top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 8


'Amavasya Vennela - Episode 8 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది.

చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు. పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ.చంద్రికను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళతారు. ఆమె తొందరగా రికవర్ అవుతోందని చెబుతారు డాక్టర్..


మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 8 చదవండి

అంతలోనే..

అక్కడికి లక్ష్మి వచ్చింది.

"ఏం రమణ.. నీకు మా అమ్మాయి చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పేసిందటగా." నవ్వుతూ అంది.


అందుకు శ్రీరమణ.. "మరే మేడమ్.." అంటుండగానే..

అడ్డై..

"హే మాన్.. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మామ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్." అంది సాగర.


తల గోక్కున్నాడు శ్రీరమణ.


"బేబీ.. ఓకే.. డోన్ట్ బాదర్." అంది లక్ష్మి చొరవగా.


"థాంక్స్ మేడమ్." టక్కున అన్నాడు శ్రీరమణ.


ఆ ముగ్గురూ నవ్వుకున్నారు.

"లెట్స్ గో. మమ్మీ బై." అంది సాగర.


తర్వాత..

శ్రీరమణ వెంట నడిచింది.

ఇప్పుడు డ్రయివింగ్ సీటులోకి నేరుగా ఎక్కేసింది.

శ్రీరమణ ఆమె పక్క సీటులోకి ఎక్కాడు.

సాగర కారు స్టార్ట్ చేసింది.

తనుకు చాలా సులభంగా కారు డ్రయివింగ్ నేర్పించగలిగాడు శ్రీరమణ.


***

"రంగ.. ఈ సరుకు ఈ రాత్రికే వారికి ముట్ట చెప్పాలి." చెప్పాడు అవతారం.


"అలానే సార్." అన్నాడు రంగ.


"అటు ఒత్తిడి జాస్తీ అవుతుంది. ఆలస్యం ఐతే డీల్ పోతోంది." గందికవుతున్నాడు అవతారం.


"మీకు టెన్షన్ వద్దు. నేను కానిస్తానుగా." అన్నాడు రంగ.


"కానిస్తాను కాదు.. చేసి పెట్టాలి." చెప్పేసాడు అవతారం.


ఆ వెంబడే..

"నీకు ప్రతి మారులానే ముట్ట చెప్పుతా. నీ కష్టం వృధా కానియ్యను. సరేనా." నొక్కి చెప్పాడు అవతారం.


రంగ ఆ పని మీద కదిలాడు.. అవతారం అందించిన లెదర్ బేగ్ తో.


***

రాత్రి ఎనిమిది.

శ్రీరమణ భోజనం చేస్తున్నాడు.

అతడి ఎదురు బల్ల మీద కూర్చుని ఉంది పార్వతమ్మ.

ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.

"ఆ చంద్రిక అమ్మాయిలో మార్పు వస్తుందా." ఆరా తీస్తుంది పార్వతమ్మ.


"కుర్చీలో కూర్చో పెట్టగలుగుతున్నారు. కాళ్లు చేతులు ఆడుతున్నాయి. తల కూడా నిలుపు తుంది. కళ్లే తెరవదు. పిలిచినా పలకదు." చెప్పాడు శ్రీరమణ.


"ఒళ్లు ఎలా ఉంది." అడిగింది పార్వతమ్మ.


"అంటే." అడిగాడు శ్రీరమణ.


"అదే. మెత్తగా ఉంటుందా. బిగుసుకుపోయేలా ఉందా." అడిగింది పార్వతమ్మ.


"నేను రెండు మూడు మార్లు తనను కూర్చుండ పెట్టడంలో ఉన్నానుగా. అప్పుడు మామూలుగానే.. మన లానే తగిలింది ఆమె ఒళ్లు." చెప్పాడు శ్రీరమణ.


మరేం అడగలేదు పార్వతమ్మ.

శ్రీరమణ అన్నంలో మజ్జిగ కలుపుకుంటూ ఉండగా..

"ఆ డాక్టర్ పాపకు కారు తోలడం వచ్చేసిందా." అడిగింది.


"ఇంకా డాక్టర్ కాదు.. తను డాక్టర్ చదువు చదువుతుంది." నవ్వేడు శ్రీరమణ.


"అదేలే." అనేసింది పార్వతమ్మ.


"త్వరగానే డ్రయివింగ్ నేర్చేసుకుంది." చెప్పాడు శ్రీరమణ.


"మంచి పట్టుంటే మరంతే. ఏదీ కష్టం అవ్వదు." అంది పార్వతమ్మ.


శ్రీరమణ భోజనం ముగిసింది.


***

రాత్రి తొమ్మిది దాటుతుంది.

టాక్సీ స్టాండ్ ను చేరాడు రంగ.

అక్కడ శ్రీరమణ ఒక్కడే ఉన్నాడు.

అతడిని కిరాయికి కారు కోరాడు రంగ.


"అబ్బో. అక్కడికి చాలా దూరం అవుతుంది." అన్నాడు శ్రీరమణ.


