నీకేం తెలుసులే
- Yamini Rajasekhar

- Dec 22, 2025
- 4 min read
#YaminiRajasekhar, #NeekemTelusule, #నీకేంతెలుసులే, #యామినిరాజశేఖర్, #TeluguStories, #తెలుగుకథలు

Neekem Telusule - New Telugu Story Written By Yamini Rajasekhar
Published In manatelugukathalu.com On 22/12/2025
నీకేం తెలుసులే - తెలుగు కథ
రచన: యామిని రాజశేఖర్
ఏమిటో ఈ మనిషికి ఎంత చెప్పినా తన దారి తనదే. ఏ మాట పట్టించుకోడు. కాస్త ఆరోగ్యం చూసుకోమంటే, నాకు ఆరోగ్యం ఏముందిలే… మీరే కదా నా ఆరోగ్యం. మీరు బాగుంటే నేను బాగుంటాను అని భార్యని, పిల్లల్ని ఎప్పుడు చూడు, వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ అన్నిటికీ సర్దుకుపోతాడు రాజశేఖరం..
కానీ ఈ మనిషి చేసేదంతా చేసి, అందరి దగ్గర కోపగ్రస్తుడు అనే బిరుదులు కూడా పొందాడు. చెప్తానే ఉంటా—ఏదైనా నచ్చకపోతే వదిలేయ్, పట్టించుకోబాక, కోపాన్ని తెచ్చుకోక. చేసిన పని ఎంతైనా, ఇతరులకి ఏ రూపంలో అయినా నువ్వు సాయం చేసినా, అది బూడిదలో పోసిన పన్నీరు అని చెప్పిన నాపై ఎగురుతూనే ఉంటాడు. అది మనసులో కాస్తంత బాధతో అభిలాష బాధపడుతూ ఉంటుంది..
అంతేనా… ఎంత ప్రేమ అభిలాషంటే, కానీ చెప్పుకోడు. ఎంతసేపు నీకేం తెలుసులే అంటూ ఉంటాడు. అభిలాషకి చాలా బాగా అనిపిస్తుంది. నీకేం తెలుసు అంటే ఇంక ఎప్పుడు తెలుసుకోవాలి? కాస్త ఏదైనా మాట్లాడితే నీకు తెలియదులే అంటాడు. అప్పుడు మాత్రం చిర్రెత్తుకొని వస్తుంది.
ఇంతలో నవీన్—“అమ్మ… అమ్మ… నా పెన్ను, పుస్తకాలు సర్దావా?” అని అడుగుతాడు. కొడుకు ఒక్క మాట అడగగానే కరిగిపోతుంది అభిలాష. మరోవైపు కూతురు జాబ్ చేస్తూ ఉంటుంది. నేనే చేసుకున్నాను కదా… వాడికి మాత్రం ఎందుకు అట్లాగా అన్నీ అమరుస్తావు? ఎప్పుడు తెలుసుకుంటాడు? అని అడుగుతుంది కూతురు లాక్షణి..
“అక్క… నీకు ఏమి చేయలేదా చిన్నప్పుడు? అన్నీ చేశారులే నీకెలా తెలుస్తుంది! నిన్ను అలానే చూసుకున్నారు అమ్మానాన్న. అది నీకు తెలియదు కదా! ఇప్పుడంటే మాధ్యమాలు వచ్చాయి. అప్పుడు ఏమున్నాయి? ఫోటోలు తీయడమే కదా! నీ ఫోటోలు చూడు, ఎలా ఎత్తుకున్నారు… అది చాలదా?” అని అంటాడు తమ్ముడు.
ఇంతలో క్యాబ్ వస్తుంది. “సరే అమ్మా… ఆఫీస్ టైం అవుతుంది. మీ అమ్మ-కొడుకుల మాటలు మీరు పంచుకోండి. ఇక్కడ కూర్చుంటే నాకు మళ్లీ రాత్రంతా అక్కడే కూర్చొని పని చేయాలి,” అని వడివడిగా క్యాబ్ ఎక్కి వెళ్లిపోతుంది లాక్షణి..
అలా కూతుర్ని చూస్తూ రాజశేఖర్ ఎంతో మురిసిపోతాడు. ఏ రోజు ఏదీ అడగలేదు. తన బాధ్యతగా చదువుకుంది. చదువుకు మాత్రం చాలు నాన్న అనింది. ఇక పెళ్లి బాధ్యత ఉంది. అది ఒక్కటే నా కోరిక. అది ఈ లోపల చేస్తా.
