top of page
Writer's picturePitta Govinda Rao

మిలటరీ యూనిఫాం



'Military Uniform' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 10/01/2024

'మిలటరీ యూనిఫాం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


భారతదేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే బలిష్టమైన భద్రతదళంగా పేరున్నది భారతదేశ మిలటరీ. 


ఆ పేరు అంటే ఒక సాహసం, ఆ పేరు వింటే ఒక ఎనర్జీ, ఆ పేరు ఎన్నో త్యాగాలకు నిలయం. 


మిలటరీ అంటేనే దేశ ప్రజలకు ఒకరకమైన ధైర్యం. ఆ బూట్ల చప్పుడు, ఆ యూనిఫాం చూస్తే ఏ మనిషికైనా.. ఒకరకమైన భావోద్వేగం కలగకమానదు. ఇంకా భారతదేశ మిలటరీ అంటే ఏ శత్రు దేశానికైనా గుండెల్లో వణుకు పుట్టకుండా ఉండదు. 


 మిలటరీ యూనిఫాం ధరించి దేశ సైనికుడుగా ఉండాలంటే అంత ఈజీ కాదు. అయినా కూడా.. ! దేశంలో ఎక్కువ మంది యువత మిలటరీ కోసం ప్రయత్నిస్తున్నారంటే మిలటరీకి ఉండే శక్తిసామర్ధ్యాలు, గౌరవం అలాంటిది. 


అది కాశ్మీర్ లో గల్వాన్ లోయ. ఎటు చూసినా కొండలు, గుట్టలు. ఎక్కడ చూసినా.. అక్కడక్కడా ఆర్మీ గుడారాలు. ఇక్కడ గత కొంతకాలం నుంచి శత్రు సైనికులు చొరబాట్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతిచర్యలకు వెనుకాడని ధైర్యవంతుడైన శత్రు చర్యలకు ఏమాత్రం బెదరని కల్నల్ వీరేందర్ సింగ్ ని ఆర్మీ అధికారులు నియామించారు. సింగ్ ఎక్కడ విధులు నిర్వర్తిస్తే అక్కడ శత్రు సైన్యం, ఉగ్రజాడ చాలా వరకు కనిపించదు. అంతటి శక్తి సామర్ధ్యాలు సింగ్ కి కలవు. 


లోయకు ఐదు కిలోమీటర్లు దూరంలో సింగ్ కి చిన్న ఆఫీసు ఉంది. ఇక్కడ తనతో విధుల్లో ఉన్నవారి లీవ్, అన్ లీవ్, సైనికులు సమస్యలు తదితర వివరాలు ఈ ఆఫీసులో ఎప్పటికప్పుడు సహయ సహకారాలు అందించబడతాయి 


అయితే ఈ ఆఫీసుకి గత కొన్ని రోజులనుండి ఓ వృద్ధ  దంపతులు ఏదో కాగితం పట్టుకుని వస్తుండటం గమనించాడు సింగ్. మొదట్లో పట్టించుకోలేదు కానీ తర్వాత వాళ్ళు ప్రతిసారి అక్కడకి రావటం, కాగితాన్ని తన ఆఫీసులో సిబ్బందికి ఇచ్చి దండం పెట్టి వెళ్ళటం.. ఇదే తంతుని సింగ్ గమనించాడు. 


ఆ వృద్ధ దంపతులు ఎవరు, ఎందుకు వస్తున్నారనే విషయాలు తాను ఖచ్చితంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 


మరుసటి రోజు తానే ఆ కాగితం తీసుకుంటూ

"ఏంటి సార్ సమస్య" అని అడిగాడు సింగ్. 