"ఎంతేమిటి.. ఏభై మించి ఉండదబ్బా. నన్ను అక్కడ దింపేస్తే చాలు. కావాలంటే కిలో మీటర్ లెక్కన నీకు నేను ఇస్తానులే." చెప్పాడు రంగ.


అప్పుడే..

"అటు నుండి ఏమీ ఉండదు. పైగా బాగా రాత్రి అవుతుంది." నసిగాడు శ్రీరమణ.


రంగ వెంటనే అడిగాడు.. "పోనీ.. ఎంత కావాలో అడుగు."


శ్రీరమణని తన డబ్బు అవసరం.. ఆలోచినల్లో కుమ్మేస్తుంది.

రంగ తొందర చేపట్టాడు.

శ్రీరమణ తెములుకుంటూ.. తనకు ముట్ట చెప్పవలసింది చెప్పేసాడు.


రంగ ఒప్పేసుకున్నాడు.

శ్రీరమణ కారు ఎక్కగా..

రంగ అతడి పక్క సీటులో కూర్చున్నాడు. తన అరి కాళ్ల దగ్గర అవతారం ఇచ్చిన లెదర్ బేగ్ ను పెట్టుకున్నాడు.


"ఆ బేగ్ ను వెనుక సీటులో పెట్టుకో వచ్చు." చెప్పాడు శ్రీరమణ.

రంగ విన్నట్టు బయటికి చూస్తూ ఉండిపోయాడు.

శ్రీరమణ కారు స్టార్ట్ చేసాడు.

అప్పుడే.. అక్కడికి అబ్దుల్ వచ్చాడు కారులో.

శ్రీరమణని ఆపాడు.


"రమణ బాయ్. నీ కోసమే వచ్చా. లక్కీగా ఉన్నావు. ఈ రోజు కిరాయి బాగా కుదిరింది. ఆ డబ్బులు నీకు ఇవ్వాలని ఇలా వచ్చాను. నీ అప్పు ముందు తీర్చేయాలి." చెప్పాడు అబ్దుల్. శ్రీరమణకి కొన్ని నోట్లు ఇచ్చాడు.


"వీటితో ఆరు వందలు తీరింది." చెప్పాడు.


శ్రీరమణ ఆ నోట్లను జేబులో పెట్టుకున్నాడు.

శ్రీరమణ కారులోని రంగను చూస్తూ..

"కిరాయి ఎటు." అడిగాడు అబ్దుల్.


శ్రీరమణ చెప్పాడు.

"స్లో గా వెళ్లు బాయ్. అటు రోడ్డు అంతంతగా ఉంటుంది." చెప్పాడు అబ్దుల్.


'సరే' అన్నట్టు తలాడించేసి.. కారును స్టార్ట్ చేసాడు శ్రీరమణ.


***

రాత్రి పదిన్నర అవుతుంది.

పక్క మీద నడుము వాల్చింది సావిత్రి.

ఆమెకు దగ్గర గానే పడుకుంటుంది ఇంద్రజ.

ఇద్దరూ నేల మీద ఉన్నారు.

మంచం పక్క మీద చంద్రిక పడుకొని ఉంది.

"దేవుడు ఉన్నాడు. నా మొర ఆలకిస్తున్నాడు." అంది సావిత్రి.


"ఎక్కడ దేవుడమ్మా. మరి మనకు ఇన్ని అవస్థలు ఏమిటి." అంది ఇంద్రజ.


"లేదే. దేవుడు మన అవస్థలకు కరుగుతున్నాడే." ఇంద్రజ వైపుకు ఒత్తిగిలి అంది సావిత్రి.


ఆ వెంబడే..

"చూస్తున్నావుగా అక్కలో మార్పులు.. మొదటిలో భయమేసింది. రాను రాను తను తేరుకుంటుంది. ఇందాక చూసావుగా.. తులసమ్మ గారు చెప్పినట్టు అక్క నోట్లో నీటి చుక్కలు వేస్తే.. ఈ మధ్య లేనిది.. ఇందాక వాటిలోవి.. కొద్దిగా అక్క గుటకేసింది." అంటుంది సావిత్రి.


"అవునవును. అక్క తేరుకుంటుంది." సరదా అవుతుంది ఇంద్రజ.


ఆ వెంబడే..

"అన్నట్టు.. ఈ బోగట్టా రమణకి ఫోన్ చేసి చెప్పవా." అంది ఇంద్రజ.


"లేదు. బాగా రాత్రి ఐందిగా. రేపు చెప్పుతాను." చెప్పింది సావిత్రి.


"అతను బాగా ఆదుకుంటున్నాడు. అతను కాదంటే మరోలా ఉండేది." ఇంద్రజ అంది.

సావిత్రి ఏమీ అనలేదు.


***

అర్ధరాత్రి దాటింది.

శ్రీరమణ కారు నిమానమైన స్పీడ్ న ముందుకు పోతోంది.

