'Na Lucky Srimathi' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 11/12/2023
'నా లక్కీ శ్రీమతి' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సందీప్ తో పాటు ఉద్యోగంలో జాయిన్ అయిన వారంతా ..పెద్ద పొజిషన్ లో కి వెళ్ళిపోయారు...తనకు మాత్రం ఇంకా ప్రమోషన్ డిలే అవుతోంది. ఇప్పటిదాకా..ఇంకా పెళ్ళి చేసుకునే ధైర్యం రాలేదు. పెళ్ళి కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ పోరు పెడుతూనే ఉన్నారు . పెళ్ళి చేసుకుంటే, వచ్చే జీతం చాలదని..వాయిదా వేస్తూనే వచ్చాడు సందీప్. పెళ్ళైతే, అన్నీ కలసి వస్తాయని అమ్మ ఎన్నో సార్లు చెప్పింది. అయినా.. సందీప్ మనసు అందుకు ఒప్పుకోలేదు.
మళ్ళీ ఇంకోసారి పెళ్ళి ప్రస్తావన వచ్చినప్పుడు..తప్పించుకోలేక, ఒక కండిషన్ పెట్టాడు సందీప్. నాకు ప్రమోషన్ రావడానికి ఇంకా రెండు సంవత్సరాల వరకు పట్టే అవకాశం ఉంది. వచ్చే ఆ కట్నం డబ్బులతో అప్పటివరకు సంసారం నడిపిస్తాను..అని తన ప్లాన్ చెప్పాడు సందీప్. పెళ్ళైతే చాలని, తప్పక ఒప్పుకున్నారు కన్నవారు.
పెళ్ళి చూపులలో అందరికీ అమ్మాయి నచ్చింది . ఇద్దరు విడిగా మాట్లాడుకోవడానికి అలా వరండా లోకి వెళ్లారు.
"నా పేరు సందీప్.." అని మొదలుపెట్టాడు మన హీరో
"నా పేరు స్వాతి !" అని బదులు వచ్చింది
"మీది చక్కని పేరు! నేను నచ్చానా?" అని సిగ్గుపడుతూ.. అడిగింది స్వాతి
"అవునన్నట్టు తల ఊపి...మరి నేనో..." అడిగాడు సందీప్
"దానికి ఆమె చిరునవ్వు నవ్వింది..! "
"మీరు చాలా మంచివారు లాగా ఉన్నారు. కట్నం తీసుకోరు కదా...!"
గొంతులో చేదు కషాయం పోసినట్టు అయ్యింది సందీప్ కు. అమ్మాయి బాగా నచ్చేసింది. కట్నం అడుగుదామన్నా...ఇప్పుడు అడగలేడు.
"హలో! ఏమిటి ఆలోచిస్తున్నారు? కట్నం విషయమా?"
"మీరు ఏమి అనుకోక పొతే..ఒక మాట...." అని మెల్లగా మొదలుపెట్టాడు సందీప్
"చెప్పండి...పర్వాలేదు.."
నాకు ప్రమోషన్ వస్తే కానీ, జీతం పెరగదు..అలాగని పెళ్ళి వాయిదా వెయ్యలేను..చేసుకోవాలి..మీరు నాకు బాగా నచ్చేసారు! పెళ్ళి తర్వాత బాగా ఎంజాయ్ చెయ్యాలని నా కోరిక. దానికి డబ్బులు బాగా కావాలి..మీకు తెలియనిది కాదు. కట్నం వస్తే, మనం ప్రమోషన్ వచ్చే వరకు హ్యాపీ గా ఉండొచ్చని అనుకున్నాను అంతే..! అప్పు చెయ్యడం నాకు ఇష్టం ఉండదు..
మీ మనసులో మాట నిర్భయంగా చెప్పినందుకు.. చాలా ఆనందంగా ఉంది. నాకూ మీ ప్లానింగ్ బాగా నచ్చింది. ఇంతవరకు వచ్చింది కనుక, చెబుతాను..వినండి. నేను చాలా లక్కీ అని అందరు అంటారు. మా నాన్న కు, నేను పుట్టాకా..బాగా కలిసి వచ్చిందని..అందరూ అంటారు. ఏదైనా లక్కీ డిప్ కి, నా పేరే ఇస్తారు మా ఇంట్లో..ఫ్రెండ్స్ అంతా కుడా నాది లక్కీ హ్యాండ్ అంటారు.
నన్ను పెళ్ళి చేసుకుంటే, మీరు కుడా లక్కీ అవుతారు. మీకు వెంటనే ప్రమోషన్ వచ్చేస్తుందేమో..చూడండి! నా మాట నమ్మి, కట్నం అడగకండి..మీ కోసం నేను ఉన్నాను. మీ అంత మంచి భర్త ఈ రోజుల్లో దొరకరు!"
కట్నం ఊసు లేకుండా..పెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేసారు. పెళ్ళి ఉన్నంతలో బాగా జరిగింది. పెళ్ళి రిసెప్షన్ కు ఆఫీస్ స్టాఫ్ ను పిలిచాడు సందీప్. తన బాస్ రావడం చూసి..సాదరంగా ఆహ్వానించాడు. బాస్ ఇచ్చిన గిఫ్ట్ కవర్ జాగ్రతగా తన కోట్ జేబులో పెట్టుకున్నాడు. రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.
మొదటి రాత్రి గదిలో కి వచ్చిన స్వాతి, భర్త తో ..మీరు రిసెప్షన్ కు వేసుకున్న కోట్ చాలా బాగుందండీ!..అని హ్యాంగర్ కు ఉన్నది తీసి పట్టుకున్నప్పుడు.. అందులోంచి బాస్ ఇచ్చిన కవర్ కింద పడింది.
ఏమిటో ఈ కవర్ అని..ఓపెన్ చేసి చూసింది స్వాతి. కంగ్రాట్స్ శ్రీవారు! ఇది మీ ప్రమోషన్ లెటర్!
ఆత్రుత తో...కవర్ తన చేతికందుకుని...గబ గబా చదివేసాడు సందీప్. విషయం తెలిసి...ఎగిరి గంతేశాడు.
ఇక్కడ చూడండి..నా చేతిలో ఇంకొక కవర్ ఉంది..కట్నం ఇవ్వలేదని మా నాన్న మన కోసం బుక్ చేసిన హనీమూన్ టికెట్స్!
"నువ్వు చెప్పింది నిజమే స్వాతి!...నువ్వు నా లక్కీ శ్రీమతి"
****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలుతాత మోహనకృష్ణ
コメント