నలుగురు నీతో
- Ramu Kola

- 8 hours ago
- 2 min read
#RamuKola, #రాముకోలా , #NaluguruNeetho, #నలుగురు నీతో, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Naluguru Neetho - New Telugu Poem Written By - Ramu Kola
Published In manatelugukathalu.com On 13/12/2025
నలుగురు నీతో - తెలుగు కవిత
రచన : రాము కోలా
ఓటమి అంచున నలిగిన ప్రతి నిరాశను
కొత్త ఆశయాల కొరకు దీపం చేయనీ,
గెలుపు రథమెక్కిన నా ప్రయాణంలో
పక్కన నిలిచిన పరాజితుని చూడనీ.
కసిగా కళ్లెర్రజేసిన కన్నీటి చుక్కను
మరో యుద్ధానికి శంఖం ఊదమనీ,
నలిగిన వాడి గళం ఉప్పెనై లేచి
కొత్త చరిత్రకు పునాది వేయనీ!
ఎప్పుడు నేనే గెలవాలని కోరుకోకు
ఓడిన వారు కూడా గెలిస్తే
ఒక్కసారైనా చూడాలని కోరుకో.
నీలో మానవత్వాన్ని చాటుకో..
***
రాము కోలా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
రచయిత పరిచయం : నా పేరు రాము కోలా. మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు.
విద్యార్హత డిగ్రీ.
ఇప్పటివరకు150 కథలు,1500 కవితలు వ్రాసాను. అనేక వార్తా పత్రికలు నా కవితలు, కథలుప్రచురించి తగిన గుర్తింపునిచ్చాయి. గాంధీ గ్లోబల్ ఫామిలీ & గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు గాంధీ విశ్వకవి సమ్మేళనం 2020 హైదరాబాద్ లో నిర్వహించి ఇచ్చిన " సాహిత్య రత్న" బిరుదు నాకు అమూల్యమైనది.




Comments