top of page
Original.png

ఆంధ్రప్రదేశ్ ఉనికి

3 hours ago
1 min read


ఆంధ్రప్రదేశ్ ఉనికి – గోదావరి, కృష్ణా నదులు, తెలుగు చరిత్ర, సాహిత్యం, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రం

Andhrapradesh Uniki - Telugu Inspirational Poem | Naga Suneetha Pokala

ఆంధ్రప్రదేశ్ ఉనికి - తెలుగు ప్రేరణాత్మక కవిత | నాగ సునీత పోకల

Published in manatelugukathalu.com on 24/09/2026



అనగనగా ఒక ప్రపంచం ఉంది.

ఆ ప్రపంచంలో 7 ఖండాలున్నాయి.

ఆ ఖండాలలో ఆసియా ఖండం ఒకటి

ఆ ఆసియా ఖండంలో 48 దేశాలున్నాయి.

ఆ దేశాలలో భారతదేశం ఒకటి.

ఆ దేశానికి ఉత్తరాన హిమాలయాలు

తూర్పున బంగాళాఖాతం,

పడమరన అరేబియా సముద్రం

దక్షిణాన హిందూ మహాసముద్రం హద్దులుగా ఉన్నాయి.

ఆ భారతదేశంలో 28 రాష్ట్రాలున్నాయి.

ఆ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.

ఆ రాష్ట్రానికి ఉత్తరాన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు, 

తూర్పున బంగాళాఖాతం, 

పడమరన కర్ణాటక, 

దక్షిణాన తమిళనాడు ఎల్లలుగా ఉన్నాయి.

మెగస్తనీస్, మార్కోపోలో, పేయస్ వంటి విదేశీ యాత్రికులు ప్రశంసించిన రాష్ట్రం ఇది.

శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, కుతుబ్‌షాహీలు, నిజాం పాలకులు పాలించిన రాష్ట్రం ఇది.

రుద్రమదేవి పాలించిన వీరగడ్డ ఇది.

శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన శాంతిగడ్డ ఇది.

నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, వేమన రచనలు ఆంధ్రవారి సొత్తు.

అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు జన్మించిన పుణ్యక్షేత్రమిది.

అందుకే నేనంటున్నాను గోదావరి, కృష్ణమ్మ వంటి నదులతో, సారవంతమైన భూములతో పునీతమైన తెలుగు నేలలో

పుట్టడం మన అదృష్టమని.


***


పరిచయం: నాగ సునీత పోకల



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page