top of page
Writer's pictureNeeraja Prabhala

నాన్న


'Nanna' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala

'నాన్న' తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


నాన్న ఉంటే ఒక ధైర్యం, ఒక అండ, ఒక ఆదరణ.. నాన్న ఒక మేరువు.

గంభీరమైన వ్యక్తిత్వానికి చిరునామా నాన్న.

నాన్నంటే నా ప్రాణం.


నిరాడంబరత, నిస్వార్ధము‌ కలిగి నిర్మలమైన ప్రేమాప్యాయతలను చూపిన నాన్న నా మీదే కాక నా బిడ్డలమీద కూడా అంతే ప్రేమాప్యాయతలను చూపిన మా నాన్న.


మధ్య తరగతి సంసార సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా నడిపిన మహరాజు మా నాన్న.


నన్ను తన గుండెలమీద ఉంచుకుని మురిపెంగా ఆడిస్తూ, భుజాలమీదకి ఎక్కించుకుని ఆడించిన బంగారు తండ్రి మానాన్న.


జీవన సమరంలో కష్షనష్టాలన్నీ తనే ధైర్యంగా ఎదుర్కొని ఏనాడూ వేటికీ భయపడని మహయోధుడు మా నాన్న.


అందరూ తనవాళ్లే అనుకుని అందరి సుఖసంతోషాలను కోరుకునే ప్రేమమూర్తి, అల్పసంతోషి మానాన్న.


కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించిన మానాన్న.

ఎవరినుంచీ ఇసుమంతైనా ఏమీ ఆశించని నిస్వార్థుడైన మహా మనీషి మానాన్న.


తనకున్నదాంట్లో చేతిన ఎముక లేకుండా అందరికీ దానధర్మాలు చేసిన అపర దానకర్ణుడు మా నాన్న.


నన్ను ప్రేమగా పెంచి నాకు విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పిన మా నాన్న నాకు కనిపించే, కనిపెంచిన ప్రత్యక్ష దైవము.

కడదాకా ఎన్నో, ఎన్నెన్నో కష్షాలను, మానసిక, శారీరక బాధలను అనుభవించిన నాన్నను తలుచుకుంటుంటే నాకు కన్నీరు ఆగదు.


నా జీవితంలో అసలు నాన్నను తలుచుకోని క్షణమంటూ లేదు.


"నాన్నా! ఎక్కడున్నావు ? ఎలా ఉన్నావు?"


నన్ను "పాపాయి" అని ప్రేమగా పిలిచే నీ పిలుపేది?


కడదాకా నిన్ను ప్రేమగా చూసుకుని నీకు ఎంతో సేవ చేయాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని నిస్సహాయురాలిని.

ఇప్పుడెంత వగచినా ఏం ప్రయోజనం ?


మరు జన్మలో కూడా నీ బిడ్డగా పుట్టి నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని నాకోరిక.


కన్నీళ్లతో నీ పాపాయి.


. …నీరజ హరి ప్రభల.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



133 views0 comments

ความคิดเห็น


bottom of page