top of page

నాన్నకు ప్రేమతో


'Nannaku Prematho' New Telugu Story Written By Pitta Gopi

'నాన్నకు ప్రేమతో' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)శంకర్ ఏడేళ్లు ఉన్నప్పుడే తండ్రి వెంకయ్య తమ సొంత పనులు చేయడానికి తీసుకెళ్తూ ఉండేవాడు.


ఊరిలో ఏ ఒక్కరు కూడా పిల్లలకు పనులు చెప్పేవారు కాదు.

పిల్లలు అందరూ ఆడుకుంటుంటే శంకర్ కి పిల్లల తో ఆడుకోవాలని ఉండేది. కానీ.. బడి లేనప్పుడు తండ్రి ఏదో ఒక పనిలో నిమగ్నం చేయిస్తూ కాలం గడిపేవాడు.


శంకర్ కాస్త పెద్దవాడు అయినా.. అదే తంతు కొనసాగించేవాడు.


అందువలన శంకర్ - వెంకయ్య లకు ఒక్కోసారి గొడవలు కూడా జరిగేవి.


పక్కవాళ్ళు కలుగజేసుకుని, "పిల్లలు ఏ వయస్సు లో ఎలా గడపాలో అలా గడపనీ. అప్పుడే బాధ్యత అంటూ నెత్తిన పెడితే వాడే కాదు, ఎవరైనా అలాగే తిరగబడతారు" అనే వాళ్ళు.


"మీ పిల్లలను మీరు అలా పెంచుకోండి. నా కొడుకును నాకిష్టం వచ్చినట్లు పెంచుతా" అన్నాడు.


ఎందుకంటే తండ్రి గా తాను పడిన కష్టం ఒక్కగానొక్క కొడుకు పడకూడదని ఆ పిచ్చి తండ్రి భిన్నమైన ఆలోచన కొడుకు కు కానీ, సమాజానికి కానీ అర్థం కాలేదు.


శంకర్ కి ఒక వయస్సు వచ్చాక ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రయత్నం చేస్తునే ఉన్నాడు.


తండ్రి కష్టం కళ్లారా చూసిన వాడు కదా..

అందుకే ఏమో.. కూలి కి వెళ్తూ.. తన అవసరాలు తానే తీర్చుకుని అప్పుడే తండ్రి పై భారాన్ని తగ్గించాడు.


అలా పని చేస్తూ ఉద్యోగానికి ప్రయత్నం చేయటం వలన శరీరదారుఢ్యం కూడా చక్కబడింది.


తన తోటి వారి అందరి కంటే శంకర్ కి సమాజంలో విలువ పెరిగింది. శంకర్ తో పోలుస్తూ తమ పిల్లలను తిట్టుకునేలా శంకర్ ఎదిగాడు.


గతంలో తాను తండ్రిని తిట్టిన జ్ఞాపకాలతో బాధ పడేవాడు. అలాగే తాను ఈ రోజు ఏ పని అయినా చేయగలిగే స్థాయిలో ఉండటం, మంచి పని తీరు, క్రమశిక్షణ, పనిలో సమయపాలన, తదితర విషయాలను అర్థం చేసుకున్నాడు.


అందుకే తండ్రి పై తనకు ప్రేమ పెరగటం, తన కష్టం కూడా అర్థం చేసుకోవటం మొదలెట్టాడు.


కానీ ఈ విషయాలు ఏమీ తండ్రికి చెప్పలేదు. డైరీలో మాత్రం తండ్రి గూర్చి తాను నేర్పిన గొప్ప పాఠాలు గూర్చి తన పై తండ్రికి ఉన్న ప్రేమ గూర్చి వ్రాసుకున్నాడు.


చదువు, సంస్కారం, శరీరదారుఢ్యం ఉన్న శంకర్ ప్రభుత్వ ఉద్యోగం పొందలేక పోయాడు.


దీంతో తండ్రిని కష్టం నుండి తప్పించి ఆదుకోవాలనే తన ఆశయం నెరవేర లేదు.


అయినా ఏదో ఆశ. వయసు ఎక్కువ అవుతుంది. కూలి పనులు, ఉద్యోగ ప్రయత్నం, విఫలం.. ఇదే శంకర్ కాలచక్రం.


పని మీద శ్రద్ధ, క్రమశిక్షణ కల్గిన శంకర్..

స్నేహితుడి సూచన మెరకు ఒక చిన్న ప్రవేటు కంపెనీ ఉద్యోగానికి అర్హత పొందాడు.


అలా తాను సెటిల్ అయి, తండ్రి మనసు ప్రశాంత పరిచాను అనుకున్నాడు. తన సంపాదనతో తండ్రికి సహయడుతు వచ్చాడు.


వివాహం చేసుకున్నాడు. కాలం గడిచింది. ప్రైవేట్ ఉద్యోగం తృప్తి ఇవ్వటం లేదు. జీతం పెరగక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. దీనికి తోడు కరోనా లాంటి పెద్ద విపత్తు రాగా అన్ని పరిశ్రమలు మూసుకుపోయాయి.


చిన్నప్పటి నుండి కష్టం తెలిసిన తన బతుకే ఇలా ఉంటే తన తోటి వారి బతుకు చెప్పాల్సిన అవసరం లేదు కదా..


ఆలోచిస్తే..


తన తండ్రి తనకు నేర్పినది పని కాదు జీవిత పాఠం అని,

అలాగే జరగబోయేది తన తండ్రికి ఎంతో బాగా తెలుసు కాబట్టే.. తనకు కష్టం ఏంటో తెలియాలని ‘ఉద్యోగమే కాదు కష్టపడితే కానీ.. జీవితం గడవ’దని గొప్ప పాఠం నేర్పాడు.


కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎంతటి వాడైనా.. పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే రోజులు వస్తాయి. ఆ రోజులకు సిద్దం గా ఉండాలంటే.. ముందు కష్టం ఏంటో కష్టపడటం ఎలాగో నేర్చుకుని ఉండాలని తండ్రి నేర్పిన పాఠంలో ఒకటి.


భార్యతో సొంత ఊరు వచ్చి పరిశ్రమలు తెరిచే వరకు తండ్రితో కలిసి పొలం పనులకు శ్రీకారం చుట్టాడు శంకర్. అలా తన ఆలోచనలతో వ్యవసాయంలో కొత్త వరవడికి బీజం వేసి విజయం సాధించాడు.


జీవితం అంటే ఏదో ఒక పని నేర్చుకోవటం కాదు. మరణించే వరకు ఏదో ఒకటి నేర్చుకోవాలని తన తండ్రే తనకు చెప్పాడని, వెంకయ్య కు విశ్రాంతి ఇచ్చి, తన చిన్నపిల్లలతో సమానంగా వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చూసుకుంటూ నూతన వ్యవసాయం కొనసాగించాడు శంకర్.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

40 views0 comments

Comments


bottom of page