రోడ్డు రమారమీగా ఖాళీగా ఉంది.


అడపాదడపాగా వెయికిల్స్.. శ్రీరమణ కారును ఓవర్ టేక్ చేస్తూ అటు ఇటు పోతున్నాయి.

రంగ కునుకుపాట్లు పడుతున్నాడే తప్పా.. ఇంచుమించుగా మెలుకువగానే ఉంటున్నాడు.

"టీ డబ్బా కనిపిస్తే ఆపు. టీ తాగుదాం." శ్రీరమణకు చెప్పాడు.


"సరే." అనేసాడు శ్రీరమణ.


అంతలోనే..

రంగ ఫోన్ మోగింది.

ఆ కాల్ కు కనెక్ట్ ఐ.. "చెప్పు సామీ." అన్నాడు.


"వెనుక్కు వెళ్లిపో." అటు నుండి అసామీ అరిచినట్టు చెప్పాడు.


"వెనుక్కు పోవాలా. అదేంటి." గందికవుతున్నాడు రంగ.


"ఎలాగో పోలీసులకు తెలిసి పోయింది. వాళ్లు పొలిమేరలో.. ఎలర్ట్ ఐ.. కాచుకున్నారు. కొంత మంది నువ్వు వస్తున్న వైపు వస్తున్నారు. ఎదురు వస్తున్న వెయికల్స్ ను చెక్ చేస్తుండ వచ్చు. ఫోఫో. వెనుక్కు ఫో." అటు అసామీ అరుస్తున్నాడు.


ఆ కాల్ కట్ చేసేసి..

శ్రీరమణతో.. "వెనుక్కు పోదాం. బండి తిప్పేసి." గబగబా చెప్పాడు రంగ.


"ఏం." అడుగుతున్నాడు శ్రీరమణ.


అప్పటికే రంగ ఫోన్ సంభాషణ విని ఉన్న అతడు.. సందేహంలో పడి ఉన్నాడు.

కారు పక్కకు తీసి ఆపాడు."ఆపకు. తిప్పేసి.. వెనుక్కు పద." కంగారవుతున్నాడు రంగ.

అతడి వాలకంతో.. మరింత సంశయంతో..

"దిగండి." అనేసాడు రంగనే చూస్తూ.


"దిగాలా. ఎందుకు. వెనుక్కు పద." అరిచాడు రంగ.

ఆ వెంబడే..

"తిరుగు ట్రిప్ కు డబ్బులు ఇస్తాలే." అన్నాడు.


"కుదరదు. దిగన్నా. ఏదో వ్యవహారం కానిదిలా ఉంది. ఆ బేగ్ లో ఏదో గుట్టు ఉంది. వెంటనే దిగిపో అన్నా." జల్దీ జల్దీగా చెప్పాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"నాకు రిస్క్ వద్దు. నాకే తల నొప్పి రానీయకు. దిగన్నా." మొండిగా చెప్పాడు శ్రీరమణ.


"ఇక్కడ.. ఇంత టైమప్పుడు.. దించేస్తే ఎలా. నీకు బాగా ముట్ట చెప్తా." మొరాయిస్తున్నాడు రంగ.


"ఎంతిచ్చినా నాకు వద్దు. ముందు దిగు అన్నా. నేను ఎంతంటే అంత ముందుగానే నాకు నువ్వు ఇచ్చేసినన్నప్పుడు.. ఇరకాటమైనా.. ఆ బేగ్ ను నీ కాళ్ల మధ్యనే పెట్టుకున్నప్పుడు.. ఏదో తేడా తోసింది." నసిగాడు శ్రీరమణ.


ఎంతకీ రంగ దిగక పోయేసరికి..

"దిగుతావా.. లేదా.. ముందుకే తీసుకుపోనా." చెప్పాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"నీతో వెనక్కు మాత్రం పోను." కఠినంగా చెప్పేసాడు.


రంగ విసురుగా కిందకి దిగిపోయాడు.. ఆ బేగ్ తో.

శ్రీరమణ కారు స్టార్ట్ చేసి.. రివర్స్ చేసి.. తిరిగి వచ్చిన దారిన కదిలిపోయాడు.

రంగ రోడ్డు వారన చేరి.. అటు ఇటు పట్టి పట్టి చూస్తూ నిల్చున్నాడు.

అతడు చిక్కని బెదురులో కొట్టుమిట్టాడు తున్నాడు.


శ్రీరమణ కారును ముందుకు పోనిస్తున్నాడే కానీ.. పరిపరి రకాలుగా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు.

'అతడ్ని దించేయడం సబబేనా..'

'నేను జంకుతో తప్పు చేసానా..'

ఇలా ప్రశ్నించుకుంటున్నాడు.


'అతడు ఆ పోలీసులకు దొరికి పోవాలి..'


'అతడి చేపట్టిన కాని పనికి గండి పడాలి..'


ఇలా కూడా అనుకున్నాడు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
103 views0 comments

Comments


bottom of page