top of page

నాన్న మాట


'Nanna Mata' - New Telugu Story Written By Mohana Krishna Tata

'నాన్న మాట' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


తెల్లారింది! అలారం నిద్ర లెమ్మని.. గట్టిగా మోగుతుంది. దుప్పటి కప్పుకుని పడుకున్నసందీప్ కు మెలకువ వచ్చింది. వెంటనే లేచి.. దేవుని కి దణ్ణం పెట్టుకుని... హాల్ లోకి వచ్చాడు.


"అమ్మా! నేను బ్రష్ చేసుకున్నాను... కాఫీ ఇవ్వు.. "


"అలాగే సందీప్!... ఈ రోజు ఏదో ఇంటర్వ్యూ అన్నావు కదా!... బాగా ప్రిపేర్ అవ్వు కన్నా!"


"అయ్యాను అమ్మా!"


"మీ నాన్నగారే కనుక ఉంటే, ఎన్నిసార్లు నీకు గుర్తు చేసేవారో... ఈ విషయాన్నీ... "


"అవునమ్మా! నాన్న గుర్తొస్తున్నారు!"


******


సందీప్ వాళ్ళ నాన్న కళ్యాణ్.. చనిపోయి రెండు సంవత్సరాలైంది. కళ్యాణ్, కళ్యాణి ది సరదాగా సాగిపోయే సంసారం. పెళ్ళి జరిగిన నాటినుంచి ఎప్పుడూ.. గొడవ పడేవారు కాదు. కళ్యాణి అంటే చాలా ప్రేమ కళ్యాణ్ కి. ఆమె మాట కి మర్యాద ఇచ్చి.. పాటించేవాడు. కాకపోతే, కళ్యాణ్ కి కొంచం పొదుపు, క్రమశిక్షణ గా ఉండాలనే స్వభావం చాలా ఎక్కువ.. చిన్నప్పటినుంచి. భర్త పద్ధతి చూసి... ఒకొక్కసారి కళ్యాణి బాగా విసుక్కోవడం చేసేది.


భర్త పోయిన తర్వాత.. అర్ధమైంది కళ్యాణి కి... భర్త మాట విలువ ఏమిటో!.. పెళ్ళైన కొత్తలో డబ్బు దుబారాగా ఖర్చు వద్దని.. కళ్యాణ్ ఎన్ని సార్లో చెప్పేవాడు... కాని కళ్యాణి అంతగా వినేది కాదు... టైం వస్తే, తనే తెలుసుకుంటుందని అనుకున్నాడు... అందుకే, భార్యని ఎప్పుడూ ఏమి అనేవాడు కాదు..


తర్వాత ఇద్దరికీ కొడుకు పుట్టాడు. సందీప్ అని వాడికి పేరు పెట్టుకుని.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి తల్లి పోలిక రావడం చేత కాబోలు.. పొదుపు పాటించడం... దుబారా తగ్గించడం రాలేదు. ఎప్పుడూ... రూమ్ లో మనిషి లేకపోయినా... ఫ్యాన్, లైట్ వేసే ఉంటాయి.. బాత్రూం లైట్ అస్సలు ఆపడు. నీరు బాగా వృధా చేస్తాడు. ఇంట్లో పనుల లో సాయం చేయమంటే చెయ్యడు... ఎప్పుడూ కంప్యూటర్ లో గేమ్స్ ఆడుకోవడమే పని.


అలాగే, సందీప్ కు కాలేజీ లో జాయిన్ అయ్యే వయసు వచ్చేసింది. ఫోన్ కావాలని, ల్యాప్‌టాప్ కావాలని... అవీ.. ఖరీదైనవి కావాలని గొడవపెట్టేవాడు... కళ్యాణ్ ఎంత చెప్పిన వినేవాడి కాదు... తనకు అవే కావాలని మారం చేసేవాడు... సంపాదించే వయసు వస్తే, అర్ధం అవుతుందని... ఏమి అనకుండా.. అడిగినవి కొని పెట్టేవాడు... ఎంతైనా భార్యాపిల్లల కోసమే కదా! ఈ సంపాదన అని తనకి తాను సర్ది చెప్పుకునే వాడు.


