top of page
Original.png

మురిసిన మువ్వ

7 hours ago
4 min read

మురిసిన మువ్వ కథలో స్నేహితులతో సంతోషంగా నిలబడిన శ్రావణి

Murisina Muvva - Telugu Social Story Written By Dr. Bandari Sujatha

మురిసిన మువ్వ - తెలుగు సామాజిక కథ రచన: డా. బండారి సుజాత 

Published In manatelugukathalu.com On 01/10/2026


“మురిసిన మువ్వ” డా. బండారి సుజాత రచించిన హృద్యమైన సామాజిక కథ.

చిన్నారి ముఖంలో తిరిగి విరిసిన చిరునవ్వు, ఒక కుటుంబంలో వచ్చిన మార్పు ఈ కథకు ప్రత్యేకత.


"ఏమైంది శ్రావణీ, ముఖం ఎందుకు అలా మాడ్చుకున్నావు? అలా ఉంటే చూడడానికి బాగాలేవు తెలుసా! కొంచెం నవ్వు ముఖంతో ఉండొచ్చు కదా!" అన్నది భావన.


"ఏమీ లేదు భావనా, మా అమ్మతో పాటు మీ అందరి ఇండ్లలో నేను కూడా పని చేస్తున్నాను కదా! మీతో పాటు స్కూల్ కి వస్తున్నాను కదా! ఇప్పుడు మా అమ్మ నన్ను హాస్టల్ కి పంపిస్తుందట. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్లడం నాకు ఇష్టం లేదు.


అందుకే ఏడుపొస్తుంది" అన్నది శ్రావణి.


శ్రావణి, భావన, రవళి వీళ్లందరివీ పక్కపక్క ఇండ్లు. శ్రావణి తల్లి ఇండ్లలో పని చేస్తూ ఇల్లు గడుపుకుంటూ, తాగి వచ్చే భర్తతో గొడవలు పడుతూ జీవితాన్ని సర్దుకుంటోంది. శ్రావణికి ఒక తమ్ముడు మహేష్. అతన్ని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు.


'భావన'ది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటే, తల్లి మిషన్ కుడుతుంది. భావన చెల్లెలు శ్రీమణి. పిల్లలిద్దరినీ కూడా అదే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు.


'రవళి' తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తారు. రవళి ఒక్కతే కూతురు. అడిగిందల్లా ఇవ్వడమే కాదు, వాళ్లకి గారాల బిడ్డ.


అందరిలో డబ్బుల హెచ్చుతగ్గులు ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. లక్ష్మి అందరి ఇండ్లలో ఏదో ఒక పని చేస్తుంది కనుక అందరూ లక్ష్మికి సహాయం చేస్తూనే ఉంటారు.


అందరివీ పట్టణంలోని ఒక సందులో రెంటుకు ఉంటూ పిల్లలను చదివించుకుంటున్న కుటుంబాలు.


పల్లెల్లో పనులు లేక శ్రావణి తల్లి లక్ష్మి, తండ్రి వెంకటేష్ పట్టణానికి వచ్చారు. లక్ష్మి ఇళ్లలో పనిచేస్తుంటే, వెంకటేష్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.


అక్కడున్న ఇండ్ల వాళ్లు ఏ పని చెప్పినా చేసి వాళ్లందరి మన్ననలు పొందింది లక్ష్మి.


వెంకటేష్ తాగి వచ్చి గొడవపడితే అందరూ కోప్పడేవారు. దాంతో కొంచెం భయభక్తులతో ఉంటాడు.


శ్రావణి తల్లితో పాటు వెళ్లి పనులు చేసి వచ్చి, స్కూలుకు తయారవుతుంటే, "బిడ్డా, నిన్ను హాస్టల్లో వేద్దామనుకుంటున్నాము. మీ ఇద్దరికీ ఫీజులు కట్టలేము. నువ్వు హాస్టల్ పోతే ఖర్చులు తగ్గుతాయి" అన్నది లక్ష్మి.


"నన్నెందుకు హాస్టల్లో వేస్తానంటున్నావ్? తమ్ముణ్ణి వేయ్, నేనే నీ దగ్గర ఉండి చదువుకుంటాను. నువ్వు ఫీజు కట్టకుంటే నేను గవర్నమెంట్ బడికి పోయి చదువుకుంటా, కానీ నేను హాస్టల్ కు పోనమ్మ" అన్నది శ్రావణి.


"అంటే తమ్ముడు చిన్నోడు, ఇప్పుడు తీసుకోరు. ఆరో తరగతి నుంచి తీసుకుంటారట.


ఇప్పుడు నువ్వు ఆరో తరగతి కదా! అందుకే నిన్ను అందులో వేద్దాం అనుకుంటున్నాను" అన్నది.


"అది కాదమ్మా! నేను నీతో వచ్చి అందరి ఇండ్లలో పని చేస్తున్నా కదా! నీకు కష్టం కాకుండా చూసుకుంటున్నాను కదా! నేను హాస్టల్ కు పోతే నువ్వు ఒక్కదానివే పనులు చేసుకోవాలి కదా" అన్నది శ్రావణి. మూడు రోజుల నుండి తల్లిదండ్రులు చెప్పింది వినక, తిని తినక శ్రావణి ముఖంలో నవ్వు మాయమైపోయింది.


