top of page

ప్రేమ గంధం


'Prema Gandham' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ప్రేమ గంధం' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


భామ నిన్నే వలచి నాను

ప్రేమ గంధము తెచ్చి నాను

ఆమ నందూ కోయిలోలె

జామ నెక్కిన చిలుక వోలె

మామ చుట్టూ మేఘమోలె

లేమ నువ్వూ నేనూ కలసి పోలేమా


అని పాడుకుంటూ ఆడ పిల్లలు కనపడ్డ చోటల్లా తిరుగుతుంటాడు అశ్వత్థామ.


నిజమైన ప్రేమికుడు తానాకర్షించిన అమ్మాయిని తప్ప అన్యుల తెరువు పోడు అంటె అశ్వత్థామను ఒక పోకిరీ క్రింద జమ కట్టవలసిందే -


నేటి కాలములో ప్రేమ పిచ్చి పెరిగి ఎవరి చెంత ప్రేమ గంధమున్నదో ఎవరు దుర్మార్గులో బేరీజు వేసుకొన లేక పోతున్నారు అమ్మాయిలు.


అమ్మ కడుపులో బుట్టి, తోబుట్టువులతో పెరిగి, చిత్త చాంచల్యపు కారణంగా ప్రేమ దోమ అని తిరగడము స్త్రీ జాతి మీద గౌరవము మరియాద లేక పోవడము శోచనీయము- కొంత మంది యువకులు సంఘ మరియాద మరచి నేను మగవాన్ని, నాకేదో కిరీటమున్నదని తనకుతానే ప్రమాణ పత్రమిచ్చుకొని సంఘములో చీడపురుగులయితున్నారు.

ఇక కొందరు తలిదండ్రులే తమకు మగ పిల్లవాడు పుట్టినాడు అంటే ఆ నాటినుండే నిధిని లెక్కించుకునే ధోరణితొ ఉంటారు. ఇక ఆడ పిల్ల కలుగగానే తమ బ్రతుకు అధోగతే అను ఆలోచనతో ఉంటారు కొందరు. ఇటువంటి బలహీనతలే అశ్వత్థామ వంటి వారికి వరమయ్యింది.

అసలు ఆడది అంటె అంత అలుసెందుకో సభ్య సమాజానికి ద్యోతకము కాని పరిస్థితి.


గులాబి అందమైన సుగంధమీనే పుష్ప జాతి- దాన్ని అందరూ ఆకర్షించుతారు అని భగవంతుడు దానికి రక్షణ కవచములా ముళ్ళను సృష్టించాడు కాబోలు.


ఇక అసలు కథలోకొస్తె అశ్వత్థామ వివేక్ వినోదినిల ఏకైక ముద్దుల కొడుకు. ఆస్తి పాస్తులకు లోటు లేదు ఏదో బీ ఏ వరకు చదువు సాగించి దారులెంట తిరుగుడే వ్యాపకముగా పెట్టుకున్నాడు. తండ్రి పేరుకు మాత్రమే వివేక్ కాని ఈ అవివేక పుత్రుడిని పట్టించుకోడు-- అశ్వత్థామ తాను చెడిపోతూ పదుగురికి మార్గదర్శి కావడము వినా సమాజానికి అక్కరొచ్చే ఏపనీ చేయబోడు.


పోకిరీ వేషాలేసి రెండు పర్యాయాలు శ్రీకృష్ణ జన్మస్థాన దర్శనము చేసుకున్నా వక్ర మార్గమే కాని సక్రమ మార్గమంటె ఏమిటొ తెలియదు.


ఇటువంటి వాళ్ళను సక్రమ మార్గములోకి తేవడానికి కంకణము కట్టుకున్నాడు పార్థసారథి. రమారమి అశ్వత్థామది -పార్థ సారథిది సమ వయసే కాని బుద్ధి కలిగి చదువులో రాణించుచు మంచివాడను పేరు తెచ్చుకున్నాడు. తల్లి శాంతి తండ్రి ప్రదీప్ ల పెద్ద కొడుకై తమ్ముల, చెల్లెళ్ళ తో ప్రేమతో ఉంటూ వాళ్ళ మంచి నడతకు మార్గదర్శకుడైనాడు.


చీకటి వెలుగులు పక్క పక్కనే ఉన్నట్టు అశ్వత్థామ పార్థసారథి ఇంటి ప్రక్కకే ఉండడము విశేషము. పార్థసారథి వాళ్ళ తలిదండ్రులు బీదవాళ్ళు కాకున్నా ఆస్తిపరులు మాత్రము కారు.


పార్థసారథి ఆకతాయి వేషాలకు దూరంగా ఉంటాడు.

వరిపొలము దగ్గర ఒక్క కొంగను బంధిస్తె అన్ని కొంగలు రాకుండా పోతాయి అను సామెతలా పార్థసారథి అశ్వత్థామను దారికి తెచ్చే పనిలో నిమగ్నమై అతని సావాసము కారణంగా తక్కిన వారు చెడకుండా చూస్తుంటాడు.


కంటకం కంటకేన నిష్కంటకం అను సామెత తెలిసినవాడై పార్థసారథి ముందుగా అశ్వత్థామతొ స్నేహము చేస్తాడు-కాని అశ్వత్థామ చేసే దుష్కృత్యాలు చేయకుండా సున్నితంగా వారిస్తాడు. పార్థసారథి తనకు తోడుగ నలుగురు స్నేహితుల జతచేసుకొని అశ్వత్థామ దుష్ప్రవర్తన బలహీన పరుస్తుంటారు. అశ్వత్థామ అందరిలో ఒంటరివాడై కొంత మందాక్షహీనము తగ్గించుకుంటాడు.


క్రమ క్రమంగా జూలాయి తిరుగుడు మానుతూ తనకు వచ్చిన చెడ్డ పేరు పోగొట్టుకునే ప్రయత్నము చేస్తుంటాడు అశ్వత్థామ. అందులో భాగంగా ఆడపిల్లల తెరువు పోకపోవడము, అంధులకు, అంగవైకల్యులకు, బీదలకు సాయపడడము చేస్తుంటాడు. చెడు తిరుగుడు తిరిగి యోగిగా మారిన వేమనలాగ పార్థసారథి స్నేహము వలన ఒకనాటికి దారికి వస్తాడు అశ్వత్థామ.

పార్థసారథి స్నేహ ఫలము

పామర గంధం పట్టు నింక

స్నేహ గంధం చెడిపి వేసె

అలము కొన్న అంధకారం

ఆదిత్యుని వెలుగు చేత

అంతమై పోయినట్టు


వక్రమార్గం వదలుకొంటి

సక్రమార్గం సాగుచుంటి

ప్రేమ గంధం పాట లింక

భామ ముందర పాడబోను

ఆడదంటే అమ్మ అక్కని

మరువ నెప్పుడు మనసులోన.


అని పాడుకుంటాడు అశ్వత్థామ.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



34 views0 comments
bottom of page