" బాబు, ఈ ప్రాంతంలో నా కొడుకు విధులు నిర్వర్తించి శత్రు సైనికులు చేతిలో వీరమరణం పొందాడు. నా కొడుకు చనిపోయిన ఆ ప్రాంతం మాకు చూడాలని ఉంది. దయచేసి అనుమతి ఇచ్చి మమ్మల్ని ఒక్కసారి తీసుకెళ్ళండి. పై అధికారులకు చెప్పి చెప్పి విసిగెత్తి మా ఊరు నుండి వచ్చి ఇక్కడ గడుపుతున్నాం. అధికారులు నుండి అనుమతి రావటం లేదు. బాబు మీకు దండం పెడతాను"  అన్నాడు. 


 ఆ మాటలకు సింగ్ మనసు చలించిపోయింది. 

ఇంతలో ఆర్మీ వాహనం పై ఇద్దరు సైనికులు వచ్చారు. అందులో ఓ సైనికుడు విజయ్ చేతిలో పూలు నింపిన సంచి,, ఒక లేఖ ఉంది. లేఖను సింగ్ కి ఇవ్వగా పరిశీలించి. 

"సార్ అనుమతి వచ్చింది. కానీ.. ! ఈ ప్రాంతానికి నేను కొత్తగా వచ్చాను. నీ కొడుకు చనిపోయిన ప్రాంతం నాకు తెలియదు"అన్నాడు సింగ్. 


"నాకు తెలుసు సార్ అన్నాడు" లేఖ ఇచ్చిన సైనికుడు విజయ్. 


ఆలస్యం చేయకుండా వృద్ధ దంపతులను ఆ ప్రాంతానికి సింగ్ తో కలిసి తీసుకెళ్ళాడు విజయ్. 


ఒక చోట వాహనం ఆపి తన చేతిలో ఉన్న పూలను అక్కడ చల్లి ‘ఇదేనమ్మ మీ కొడుకు చనిపోయిన ప్రదేశం” అని ఆ చోటు పై పడి విజయ్ ఏడవటం ప్రారంభించాడు. 


" బాబు మాకంటే నువ్వే ఎక్కువ ఏడుస్తున్నావేంటి బాబు.. " అన్నారు ఆ దంపతులు. 


" లేదండి ఆ రోజు నీ కొడుకు శ్రీకాంత్ స్థానంలో నేనే చనిపోవల్సింది. వాడు.. వాడు నన్ను ఆపి తాను లోకం విడిచి పోయాడు" అన్నాడు విజయ్. 


సింగ్ విజయ్ వైపు చూసి

"ఈ ప్రాంతంలో గతంలో ఏం జరిగింది... ఏం జరిగిందీ"... గద్దించాడు


“ఆ రోజు రాత్రి సైనికులు విధులు ముగించుకుని గుడారాల్లో నిద్దిస్తున్నారు. శ్రీకాంత్ పడుకోకుండా డైరీలో ఏదో రాసుకుంటున్నాడు.నాకు ఒక పీడకల వచ్చి గావు కేకపెట్టి లేచాను. 

"ఏమైందిరా.. శ్రీకాంత్ అడిగాడు. 


" నా భార్య నిండు గర్భిణీరా తానే కలలోకి వచ్చింది"  అన్నాడు విజయ్. 


" సరే మంచినీళ్లు తాగి పడుకో" అన్నాడు. 

" లేదురా నిద్ర రావటం లేదు"


"సరే అలా బోర్డర్ వైపు వెళ్దాం పదా" అని రెండు తుపాకులు తీసి విజయ్ కి ఒకటి ఇచ్చి తాను ఒకటి పట్టుకుని అలా మాట్లాడుకుంటు దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్ళారు. 


ఇంతలో చైనా బోర్డర్ వైపు నుండి బుట్లు చప్పుడు రావటంతో వెంటనే అప్రమత్తం అయి మెరుపువేగంతో కదులుతు ఇద్దరే కానీ ఎక్కువ మంది సైనికుల్లా కాల్పులు జరిపారు. 


అలా కొంతసేపు అయ్యా విజయ్, శ్రీకాంత్ తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయాయి. ఏం చేయాలో తోచటంలేదు. శత్రు సైనికులు కొందరు తమకు సమీపిస్తున్నారు. 


