస్ అయ్యా"
"ఫెవికాల్ కంపెనీలో పనిచేస్తున్నారంటేనే అనుమానించాల్సింది. అయ్యో ఇప్పుడు నేను మీ ముఖం మా ఫ్రెండ్స్ కి ఎలా చూపేది?"
"నిన్ను నాలుగు సంవత్సరాలనుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నా కావ్య. నీ గురించి ఆలోచించే నా జుట్టు పోయింది. నీ కోసం ఏమైనా చేస్తాను.. జుట్టు లేకపోతే ఏం చెప్పు?.. మళ్ళీ ఫెవికాల్ తో అతికించేస్తాలే"
రెండు రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు..
"ఏమండీ.. ! మీరు మీ జుట్టు కోసం ఏమీ చెయ్యనవసరం లేదు. నేను కూడా నా జుట్టు చిన్నగా కట్ చేసేస్తాను. జుట్టు లేకపోయినా, మీ మనసు ఎంత మంచిదో.. మీ గురించి అంతా తెలిసింది. జుట్టు ఉండి, తలలోపల కపట బుద్ధులు దాచుకునేవారికంటే.. హెడ్ స్మూత్ గా ఉంటే ఏంటి.. ? మీ మనసులో నా మీద బోలెడు ప్రేమ ఉంది.. అది చాలు " అంటూ గుండు పైన మెత్తటి మొట్టికాయ ఇచ్చింది కావ్య
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments