top of page

నాన్నకు ప్రేమతో.. 'Nannaku Prematho' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 20/12/2023

'నాన్నకు ప్రేమతో' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఇల్లంతా తోరణాలతో అలకరించారు. మొత్తం రెండు అంతస్తుల ఇంటిని పూలతో చక్కగా అలంకరించారు. చూడడానికి ఒక పండుగ వాతావరణమే అంతా!


పక్కింటి సుబ్బారావు మనసు ఉండబట్టలేక.. ఇంటి బయట నిల్చున్న అనిల్ ను పలకరించాడు.. 


"బాబు అనిల్! ఇల్లంతా సందడిగా ఉంది.. ఏమిటో విశేషం.. ఈ రోజు పండుగ కుడా కాదు.. "


"మాకు పండుగే అంకుల్! మా నాన్న సంతోషం కోసం.. నేను, నా తమ్ముడు సునీల్ చేసే పండుగ"


“మీ అమ్మ పోయిన తర్వాత.. ఇప్పుడే ఇంత సందడి చూస్తున్నాను మీ ఇంట్లో..” ఏం అర్ధం కానట్టు ముఖం పెట్టాడు సుబ్బారావు. 


“అలా కూర్చోండి అంకుల్.. అందరకీ అర్ధమయ్యే విధంగా చెబుతాను.. 


మా నాన్న తన మొత్తం జీవితాన్ని నా కోసం, నా తమ్ముడు కోసమే జీవించారు. అమ్మ పోయిన తర్వాత రెండో పెళ్ళి కుడా చేసుకోకుండా.. ఎప్పుడు మాకు ఏమిటి కావాలో మేము అడిగే లోపే.. అందించేవారు. అలాగే మాకు ఇరవై ఏళ్ళు దాటేసాయి. ఇప్పుడైనా.. మా నాన్నకు ఒక తోడు ఇద్దాం అనుకున్నాము. అందుకే, పెళ్ళి చెయ్యాలని డిసైడ్ చేసాము”. 


"నాన్న కు పెళ్ళా.. ?"


"ఎందుకు అంత ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే రెండో పెళ్ళి చేసుకుంటున్నారు.. కానీ మేము మాత్రం మా నాన్న మనసు తెలుసుకుని, ప్రేమతో పెళ్ళి చేస్తున్నాము.. "


"బాగుంది అనిల్! బంధువులని పిలవలేదా?"


"సింపుల్ గా చేస్తున్నాము అంకుల్.. దగ్గర వాళ్ళు మాత్రమే వస్తారు.. "


"పెళ్ళయ్యాక.. ఆ ఫొటోస్ కాస్త షేర్ చెయ్యి.. "


"సరే అంకుల్!"


"మా ఆవిడ పిలుస్తున్నట్టుంది... నేను వెళ్ళాలి.. "

***


"ఒరేయ్ అనిల్! ఎక్కడ ఉన్నావు రా?"


"నాన్నా! మీరెందుకు వచ్చారు బయటకు.. పదండి లోపలికి"


"నీతో మాట్లాడాలి రా.. తమ్ముడిని కుడా పిలువు.. ! నాకు పెళ్ళి అన్నారు.. ఎవరితోనో చెప్పలేదు.. "


"మీకు చాలా ఇష్టమైన అమ్మాయితోనే నాన్న!.. "


"నాకు ఇష్టమైన అమ్మాయి ఎవరో నీకు ఎలా తెలుసు సునీల్?"


“మీ డైరీ చదివాను నాన్న.. దానికి మీకు కోపం వస్తుందేమో గానీ.. మాకు మాత్రం చాలా విషయాలు తెలిసాయి.. 


మిమల్ని అడగకుండా.. తాతయ్య మీకు పెళ్ళి ఫిక్స్ చేసి పెళ్ళి చేసారు. అప్పట్లో మీ నాన్న మీద గౌరవంతో మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు. అంతా మన మంచికే అని మీరు అనుకున్నా.. పెళ్ళి కూతురు మాత్రం అందుకు భిన్నంగా ఉందని మీరు గమనించారు. పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ సరదాలు.. జీవితాంతం మీతో లేవని మీ డైరీ లో రాసారు. చీటికి మాటికి అమ్మ మీతో గొడవ పడేదని.. ఇష్టం లేకపోయినా, అమ్మ ఏది చెబితే అది చెయ్యాల్సి వచ్చిందని రాసారు. ఇష్టం లేకపోయినా మా కోసం మీరు అన్నీ భరించారు. మాకు ఏది కావాలంటే, అది ఇచ్చి మమల్ని బాగా చదివించారు నాన్నా!


