top of page
Original_edited.jpg

అక్షర పత్ర పూజ

  • Writer: Ayyala Somayajula Subramanyam
    Ayyala Somayajula Subramanyam
  • Sep 17, 2023
  • 2 min read

ree

'Akshara Pathra Puja' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam

'అక్షర పత్ర పూజ' తెలుగు కవిత

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

శ్రావణం చెఱువులన్నింటినీ నింపేశాక,

బహుశా కొంచెం కొఱవుందేమోనని

భాద్రపదం బహువిధాలుగా కురుస్తుంది.


చెరువుల్లో నుండి పూడిక తీసిన మట్టి చేరి

మనయింట్లో వేలుపుగా కొలువు తీరుతుంది.

పులకించిన మన్ను మిన్నుకు వేయి పుట్టగొడుగుల వేళ్ళుజోడించి నమస్కరిస్తుంది.

చంద్రకాంతలూ, విష్ణుకాంతలూ ఒకేసారి విరగబూసి భాద్రపదానికి సొగసులద్దుతాయ్‌.


గరికలన్నీ ఈ మాసానికి మేమే మహారాణులమని గర్వంగా వెన్నువిరుచుకుని ముత్యపు కిరీటాలు అలంకరించుకుని తలెత్తి నిలుస్తాయ్‌.


చెఱువ గట్లమీద ఉమ్మెత్తలు ఊరికే కులుకుతూ ఉంటే.. గన్నేరులు గుంభనంగా నవ్వుతూ అందాలొలకబోస్తుంటాయ్‌.


సన్నజాజి తీగలన్నీ పచ్చటి కోకలతో ముచ్చటగా వగలు పోతూ పలకరిస్తూ వుంటే.. మరువం, మాచీపత్రి, దవనం దర్పంగా గుభాళిస్తుంటాయ్‌.


జమ్మి చెట్లు నెమ్మదిగా మేమిదిగోనని కొమ్మలు చాస్తే.. తుమ్మిపూలు తుంటరిగా నవ్వులు విసురుతాయ్‌.


బదరీ పత్రాలు ముళ్ళపరదాలు దాచుకుని వొచ్చి తలలూపుతుంటే..

చూతపత్రాలు చిత్రపు నవ్వుతో వాటిని పలకరిస్తుంటాయ్‌ !


తులసి పత్రాలు వెలసిన దేవేరులై వేయొక్క అందాలు వెలిగిపోతూ వుంటే..


బిల్వ పత్రాలు బేసి నేత్రాల్లా అగుపించి మురిపిస్తుంటాయ్‌


దాడిమీ పత్రపు పెదవులు దరహసాలొలకబోస్తుంటే.. దేవదారు పత్రాలు కొంటెతనపు కులుకులతో కోటినవ్వుల పలకరిస్తుంటాయ్‌.


సింధువారపత్రాలు సిగ్గులారబోసి స్నిగ్ధ సౌందర్యాలతో ముగ్దుల్ని చేస్తుంటే

అపామార్గ పత్రాలు అల్లరి చూపులతో తెల్లారకట్ట విచ్చుకునే విరిబాలలా చూపుల్ని తమవైపు తిప్పుకుంటాయ్‌.


బృహతీ పత్రాలు బలేపసందైన రంగులలో హంగు చేస్తుంటే..

దత్తూర పత్రాలు ఒత్తైన సోయగంతో సొగసులీనుతుంటాయ్.


అర్జునపత్రాలు మన తర్జని తమవైపు తిప్పి చూపించేలా

గాలి అలలకు గలగలమని గోల చేస్తుంటే..


అశ్వథ్థ పత్రాలు మనకి స్వస్థత కూరేలా వీవనలూవుతుంటాయ్‌.

అర్కపత్రాలు వానాకాలపు ఎండలో చిత్రంగా మెరిసి మఖ్‌మల్‌ వలువలు మొక్కలపై నేసారా అని అచ్చెరవొంది

ఆనందపడేలా చేస్తాయ్‌.


భాద్రపదమాసం నేలంతా అప్పుడే నేసిన ఆకుపచ్చటి తివాచీ పరచినట్లుంది.

పండితుడే కాదు పామరుడు కూడా పులకించి పెదవులతో ఓ పదం ఉచ్చరించేటట్లుంటుంది.

నిండుగా పారే ఏటివడ్డున వర్షఋతువు వీడ్కోలు సభకి వస్తారు కదా..


పండగొచ్చినట్లుగా వుండే ఆకుపచ్చటి అక్షరాలు అల్లి కవితల దండొకటి తెస్తారు కదా!

------------------------------------------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page