ఇలాగ, రోజులు గడుస్తున్నాయి... అనుకోకుండా. ఒక రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కళ్యాణి కి. ఫోన్ లో విన్న ఆ వార్త కి కళ్యాణి కి షాక్ తో బిపి ఎక్కువై పడిపోయింది... సందీప్ హాస్పిటల్ లో జాయిన్ చేసాడు. తొందరగా కోలుకుంది. కళ్యాణ్ కు గుండెపోటు రావడం తో హాస్పిటల్ లో జాయిన్ చేసారని ఆఫీస్ నుంచి ఫోన్ అది. కొన్ని రోజులకు ఆరోగ్యం క్షిణించి.. కళ్యాణ్ చనిపోయాడు.


అప్పట్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ.. కళ్యాణ్ చూసుకోవడం చేత... ఇప్పుడు కళ్యాణి కి చాలా కష్టం అనిపించింది...


కళ్యాణ్ చెప్పిన పొదుపు గురించి బాగా గుర్తొచ్చేది కళ్యాణి కి.. అది తలచుకుని చాలా బాధ పడేది. ఆయన చెప్పిన మాటలకు అర్ధం.. ఇప్పుడు తెలిసి వచ్చింది ఆమె కి.


******

"సందీప్! బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటర్వ్యూ కి వెళ్ళు కన్నా!.. ఆల్ ది బెస్ట్. నేను ఆఫీస్ కు వెళ్తున్నాను... "


"అలాగే అమ్మా!"


బ్రేక్ ఫాస్ట్ చేసి... నీట్ గా రెడీ అయ్యి.. ఇంటర్వ్యూ కు టైం కన్నా... పది నిముషాలు ముందే వెళ్ళాడు...

ఆఫీస్ చాలా పెద్దది.. ఇంటర్వ్యూ జరిగే రూమ్ కు వెళ్తున్న మార్గంలో... చాలా చోట్ల.. ఎవరూ లేకుండా.. ఫ్యాన్లు, లైట్స్ వేసి ఉండడం గమనించాడు. వెంటనే వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి. అనవసరమైన వాటిని స్విచ్ ఆఫ్ చేసాడు. కొన్ని చోట్ల, నీరు వృధాగా పోవడం చూసి, వాటిని కట్టేశాడు. నీటిని వృధా చేయరాదని వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.


ఇంటర్వ్యూ వరసలో... తరవాత సందీప్ ని రూమ్ లోకి పిలిచారు...


లోపల ఇంటర్వ్యూ చేసే ఆయన...

"నువ్వు.. ఈ రూమ్ వరకు వస్తున్నప్పుడు.. ఏమిటి చేసావు?" అని అడిగాడు.


"కింద నుంచి మెట్ల ద్వారా వచ్చాను... ఇక్కడ బయట కూర్చున్నాను"


"మధ్యలో... ఏమిటి చేసావు?"


"అనవసరంగా... తిరుగుతున్న ఫ్యాన్స్ ఆఫ్ చేసాను.... అలాగే లైట్స్ కుడా... వృధాగా పోతున్న నీటిని కట్టేసాను.. "


"నాకు నీలాంటి వాడే కావలి ఈ కంపెనీ కి.... ఇంతమంది ఉన్నా.. ఎవరూ పట్టించు కోలేదు... కానీ.. నువ్వు మాత్రమే, భాద్యతగా.. ఇవన్నీ చేసావు.. నాకు చాలా బాగా నచ్చింది..

నిన్ను అప్పుడే సెలెక్ట్ చేశాను... సందీప్"

"థ్యాంక్స్ సర్!"


(మనసులో నాన్న మాట విలువ తెలుసుకున్న సందీప్... నాన్న కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు)

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


66 views0 comments
bottom of page