అమ్మ మొండితనం తో తన ఒంట్లో పెరుగుతున్న అనారోగ్యం గురించి ఎన్ని సార్లు మీరు చెప్పినా ఆమె వినలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తానంటే రాలేదని రాసారు. మీరు చాలా బాధ పడ్డారనీ చదివాను. 


చాలా రోజుల తర్వాత జబ్బు ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళింది అమ్మ. అప్పటికే క్యాన్సర్ ఫైనల్ స్టేజి అని తెలిసింది. మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు.. కాని ఫలితం లేదు. ముందే, అమ్మ మీ మాట విని ఉంటే బాగుండేదని బాధ పడ్డారు. అప్పుడు మిమల్ని ఓదార్చడానికి కుడా ఎవరూ లేరు. ఇప్పుడు మేము ఉన్నాము నాన్నా! మీరు ఎంత బాధ పడ్డారో మాకు తెలుసు. మీ అక్షరాలే మీ మనసులో బాధ ను తెలిపాయి. నిన్ను అర్ధం చేసుకోలేకపోవడం అమ్మ దురదృష్టం. అప్పటినుంచి అన్నీ మీరే అయి మాకు ఏ లోటు లేకుండా పెంచారు”. 


"అప్పట్లో మీ అమ్మ నా మాట విని ఉంటే, మీరు అమ్మ ప్రేమకు దూరమయ్యే వారు కాదు రా!"


“ఊరుకోండి నాన్నా! ఇప్పుడు మాకు ఊహ ఉంది. మీకు పెద్ద వయసేమి అవలేదు.. మీరు ఆనందంగా ఉండడమే మాకు కావాలి.. మీరు మీ డైరీ ఆఖరి పేజీ లో రాసిన అక్షరాలు మేము నిజం చెయ్యబోతున్నాం నాన్న! మీరు కాదనరన్న నమ్మకం తో ఈ ఏర్పాట్లు కుడా చేసాము. ‘ఆ రోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసావు ప్రేమా! రెండు రోజుల్లో చెబుతానని నేను అన్నాను. ఈలోపు మా ఊరిలో నా పెళ్ళి ఫిక్స్ చేసారు మా నాన్న. రెప్ప పాటులో పెళ్ళి కుడా జరిగిపోయింది. నీకు నా ప్రేమ ను తెలిపే లోపే నా పెళ్ళి అయిపోయింది ప్రేమా! వచ్చే జన్మలో, నీ కోసం పుడతాను.. నన్ను క్షమించు ప్రేమా!’ అని రాసిన మీ మాటలు చదివిన నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాన్నా! మీ ఈ కోరిక మేము ఈ జన్మలోనే నిజం చేస్తాము. మీ ఈ అక్షరాలు మీ ప్రేమ కు పంపించాము.. మా అదృష్టం కొద్ది ఆవిడ పెళ్ళికి ఒప్పుకున్నారు..” 


"తండ్రి మనసులో బాధను అర్ధం చేసుకుని, వదిలేసిన నా ప్రేమను గెలిపించాలన్న మీ కోరిక.. నన్ను ఆనందంగా ఉంచాలన్న మీ తపన ముందు నేను ఓడిపోయాను రా పిల్లలు.. "


“అదిగోండి నాన్న! పెళ్ళి కూతురు వచ్చింది..”

*** 


"ఎలా ఉన్నావు ఆనంద్.. ?"


"బాగానే ఉన్నాను ప్రేమ.. నువ్వు ఎలా ఉన్నావు?"


"అప్పటి నుంచి అలానే ఉన్నాను.. పెళ్ళి కుడా చేసుకోవాలనిపించలేదు.. "


"ఎందుకో?"


"నీకు తెలియదా ఆనంద్.. నా మీద ఇంత ప్రేమ ఉందా నీకు ఆనంద్? ఇప్పటికైనా, నన్నుపెళ్ళి చేసుకుంటావా?"


"అది నా అదృష్టం.. "


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ
65 views0 comments
bottom of page