top of page

నమ్మకం


'Nammakam' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 25/10/2023

'నమ్మకం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


రాధకు కొత్తగా వివాహమైంది. భర్త రవి తో వారానికి ఒక సినిమా.. నెలకి ఒక టూర్.. హాపీ గా వాళ్ళ లైఫ్.. కొనసాగుతూంది. రాధ కు రవి అంటే చాలా ఇష్టం. మొదటి పెళ్ళి చూపులలోనే, తెగ నచ్చేసి పెళ్ళి చేసుకుంది రాధ. ఎప్పుడూ రాధ ను హ్యాపీ గా ఉంచాలనేది రవి ఫిలాసఫీ.


ఒకసారి ఇద్దరూ మంచి పిక్నిక్ ప్లేస్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. చాలా శోధించిన తర్వాత.. మంచి పల్లెటూరి వాతావరణం లో ఉన్న ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసాడు రవి.


"ఈ చోటు నీకు నచ్చిందా రాధా? ఎలా ఉంది మన పిక్నిక్ స్పాట్!"


"చూస్తే, ఇది ఊరి చివర, ఒక పల్లెటూరి లాగ ఉంది.. నిజం చెప్పండి.. పిక్నిక్ కోసం వచ్చామా? లేక హనీమూన్ కా?"


"నువ్వు ఎలాగ అనుకుంటే, అలాగే డియర్!"


"మీరు నా పక్కన ఉంటే, నా కెందుకు భయం చెప్పండి! ఎక్కడికైనా వస్తాను.. అడవిలోకైనా సరే!" అంది రాధ చిలిపిగా నవ్వుతూ..


అలా విహారానికి వెళ్ళిన ఇద్దరూ.. ఒక చోట చిన్న ఏరు ను దాటాలి. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక సన్నటి చెక్క వంతెనగా ఉంది అంతే! రవి ఆ చెక్క మీద బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఏరు ను దాటేసాడు. రాధ మాత్రం చాలా భయపడింది.


"నీకు ఏమీ కాదు రాధా! నేను ఉన్నాను.. నన్ను నమ్ము!"


"అలాగే! మీరుండగా.. నాకేమిటి భయం!" అని దాటేసి.. వచ్చి రవి ని గట్టిగా పట్టుకుంది..


ఇద్దరూ.. ఆ పిక్నిక్ చాలా ఎంజాయ్ చేసారు. అప్పటినుంచి భర్త మాట శిరసా పాటిస్తుంది, నమ్ముతుంది. రవి ఏది చెప్పినా, ఏది చెయ్యమన్నా, నమ్మకం తో చేసేస్తుంది రాధ.


ఒకసారి రవి,రాధ సినిమా కు వెళ్లారు. సినిమా హాల్ లో సినిమా అప్పుడే స్టార్ట్ అయ్యింది.. సడన్ గా, తనకి తల నొప్పి వచ్చిందని రవి తో చెప్పింది రాధ. సస్పెన్స్ సినిమా వదలి బయటకు వెళ్ళడం అవదు.. అసలే రాధ కు చాలా ఇష్టమైన సినిమా.. ఇంటర్వెల్ కుడా ఇంకా చాలా సేపు ఉంది.. కొంతసేపటికి అదే తగ్గిపోతుందని ఊరుకున్నాడు రవి.


వెంటనే ఒక ఐడియా వచ్చింది. తన జేబులో ఉన్న ఒక పిప్పరమెంటు బిళ్ళ తీసి.. తన భార్య కు ఇచ్చి.. దానిని చప్పరించమని.. తల నొప్పి పోతుందని చెప్పాడు. సినిమా లో పడి, అది ఏమిటో అంతగా పట్టించుకోలేదు రాధ. టాబ్లెట్ వేసుకున్నాను అనే ఫీలింగ్ తో సినిమా చూసింది.


సినిమా లో చాలా మునిగిపోయారు ఇద్దరూ.. లైట్స్ వేసే వరకూ ఇంటర్వెల్ అని గ్రహించలేదు.


"రాధా! నీ తలనొప్పి తగ్గిందా?"


"మీరు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్న వెంటనే తగ్గిపోయింది. చాలా థాంక్స్!"


"నిజమా! రాధా!"


"మీరు టాబ్లెట్ ఇస్తే.. తలనొప్పి తగ్గకపోవడమా చెప్పండి!" నవ్వుతూ అంది రాధ.


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


43 views0 comments

Comments


bottom of page