నీ ప్రేమ మధురం – మనోహరం
- Pulletikurthi Nagesh

- 3 days ago
- 2 min read
#NeePremaMadhuramManoharam, #నీప్రేమమధురంమనోహరం, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Nee Prema Madhuram Manoharam - New Telugu Poem Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 19/11/2025
నీ ప్రేమ మధురం – మనోహరం - తెలుగు కవిత
రచన: పుల్లేటికుర్తి నగేష్
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
పదాలు, ప్రబంధాలు … కవితలు, కల్పనలూ చెప్పకపోయినా...
అష్టపదులు, అభంగాలూ ... నైషిధాలు, ప్రేమకావ్యాలు రాయపోయినా...
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
చప్పుడు చేయని నీ కిట కిట తలుపులు టప టప కొట్టినప్పుడు
గుబ గుబ లాడే నా గుండెల చప్పుడు నీకు వినిపించలేక పోయినా
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే
నీ రాకని చెప్పే పట్టీలు, మరులుగొల్పి మత్తెక్కించే నీ అత్తరులు,
చూపు మరల్చనీయని నీ ముఖారవిందం -- చూస్తే దొరికిపోతాననే భయం.. అయినా ...
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
సవ్వడి మరచిన చిరు గజ్జెలు నీ ముంగురులు, చిలిపి నవ్వులతో సొట్టలుపడే ఆ బుగ్గలు
సవరించాలని, నిమరాలని వురికే కోరికలతో తత్తర పడుతూ చెప్పలేక తడబడినా
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
తక్కువ రాసి ఎక్కువ చింపే ప్రేమలేఖలతో .. అక్షరీకరించలేని ఆలోచనలతో
సందిగ్ధంతో సతమత మవుతూ.. చెప్ప రాక, చెప్పలేక నేపోయినా సరే
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
నీ రూపం నా జీవనాధారంగా మారిపోతుందేమో అనే భయం వేస్తుంది
నీ ధ్యానం మానితే నేను శూన్యం అయిపోతానేనమో అని భయం పట్టుకుంది.. అయినా
నీ ప్రేమ నాకెప్పుడూ మధురమే!!! ...... నీ ఊహ నాకెప్పుటికీ మనోహరమే!!!
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం




Comments