శ్రావణి చెప్పిన మాటలు విన్న భావన, రవళి శ్రావణి గురించి ఇంట్లో చెప్పడంతో వెంకటేష్‌ను పిలిపించాడు రవళి వాళ్ల నాన్న.


"చూడు వెంకటేష్, శ్రావణికి హాస్టల్ కు వెళ్లడం ఇష్టం లేదంటే ఎందుకు పంపుదాం అనుకుంటున్నారు? మా పిల్లలతో పాటు బాగా చదువుకుంటోంది కదా! అయినా మీ పనులకు కూడా సహాయపడుతోంది. ఎందుకు ఆ అమ్మాయిని బాధ పెడతారు?" అన్నాడు.


"అది కాదు సారూ, ఇద్దరికీ ఫీజులు కట్టలేం. ఇద్దరినీ ప్రైవేట్ బడికి పంపడమంటే కష్టమైతదని శ్రావణిని హాస్టల్లో వేద్దామనుకుంటున్నాము" అన్నది లక్ష్మి.


"అంకుల్, శ్రావణి బాగా చదువుతుంది. డ్రాయింగ్ కూడా వేస్తుంది" అంటున్న భావన, రవళిలను చూస్తూ... "చూడు లక్ష్మి, పిల్లలందరూ ఒక దగ్గర చదువుకుంటున్నారు.


వాళ్లకు విడిపోవడం ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చదివించాలి. వాళ్ల బతుకు వాళ్లు బతికేలా నిలబెట్టాలి. మీరు మీ కొడుకుని చదివించుకోండి. ఇప్పటి నుండి శ్రావణి మా రవళితో మా ఇంట్లోనే ఉంటుంది. మా పాపతోనే తనను చదివిస్తాను" అన్నాడు రవళి తండ్రి.


"అయ్యో! అది ఎట్లా కుదురుతుందయ్యా? బిడ్డ ఇంట్లో ఉంటే అంతో ఇంతో ఆసరైతది. మీ ఇంట్లో ఉంటే ఎట్లా?" అనగానే, "నువ్వు హాస్టల్ కి పంపితే హాస్టల్లోనే ఉంటుంది కదా! మా ఇల్లు హాస్టల్ అనుకో" అన్నాడు.


"అంకుల్ థాంక్యూ, థాంక్యూ" అని పిల్లలు చప్పట్లు కొడుతుంటే, శ్రావణి మోములో గులాబీలు విచ్చుకున్నాయి.


మల్లెల వంటి తెల్లని పలువరస మెరుస్తుంటే భావన, రవళి ఆమెను హత్తుకుంటూ, "శ్రావణి నవ్వితే ఎంత బాగుంటుందో అంకుల్.


ఇంకెప్పుడు మీరు శ్రావణిని బాధ పెట్టవద్దు, శ్రావణి మా దగ్గరే ఉంటుంది" అంటున్న పిల్లలను చూస్తూ, చేతులు జోడించి, "నా బిడ్డకు జీవితాన్ని ఇస్తానంటే వద్దంటానా? ఈయన తాగుడుతోటి ఏ రోజు ఏమైతదో అన్న భయం. పెంచలేమని హాస్టల్లో వేద్దాం అనుకున్నా" అన్నది లక్ష్మి.


రెండు రోజుల నుండి ఏడుస్తూ, మారం చేస్తున్న శ్రావణి కళ్లలో వెలుగును చూసి 'దేవుడున్నాడు, ఆయనే పిల్లలకు దారి చూపించిండు' అనుకుంటూ, కళ్లను తుడుచుకుంటూ, "సరే సర్, మీ ఇష్టం.


మీరే దేవుళ్లు. నా బిడ్డను నువ్వు మంచిగా చూసుకుంటే చాలు..." అన్నది లక్ష్మి.

"వెంకటేష్, నువ్వు కూడా తాగుడు మానేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏదైనా పని చేసుకోవచ్చు" అన్నారు అందరూ.


సిగ్గుతో తలవంచుకుంటూ, "సార్, ఇప్పటి నుండి తాగుడు మానుదాం అనుకుంటున్నాను.


ప్రయత్నం చేస్తా" అన్నాడు వెంకటేష్. మహేష్ వెళ్లి తండ్రి చెయ్యి పట్టుకోగానే, ఆ చేతుల్ని చేతుల్లోకి తీసుకుంటూ పిల్లల కోసమైనా మంచిగా బతకాలి అనుకున్నాడు.


వాళ్లిద్దరినీ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ల ముఖాల్లో సంతోషం విరబూసింది.


.. సమాప్తం .. 



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక


డా.బండారి సుజాత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


Dr.Bandari Sujatha

రచయిత్రి పరిచయం : https://www.manatelugukathalu.com/profile/bandari/profile

Dr.Bandari Sujatha

పేరు : డా.బండారి సుజాత

(ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని)


విద్యార్హతలు : M.A(adm), B.ed, M.A (Tel), M.phil, P.hd.


తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య.


సహచరుడు: ఆకుతోట ఆశయ్య

(రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ )


D.O.B :18-08-1958


వృత్తి: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విశ్రాంత ఉపాధ్యాయిని.


ప్రవృత్తి : కవితలు ,కథలు , వ్యాసాలు, వివిధ ప్రక్రియలలో సాహిత్యం రాయడం, చదవడం, అవసరార్ధులకు సహాయ మందించడం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page