top of page
Original.png

నా చైత్ర

నా చైత్ర, తెలుగు కుటుంబ కథ, భార్యాభర్తల అనుబంధం, దాంపత్య జీవితం, కుటుంబ విలువలు, అపార్థాలు, కుటుంబ కథలు, మన తెలుగు కథలు, Telugu family story, husband wife relationship, emotional Telugu story, Yamini Kolluru

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నా చైత్ర' కథలో చిన్న అపార్థాల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ నవ్వుకుంటూ కలిసి నిలబడ్డ చైత్ర, గోకుల్ దంపతులు.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నా చైత్ర' కథలో చిన్న అపార్థాల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ నవ్వుకుంటూ కలిసి నిలబడ్డ చైత్ర, గోకుల్ దంపతులు.

Na Chaithra - Telugu Emotional Family Story | Yamini Rajasekhar

నా చైత్రతెలుగు భావోద్వేగ కుటుంబ కథ | యామిని రాజశేఖర్

Published In manatelugukathalu.com On 02/07/2026 


దాంపత్య జీవితంలో పెద్ద సమస్యలు కాకుండా, చిన్న చిన్న అపార్థాలే ఎన్నో బంధాలను దెబ్బతీస్తాయి. ఒకరి మాట మరొకరు పూర్తిగా వినకపోవడం, బయటి వ్యక్తుల ప్రభావానికి లోనవడం, అనుమానాలకు చోటివ్వడం వల్ల ప్రేమతో మొదలైన సంసారం కలతలకు గురవుతుంది. "నా చైత్ర" కథలో చైత్ర–గోకుల్ జీవితాల ద్వారా పరస్పర నమ్మకం, అవగాహన, ఓర్పు, ప్రేమ ఎంత ముఖ్యమో రచయిత్రి హృద్యంగా ఆవిష్కరించారు.


చైత్ర, గోకుల్ ఇద్దరూ కూడా పెద్దల సమ్మతితో ఎంతో ఘనంగా వివాహాన్ని అందరి సమక్షంలో చేసుకుంటారు. చైత్ర ఒక ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంది. గోకుల్ బ్యాంకులో మేనేజర్‌గా ఉంటాడు. ఇద్దరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉంటారు. ఏడాది గడుస్తుంది. అలా ఇరుపక్షాల వాళ్ళు కూడా వాళ్ళ కాపురాన్ని చూసి, ఎక్కడా కూడా వాళ్ళు చదువుకున్నామన్న అహంభావం లేకుండా సాగిపోతుందని ఎంతో సంతోషిస్తారు.


రెండవ సంవత్సరం పెళ్లి రోజు నాడు గోకుల్ ఆలస్యంగా ఇంటికి వస్తాడు. అది చూసి చైత్ర పెళ్లి రోజు కూడా ఇంత ఆలస్యంగా వచ్చావు అని ఎంతో గొడవ పడుతుంది. అది తన తప్పని గ్రహించి తనకి సర్ది చెప్తాడు. మరోరోజు తనని బయటకు తీసుకెళ్తాడు. అక్కడ గోకుల్ కి ఫోన్ రావడం గమనించిన చైత్ర లేచి వెళ్లిపోతుంది.


మరలా అతనే వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి "ఇది ఆఫీసుకు సంబంధించింది చైత్ర" అని అంటాడు.


"మరి నేను కూడా ఆఫీసులో పనిచేస్తున్నాను కదా" అని అంటుంది. 


అలా ఒక వారం రోజులు ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడుకోకుండా మాటకు మాటతో గొడవ పడుతూ ఉంటారు.


మరొకసారి గోకుల్ ఏదో పని ఉందని తెల్లవారుజామున తలుపుకి తన దగ్గర ఉన్న తాళం వేసుకొని వెళ్లిపోతాడు. సాయంత్రానికి ఇంటికి వస్తాడు. చైత్ర కూడా ఆఫీస్‌కి వెళ్లి వస్తుంది. "ఒక్క ఫోన్ కూడా చెప్పడానికి సమయం లేదా?" అని అంటుంది. 


"చైత్ర, చూడు, ప్రతి చిన్న దానికి నువ్వు ఇలా గొడవలు పడుతుంటే సంసారం ఎలా కొనసాగుతుంది?"



"ఎంతో చదువుకున్నావు, మంచి ఉద్యోగంలో ఉన్నావు. కాస్త నన్ను అర్థం చేసుకోవాలి కదా" అని అంటాడు. 


"అంటే ఎప్పుడూ కూడా నిన్ను అర్థం చేసుకోలేదా? నువ్వు చేసే పనులు ఏమైనా బాగున్నాయా?" అని ఎంతో గొడవ పడుతుంది. 


"చైత్ర, ఇదే కొనసాగితే చాలా కష్టమవుతుంది. అసలు నేను ఏ పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చాను అని అడగకపోగా, ప్రతీ దానికీ గొడవేనా? ఆలోచించావా?" అని అంటాడు.


"ఏంటి గోకుల్, నా కన్నా నీకు వాళ్ళు ఎక్కువ?" అంటుంది. 

గోకుల్ కి ఎంతో కోపం వస్తుంది. గోకుల్ వెంటనే "చైత్ర, నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. నీ నిద్రకి ఇబ్బంది కలగకూడదని నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించి వచ్చాను."


"నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను" అని అంటాడు. 


ఏం చెప్పాలో తెలియక చైత్ర గోకుల్‌ని చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు చైత్రని "అమ్మగారిని చూసొద్దాం రా" అని పిలుస్తాడు. 


"నాకు పని ఉంది" అని అంటుంది.


ఏం చెప్పలేక గోకుల్ ఒక్కడే వెళ్లి అమ్మని చూస్తాడు. "చైత్ర రాలేదా?" అని అడుగుతుంది తల్లి. "రేపు వస్తుంది" అని చెప్తాడు. మరుసటి రోజు చైత్ర ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను చూసి "నేనే సర్ధాలా?" అని అంటుంది.


"చూడు చైత్ర పని ఉంది. నీకు మరలా సాయపడతాను కదా, దీనికింత గొడవ ఎందుకు? ఇద్దరం కలిసి వారాంతంలో చేద్దాము" అని అంటాడు.


ఇలా అయిన దానికి కాని దానికి కూడా ఎంతో పెద్ద గొడవ జరుగుతుంది. ‘ఇక నాకు నీకు ఎలాంటి సంబంధం లేద’ని ‘వాళ్ళ ఇంటికి వెళ్లి పోతాను’ అని అంటుంది. 


"అదేంటి చైత్ర, అసలు ఏం జరిగింది? నీవు చీటికి మాటికి గొడవ పడుతున్నావు. సంసారం అన్న తర్వాత సర్దుకోవాలి కదా! అసలు నువ్వేనా పెళ్లికి ముందు ఎంత బాగుండే దానివి! అసలు నీతో ఎవరైనా ఇలా చేస్తే ఎలా ఉంటుంది?" అని కోపంతో అడుగుతాడు గోకుల్.


అప్పుడే పక్కింట్లో నుంచి ప్రమీల వస్తుంది. ఆమెను చూసిన గోకుల్ "అసలు నా చైత్ర ఇలా అవడానికి కారణం... ఏదైనా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ చూడు ఏదో ఒక గొడవ పడుతుంటారు భార్యాభర్తలు, కానీ సాయంత్రానికి వాళ్ళిద్దరేనా అన్నట్లు ప్రేమలో మునిగిపోతుంటారు. మరి అలాంటిది మా సంసారంలో ఎందుకు? ఈ ఆంటీ ఇలా..." అని "ఆంటీ మీరు ఎందుకు వచ్చారు?" అని అడుగుతాడు.


"ఏం లేదు నాయనా, ఏదో నీ గొంతు వినిపిస్తే అమ్మాయికి ఏమైనా బాగాలేదేమో అని చూద్దామని వచ్చాను" అని అంటుంది. 


"ఆంటీ నేను నా భార్యను చూసుకుంటాను, ఏమీ అనుకోవద్దు" అని అంటాడు.


"చూడు చైత్ర, ఇప్పుడు నీవు ఇలా ఉండటానికి కారణం అర్థమైంది. అందరితో కలిసి ఉండు, తప్పు లేదు.వాళ్ళు ఎలాంటి వారో కూడా తెలుసుకోవాలి. ఆ ఆంటీకి పక్కన వారు బాగుంటే చూడలేరు.


ఆంటీ వల్ల నీవు ఇలా అని నేను అర్థం చేసుకోగలను. నా చైత్ర ఏమిటో..." అనటంతో, "నిజమే కదా, నేను నా గోకుల్ తో ఇలా ఏంటా అని..." అని ఇద్దరూ కూడా నవ్వుకుంటూ, "అత్తమ్మని చూడాలి గోకుల్ పద" అని అంటుంది.


***


యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు యామిని కోళ్ళూరు ....చదువు ఎం.ఏ ...ఎంఫిల్...

నా చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో లోనే జరిగింది....

నా అక్షరమే నాలో నింపేను ఉత్సాహంనా అక్షరమే  ఆయుధం నా రచనలకు స్ఫూర్తి దాయకం....

గత నాలుగు సంవత్సరాలుగానేను సాహితీ సమూహాల్లో కవితలు,,, వ్యాసాలు....,కథలు,,,రాయటం.... సమీక్షలు చేయటం....పలు సన్మానాలు,,,,ప్రశంసా పత్రాలు అందుకొన్నాను ‌.....  కొన్ని సదస్సులో....  ఐదవ తెలుగు ప్రపంచ సదస్సులో ...అంతర్జాల సదస్సులో పాల్గొన్న,,,  నిత్య విద్యార్థిని..... ఇంకా భాష గురించి నేర్వాల్సింది చాలా వుంది.......నేను ఇలా ఈ స్థానంలో వున్నానంటేనాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి,,,, గురువులు...రక్తసంబంధీకులు,,,మావారు,,,,, పిల్లలు.... సాన్నిహిత్యాలు వీరి వెన్నుదన్నే కారణం....

ఎందరో కవులు కవయిత్రులు నుంచి కూడాఎంతో తెలుసుకోవాలి....

ఇంకా బాగా రాయాలి......నా లక్ష్యం ఆశయం నేను చేరుకోవాలి....

ప్రస్తుతానికి ఇదే నా గురించి....ధన్యవాదాలు

యామిని కోళ్ళూరు ✍️




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page