" శ్రీకాంత్ నీ మెడలో బుల్లెట్ ఆకారంలో ఉన్న ఆబిళ్ళ ఇవ్వు నేను డెత్ చార్జ తీసుకుని ఈ ఒక్క బుల్లెట్ తో శత్రు సైనికులు వెనక్కి వెళ్ళేలా నేను చేస్తాను" అన్నాడు విజయ్. 


రేయ్.. ! నీకేమైనా పిచ్చా.. నీ భార్య గర్భిణీ అన్నావ్ నువ్వు ఏమనకోకు నేను డెత్ చార్జ్ తీసుకుంటాను. నా డెడ్ బాడీని నా తల్లిదండ్రులుకు అప్పగించే బాధ్యత నీదే "అంటూ శ్రీకాంత్ సమీపిస్తున్న శత్రువులు కు ఎదురెళ్ళి ఆ ఒక్క బుల్లెట్ తో ఒకడిని చంపి మరోకడిని తుపాకీతో నేలకేసి కొట్టాడు. అంతలోనే మిగిలిన శత్రు సైనికులు శ్రీకాంత్ పై తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. 


అయినా... శ్రీకాంత్ తగ్గకుండా కింద పడిపోయిన ఇద్దరు శత్రు సైనికులు తుపాకులు తీసుకుని మిగతా వారిపై కాల్పులు జరుపుతు పది అడుగులు వరకు వెళ్ళాడు. దీంతో శ్రీకాంత్ కాల్పుల్లో పదుల సంఖ్యలో శత్రు సైనికులు మరణించగా మిగతా వారు పారిపోయారు. 


కాల్పులు చప్పుడు ఆగిపోవటంతో విజయ్ తన సహచర సైనికుడైన శ్రీకాంత్ ని చూడగా అప్పటికే నేలకూలిపోయాడు. శ్రీకాంత్ ని తన ఒడిలోకి తీసుకుని బిగ్గరగా ఏడ్చాడు విజయ్. 


అలా గతాన్ని సింగ్ కు అతడి తల్లిదండ్రులుకు చెప్పి 

" శ్రీకాంత్ అంత్యక్రియలుకు కూడా హాజరుకాకుండా నన్ను వేరే డూటిలో వేయటంతో అప్పుడు శ్రీకాంత్ పై వేయలేని ఈ పూలు ఇప్పుడు ఇక్కడ వేస్తున్నానని "ఏడ్చాడు. 



దేశం కోసం క్లిష్టమైన పరిస్థితుల్లో చనిపోయేందుకు సిద్దమైన విజయ్ కి చనిపోయిన శ్రీకాంత్ కి మనసులోనే సెల్యూట్ చేశాడు సింగ్. 


 తర్వాత తన యొక్క మిలటరీ యూనిఫాం ను ఆ వృద్ధ దంపతులకు కానుకగా అందించి తమ పెంపకం బాధ్యత కూడా చేసుకుంటానని విజయ్ మాట ఇచ్చి ఆర్మీ వాహనంలో ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు విజయ్. 


నిజంగా భారత మిలటరీ త్యాగాలు గొప్పవి కదా.. 


ఒకరి సంతోషం కోసం మరొకరు, అలాగే దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఒకరితో ఒకరు పోటి పడతారు అందరూ బతకటం కోసం ఉద్యోగం చేసి జీతం తీసుకుంటారు కానీ.. ! చనిపోయేందుకు ఉద్యోగం చేసేవాడే భారత సైనికుడు. సామాన్య ప్రజలు ఎవరో ఉగ్రవాదులు ఎవరో తెలుసుకోలేని క్లిష్టమైన పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టే మిలటరీ అంటే ఎవరికైనా ఇష్టమే. 

సమాప్తం.


 పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం









25 views0 comments

Comentarios


bottom of page