నవ్వుకు రాజీనామా
- Bhallamudi Nagaraju

- 4 days ago
- 1 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #నవ్వుకురాజీనామా, #NavvukuRajeenama, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems,

Navvuku Rajeenama - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 25/11/2025
నవ్వుకు రాజీనామా - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
అమ్మా!
నాన్న ప్రేమను ఎరుగను
నీ ఒడినే బడిగా చేసి ఒరవడి నేర్పావు
ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించి
రెసిడెన్స్ బడిలో చేర్చావు
ఇరుకు గదులు ..హింసించే మాటలు
నిద్ర లేని రాత్రులు ..నన్ను కలవర పెడుతున్నాయి
నువ్వు చెప్పే కథలు
ఊసులు వింటూ కిలకిల నవ్వే నేను
నవ్వుకు రాజీనామా చేసేసాను !
బతుకు బాటలు వేయలేననిపించి
తనువు చాలించాలను కున్నా
సమస్యలను బూతద్దంలో చూసి భయపడ వద్దని
పరిష్కారం అన్వేషంచమని నాడు
నువ్వు చెప్పిన మాటలు
నన్ను నీ నుంచి దూరం చేయలేక పోయాయి .
నువ్వు నేర్పిన బుద్దులు .. సుద్దులు ..స్ఫూర్తి కథనాలు
నన్ను మేల్కొలిపాయమ్మా
సమస్యకు చావే పరిష్కారం కాదని తెలుసుకున్నా
ఆశయ సిద్ధికి అడుగులు వేస్తున్నా!
..భళ్లమూడి నాగరాజు
రాయగడ.




Comments