top of page
Original.png

రోడ్లు రోధిస్తున్నాయి

3 hours ago
1 min read

రోడ్లు రోధిస్తున్నాయి, వానజల్లు – బి. ఎన్. సత్యనారాయణ తెలుగు కవితలకు ప్రతీకాత్మక వర్షాకాల చిత్రం

Rodlu Rodhisthunnaayi - Telugu Inspirational Poem | B. N. Satyanarayana

రోడ్లు రోధిస్తున్నాయి - తెలుగు ప్రేరణాత్మక కవిత | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 24/09/2026


రోడ్ల దుస్థితిలో ప్రజల వేదనను ప్రతిబింబించే “రోడ్లు రోధిస్తున్నాయి”, వాన చినుకులతో తెరుచుకునే తలపులను అందంగా ఆవిష్కరించే “వానజల్లు” — బి. ఎన్. సత్యనారాయణ గారి రెండు భావగర్భిత కవితలు.


రోడ్లు రోధిస్తున్నాయి

—————————-

కన్నతల్లులకు

తిండి పెట్టక

తిట్లనే తినిపించే

కఠినులైన కొడుకులను

తలచుకుంటూ

రోధిస్తున్న తల్లులవలె

రోడ్లు రోధిస్తున్నాయి।


పూటుగా తాగొచ్చి

భార్యలను బూతులు తిడుతూ

బడితెతో దాడిచేసే భర్తల

పురుషాధిక్యాన్ని

భరిస్తూ రోధించే భార్యల వలె

రోడ్లు రోధిస్తున్నాయి ।


వానలు వరదలతో

దారులు పూడుకుపోయి

చిత్తడి చిత్తడిగా అయిపోగా

జనులు నడవలేక పడుతున్న

నరకయాతనలవలె

రోడ్లు రోధిస్తున్నాయి।


కాలువలు మేన్‌హోళ్లు

మురుగుతో నిండిపోయి పొర్లుతూ

ముక్కులు బద్దలు కొట్టేలా

వెలువరించే దుర్వాసనలను

భరించలేక

బాధలు పడుతున్న జనుల్లా

రోడ్లు రోధిస్తున్నాయి।


ముఖానికి పూసుకునే పౌడర్ లా

రోడ్ల నిర్మాణంలో

డాంబరును

నామమాత్రంగా వినియోగిస్తుంటే

కొద్దిపాటి వానలకే

కంకర తేలిపోతున్న

ఆ రోడ్లపై పోయేందుకు

కష్టాలను ఎదుర్కొంటున్న జనుల్లా

రోడ్లు రోధిస్తున్నాయి।


కంకర తేలుతూ గుంతలు పడి

రోడ్లు వంతెనలు పిగిలి పోతుంటే

గుండెల్ని చిక్కబట్టుకొని

గమ్యాలు చేరుకోవడంలో

భీతి చెందుతున్న జనుల్లా

రోడ్లు రోధిస్తున్నాయి


వానజల్లు 

—————————

వాన వస్తే

ఒళ్ళు తడిస్తే

తలపులు

తెరుచుకుంటాయి

తలుపులు

మూసుకుంటాయి


***



 B. N. సత్యనారాయణ.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page