top of page

ముందు చూపు


'Mundu Chupu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 02/11/2023

'ముందు చూపు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


కళ్ళు తెరిచి చూస్తే, చుట్టూ చాలా నిశబ్దంగా ఉంది. పక్కన చూస్తే, నా లాగే చాలా మంది మంచం మీద పడుకుని ఉన్నారు. ముక్కులోని.. నోట్లోనీ గొట్టాలు పెట్టి ఉన్నాయి చాలా మందికి. లక్కీ గా, నాకైతే గొట్టాలు లేవు. వాతావరణం చల్లగా ఉంది, ఐసియు లో ఉన్నాను కదా మరి!నాకు ఏమైందో అసలు గుర్తులేదు.


మెల్లగా...నా పక్కన ఉన్న నర్సు ని పిలిచాను. ఆమె దగ్గరకు వచ్చి, ఏమిటి కావాలని అడిగింది.


"నేను ఏ హాస్పిటల్ లో ఉన్నాను?” అని మెల్లగా అడిగాను.


"మీరు సిటీ లో చాలా ఫేమస్ హాస్పిటల్ లో ఉన్నారు".


"నాకు ఏమైంది అసలు?".


"మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారు..ఐసియు లో ఉంచాలని డాక్టర్ గారు చెప్పారు. రేపు రూమ్ కు మారుస్తారు".


"నా కోసం ఎవరు ఉన్నారో బయట..కొంచం పంపిస్తారా?".


"ఉండండి! సెక్యూరిటీకి కాల్ చేసి, పంపించమంటాను".


చాలా సేపటికి మా ఆవిడ లోపలికి వచ్చింది. నన్ను చూడగానే, కన్నీరు పెట్టుకుని బాధపడింది.

"ఊరుకో కమల! ఎందుకు ఏడుస్తున్నావు?"


"మీకు ఇలా జరిగిందని అబ్బాయికి చెబితే..రానని చెప్పాడు"


"ఎందుకు వస్తాడు చెప్పు! నాకేమైనా ఆస్తి ఉందా చెప్పు..కష్టపడి వాడిని చదివించాను అంతే!"


"మేడం! టైం అయ్యింది..ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు..వెళ్ళండి!"


"వెళ్ళు కమల! బాధ పడొద్దు!"


అలా.. చల్లటి వాతావరణానికి కళ్ళు మూసుకున్నాను. గతం గుర్తుకొచ్చింది..


****


నేను ఒక ప్రైవేటు కంపెనీ లో ఒక క్లర్క్ గా పనిచేస్తున్నాను. ఉన్న దానిలో హ్యాపీ గానే ఉన్నాను. ఇంట్లో పెళ్ళి చేస్తామంటే, జీతం చాలదంటూ, వాయిదా వేసేవాడిని. ఇలాగ ఒక ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా,పెళ్ళి చేసుకోకపోతే, జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని అమ్మ ఒకటే రోజూ గోల. చివరికి ఒప్పుకున్నాను. హడావిడిగా పెళ్ళి ఏర్పాట్లు చేసేసాడు మావయ్య. నాకు మా అమ్మ, మావయ్య..ఇద్దరే లోకం. వాళ్ళే నా కోసం అన్నీ చూస్తారు. నాన్న చిన్నప్పుడే పోయారు. అమ్మే కష్టపడి నన్నుపెంచింది. మావయ్య ఉన్నాడని అమ్మకు చాలా ధైర్యం. అంత కష్టపడి పెంచిన అమ్మ మాట కాదనలేక, పెళ్ళి కి అమ్మాయిని చూడకుండానే ఒప్పుకున్నాను. అటు పక్క అమ్మాయి కుడా అంతే నని తర్వాత తెలిసింది!


అమ్మ సెలక్షన్ చాలా బాగుంది. అమ్మాయి పేరు కమల...అందంగా ఉంది..నచ్చింది. అలా నా జీవితంలోకి వచ్చింది కమల. మాకు అబ్బాయి పుట్టాడు. వాడిని నా స్థాయి కి తగ్గట్టు కాలేజీ వరకు చదివించాను. ఆ తర్వాత వాడు తనకి ఇష్టమైన జాబ్ చూసుకుని..సెటిల్ అయ్యాడు. మేము చాలా సంతోషించాము. పెళ్ళి కుడా మాకు చెప్పకుండా.. నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడో నార్త్ ఇండియా లో సెటిల్ అయ్యాడు.


*****


ఎందుకో కమల తో మాట్లాడాలనిపించి...నర్సు ని పిలవమని సైగ చేసాను. కొంతసేపటికి..కంగారుగా కమల లోపలికి వచ్చింది.


"ఎలా ఉన్నాదండీ ఇప్పుడు మీకు?"


"నా గురించి కాదు గానీ..నీకు కొన్ని విషయాలు చెప్పాలి.. నన్ను చూడకుండానే పెళ్ళి చేసుకున్నావు.. ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉన్నావు. ఒకవేళ, నాకేమైనా అయితే.. మన అబ్బాయి తప్పితే, నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఇబ్బంది పడకూడదని.. నీ పేరు మీద డిపాజిట్ చేశాను. వాటితో, నువ్వు ఎవరి మీద అధారపడనవసరం లేదు. అబ్బాయి మీద నాకు నమ్మకం లేదు.. వాళ్ళు నిన్ను చూడకపోయినా… నువ్వు దర్జాగా ఉండొచ్చు!"


"ఇప్పుడు అవన్నీ ఎందుకండీ!"


"ఇప్పుడే అవసరం కమలా!"


"ఏమీ ఆలోచించకుండా...రెస్ట్ తీసుకోండి"


ఆ రోజు రాత్రి, సడన్ గా సీరియస్ చేసింది. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


కమలకు భర్త చివర చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రోజులు గడిచినా.. కొడుకు రాలేదు. భర్త ముందు చూపు కు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకుంది కమల.


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


48 views0 comments
bottom of page