'Mosapoyina Snehithudu' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పేరు చంద్ర.
ఇంకొకరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈయన పేరు రవి.
ఈ విషయాన్ని తన మిత్రుడైన చంద్రకు చెప్పాడు రవి.
అప్పుడు చంద్ర సరే నేనుకూడా నీకు పెట్టుబడికి సాయంగా కొంత మొత్తంలో డబ్బును ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఎలాగో నీవు కూడా డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందు వస్తున్నావు కాబట్టి ఇద్దరం కలిసి పాట్నర్స్ గా ఉందామని రవి చెప్పాడు.
అనుకున్న విధంగానే ఒకే వ్యాపారాన్ని ఇద్దరి పెట్టుబడులతో మొదలుపెట్టారు, కొన్నాళ్ళు సాఫీగానే నడిపారు ఇద్దరు మిత్రులు వ్యాపారాన్ని.
చంద్ర ఎప్పుడో ఒక్కసారి మాత్రమే షాప్ ను చూడటానికి వచ్చే వాడు. రవి మాత్రం ఎప్పుడూ షాప్ ను చూసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అయితే చంద్ర తన అవసరాల నిమిత్తం తన పెట్టుబడి మొత్తాన్ని తీసుకుని ఖర్చు చేసుకుంటూ ఉన్న పెట్టుబడి మొత్తాన్ని రవి దగ్గర నుండి తీసేసుకున్నాడు.
రవి కూడా సరేలే వాడి డబ్బులే కదా వాడు ఖర్చు చేసుకోవడంలో తప్పులేదు నేను అడ్డు చెప్పడం సబబు కాదని అడిగినప్పుడు అడిగినంత ఇచ్చేశాడు. కొన్ని రోజులకు చంద్ర షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వు అంటూ మాటలతో యుద్ధం చేశాడు.
అయినప్పటికీ రవి తను ఇచ్చిన మొత్తానికి సంభంధించిన ఆధారాలను చూపించి “నీ పెట్టుబడి మొత్తాన్ని నీవు ఖర్చు చేశావు. నేను నీకు ఇచ్చాను” అంటూ ఆధారాలను చూపించి చెప్పాడు.
అప్పుడు చంద్ర “నాకు అదంతా సంబంధం లేదు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి” అన్నాడు. సరే నా మిత్రుడే కదా డబ్బులు అడుగుతున్నాడు.. ఇప్పుడు ఇచ్చినా నేను తర్వాత అయినా సంపాదించుకుంటాను అనుకుని అడిగినంత డబ్బు ఇచ్చేశాడు రవి.
ఇదిలా ఉండగా మరో రెండు నెలలకే చంద్ర నుంచి రవికి కాల్ వచ్చింది. “నేను పోలీస్ స్టేషన్లో నీమీద కేస్ పెట్టాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిందే. నేను మొదట్లో ఇచ్చిన డబ్బు మొత్తం..” అంటూ మాట్లాడసాగాడు చంద్ర.
ఆ మాటలు విన్న రవికీ విషయం మొత్తం అర్థం అయిపోయింది. తన మిత్రుడే తనని మోసం చేశాడు. ఇంకా మోసం చేయాలి అనుకుంటున్నాడు అన్న విషయం. వెంటనే రవి తన మామగారి సహాయంతో పోలీస్ స్టేషన్లో ఆధారాలు చూయిస్తూ జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు వివరించాడు. అయినప్పటికీ పోలీస్ లు రవి మాటలను లెక్క చేయలేదు, ఎందుకంటే చంద్ర పోలీస్ లకు లంచం కట్టి నాటకాన్ని ప్రదర్శించారు కాబట్టి.
ఈ విషయాన్ని తెలుసుకున్న రవి చంద్ర దగ్గరకు వెళ్ళి “నీవు నా మిత్రుడవు కాబట్టే నిన్ను ఏమి అనలేక ఉన్నాను. వేరే వాళ్ళు అయ్యుంటే ఇంతవరకు తీసుకువచ్చేవాడిని కాదు ఈ విషయాన్ని” అంటూ ఇంకా కొంత మొత్తంలో డబ్బును చంద్ర చేతికి ఇచ్చాడు. అప్పటికీ సంతృప్తి చెందని చంద్ర మరొక్క మారు డబ్బులు కావాలని పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేయించాడు.
ఈ సారి రవి తన మామగారి మిత్రుడైన లాయర్ గారితో కోర్ట్ ను ఆశ్రయించాడు. జరిగిన విషయంను ఆధారాలను చూపించి పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనను వివరించి తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించిన రవి చంద్ర మీద విజయాన్ని సాధించాడు కోర్టు తీర్పుతో.
“అయినప్పటికీ నీవు నా మిత్రుడివి కాబట్టి నీకు ఇంకా డబ్బును ఇస్తాను తీసుకో. నాకు ఈ డబ్బు కన్నా నీ స్నేహం ముఖ్యం” అంటూ కొంత మొత్తంలో డబ్బును ఇచ్చి చంద్రను దూరంగా కాకుండా దగ్గర చేసుకోవాలని చూశాడు రవి. ఇంత గొప్ప మనస్సున రవిని చంద్ర అమాయకపువాడిగా చూడసాగాడు. ఇంత జరిగినా నాకు డబ్బే ప్రధానం అని చంద్ర అనటంతో శాశ్వతంగా దూరం చేశాడు రవి తన మిత్రుడైన చంద్రని.
డబ్బు ముందు ఏ బంధం అయినా తలొంచాల్సిందే అనట్లుగా ఉంది నేటి సమాజం. డబ్బు ప్రధానం కాదు మనిషి మనిషితో పాటు బంధం ముఖ్యమని తెలుసుకుని సమాజం ముందుకు నడవాలని ఆకాంశిస్తూ.....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
Podcast Link
Twitter Link
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.
KIDALA SIVAKRISHNA • 16 hours ago
This is real story, in my near village....!!!!!