top of page

చీర కట్టండి - గిఫ్ట్ పట్టండి


'Cheera Kattandi Gift Pattandi' - New Telugu Story Written By Penumaka Vasantha

'చీర కట్టండి - గిఫ్ట్ పట్టండి' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

"రేపు శ్రావణ శుక్రవారం కాస్త పట్టుచీర కట్టుకుని కనిపించవే తల్లీ. ఏమి అమెరికాలో.. ఉండటమేమో కానీ! పాంట్ షర్టులు, డ్రెస్సులు, వీటితో నిన్ను చూడలేక పోతున్నా. ఆఫీస్ కి చీర కట్టుకోకూడదు. అది తెలుసు కానీ, పెందలాడే లేచి పూజ చేసుకునే టైంలో నైనా చీర కట్టుకో. పాంట్, షర్ట్ లేక నైటీతో పూజ చేస్తే అమ్మవారు పురుషులకు వరాలు ఇవ్వననీ! వచ్చినదారినే వెళ్ళిపోతుంది" అని అమ్మ ఫోన్లో ఎన్నో సార్లు చెప్పింది. 'రేపు వర్క్ ఫ్రం హోమ్ చేసి ఏడాదికి ఒకసారి వచ్చే పూజ కాస్త శ్రద్ధగా.. చేసుకోవాలి' అనుకుంటూ కారు దిగి ఇంట్లో కి నడిచింది. మహిత.

రాత్రి, పూట అలకరించుకున్న అమ్మవారిని చక్కగా, వెండి చెంబులో, కూర్చోపెట్టి, వెనక డ్రాపింగ్స్ వేలాడదీసి, ముందు, బియ్యపు పిండితో మెలికల ముగ్గులేసి తృప్తిగా చూసుకుంది. కుందులు కడిగి, అన్నీ సర్ది టైం చూస్తే ఒకటి అయింది, అమ్మో! మూడింటికి లేవాలని, ఫోన్లో అలారం పెట్టుకుని పడుకుంది. మూడింటికి, లేచి, నైవేద్యాలు చేసి, ఆరు గంటలకే పూజచేసుకుంది మహిత. అమ్మవారిని, ఫోటో తీసి, ఆంధ్ర తెలుగు సభలో, షేర్ చేసింది.


పట్టుచీర, మెళ్లో హారం, తల్లో పూలు అన్నిటితో నిండుగా ఉన్న తనను ఒక సెల్ఫీ తీసుకుని అత్తగారి గ్రూపులో, అమ్మ గ్రూపులో షేర్ చేసింది.


భర్త శ్రీధర్ ను, పిల్లలను లేపింది. శ్రీధర్ పట్టుచీర తో ఉన్న మహితని చూసి కళ్లు నలుపుకుని మరీ చూసాడు. 'మహితే! అమ్మ వారు కల్లోకి రాలేదు, సాక్షాతూ నా భార్యనే. ' "ఏంటే నువ్వేనా సూపర్" చెయ్యి చూపిస్తూ అన్నాడు శ్రీధర్.


పిల్లలైతే మహితను గుర్తు పట్టలేదు. రోజు పాంట్, షర్ట్, డ్రెస్ లో చూడటం వల్ల, గుర్తు పట్టక "డాడీ.. "అని భయం గా శ్రీధర్ పక్కకు చేరారు.


" మీ మామినే.. అని మహితను పరిచయం చేశాడు. పాపం పిల్లలు నిన్ను చూసి అమ్మోరు తల్లీ! అనుకుంటున్నారు. కాస్త వీకెండ్స్ లో అయినా చీర కట్టుకోవచ్చుగా" అన్నాడు శ్రీదర్.


శ్రీధర్ భరోసాతో అపుడు పిల్లలు "మా అమ్మే ! ఈవిడ" అని మహిత దగ్గరకు చేరారు. ఇంతలో సెల్ మోగుతుంటే తీసి" హాల్లో" అంది మహిత.


అటునుండి "ఎంత బావున్నావే.. తల్లీ! నా దిష్టే తగిలేను" అంటూ మహిత అమ్మ వసంత ఫోన్లో మహితకు దిష్టి తీసింది.


ఈవెనింగ్, తన ఇంటికి, పార్సెల్ లో మంచి పట్టుచీర వచ్చింది. దాని కింద కంగ్రాట్స్ మిసెస్ మహిత. మన గ్రూప్, లో అందరూ చీరలు కట్టుకుని తీసిన ఫొటోస్ ను, వాళ్ల పేర్లను, రాసి లక్కి డీప్ తీస్తే, నీ పేరు వచ్చింది. ముందుగా పూజ చేసి ఫోటో షేర్ చేసి నందుకు, ఒక లక్ష్మి రూప్ కూడా వచ్చింది, అదనంగా. ఎపుడూ పూజ చేసి షేర్ చేసిన తనకు, చీర రాలేదు. ఈసారి రావటంతో ఎంతో హాపీగా ఫీలయ్యి మహిత వసంత కు కాల్ చేసి "అమ్మా!, నేను, ఈ యేడు పట్టుచీర కొనుక్కొలేదని బాధ పడ్డానా, !లక్కి డీప్లో చీర గెల్చుకున్నాను అంది.


"మనం ఏ పనైనా, కష్టం+ ఇష్టం+ శ్రద్దతో చేస్తే, అంతే ఫలితాన్ని పొందుతారు. లక్ష్మి దేవి, నీ పూజకు మెచ్చి, ఇచ్చిందే. ఆ చీర వచ్చే వారం అమ్మవారికి పెట్టీ ఆ తర్వాత నువ్వు కట్టుకో" అని మహిత, అమ్మ, వీడియో కాల్ లో చీర చూసి అంది.


“అమ్మా! మళ్ళీ సూక్తులు మొదలెట్టావా! ఈసారి నేను, ఇండియా వస్తే ఒక పెద్ద ఆటో కొనిస్తా, దాని వెనుక రాసుకోమ్మా.. ! ఇవన్నీ ప్లీజ్" అంది, మహిత.


వెనుక పిల్లలు అమ్మ ఆటో కొంటుంది, అని తెగ నవ్వుతుంటే, మహిత, వసంత, వాళ్ల నవ్వుల్లో శ్రుతి కలిపారు.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
31 views0 comments

Comments


bottom of page