“కాలేజీ టైం అయిపోతుంది,” అని నవీన్ అనగా, “నీ మాట బాగానే వింటాడు నీ కొడుకు,” అని రాజశేఖర్ అన్న మాటకి, “ఎవరి మాట అయితే ఏముందండి… చెప్పిన మాట విని వాళ్లు పనులు చేసుకుంటున్నారు కదా. పదండి, ఇద్దరం టిఫిన్ చేస్తాం. నాకు కూడా స్నేహితుల దగ్గరికి వెళ్లాల్సిన పనుంది. మీరు కూడా ఆఫీస్‌కి వెళ్లాలి కదా! ఎంతసేపు అలా కూర్చొని చూసుకుంటూ ఉంటారు?” ఇద్దరూ ఆరోజు అల్పాహారాన్ని మాటలతో ముగిస్తారు..
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రాజశేఖర్ కాస్త నలతగా ఉండడం గమనించిన అభిలాష— “ఏంటండీ అలా ఉన్నారు? పదండి, వైద్యశాలకు వెళ్దాం,” అని అంటుంది.
“అయ్యో… నాకేం కాదులేవే. ఇరవై నాలుగు గంటలు అలా వైద్యశాలంటే నాకు విసుగ్గా ఉంటుంది. వచ్చేసారా పిల్లలు?” “ఎప్పుడో వచ్చారండి. ఏదో పని చేసుకుంటూ… ఎవరిదో ఫ్రెండ్ వస్తే తన గదిలో ఉన్నాడు. నవీన్ మాట్లాడుతున్నాడు,” అంటూ కాఫీ అందిస్తుంది అభిలాష..
మాట్లాడుతుంటే ఒక్కసారిగా పడిపోతాడు రాజశేఖర్. పెద్దగా అరుస్తుంది అభిలాష. గబగబా అంబులెన్సును బుక్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్తారు. అప్పటికే గుండెపోటు వచ్చి స్తబ్దుగా ఉంటాడు రాజశేఖర్. అది తెలియకపోవడంతో, పడిపోయిన వెంటనే తీసుకురావడంతో డాక్టర్— “ఏమీ కాదమ్మా… కాకపోతే సర్జరీ చేయాలి,” అంటాడు.
దాన్ని చూస్తూ పిల్లలు ఇద్దరూ— “ఎంతసేపు నాన్న మన కోసం ఇలాగే శ్రమిస్తూనే ఉన్నాడు. వద్దు నాన్న అంటే వినడు. ఏం కావాలో తెలియదు. అన్నీ సమకూర్చినా కూడా…” అంటూ లాక్షణి తండ్రిని చూస్తూ లోలోపల ఏడుస్తుంది..
నవీన్ పక్కకు వెళ్లి వాళ్ల చుట్టాలకి, మామ, బావకి ఫోన్ చేస్తాడు. అది గమనించిన తల్లి—వీడిలో ఎంత మార్పు… చెప్పకనే పని చేసేశాడు అనుకుంటూ అక్కడ కూర్చుంటుంది అభిలాష..
అలానే తెలియకుండానే సర్జరీ… ఆరోగ్యం కుదుటపడడం… నెలరోజులు గడిచింది..
నాన్న దగ్గరికి వచ్చి కూర్చొని— “ఇక నీ పని ఆపేయ్ నాన్న. ఇంట్లోనే ఉండు. ప్రస్తుతానికి తమ్ముడు చదువు అయిపోగానే ఉద్యోగం వస్తుంది. నువ్వు కళ్లముందు ఉంటే మాకు అంతే చాలు,” అని చెప్తుంది.
తల మీద నిమురుతూ ఆనంద భాష్పాలు రాలుస్తాడు రాజశేఖర్..
వంటగదిలో నుంచి ఆ దృశ్యాన్ని చూసి చలించిపోతుంది అభిలాష. ఇంతలో నవీన్ వస్తాడు— “ఈ మందులు వేసుకోండి. నేను సాయంత్రం వస్తాను. ఈరోజు వేరే పరీక్షలు ఉన్నాయి,” అని వెళ్తుంటే, చెయ్యి పట్టుకుంటాడు రాజశేఖరం..
కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి… అప్పుడే మనం ఏదైనా సాధించగలం. కానీ కొడుకు అన్న మాటకి చలించిపోతాడు. ఇంకా బాధ్యతలు నెరవేరలేదు, ఇలా అనారోగ్యం అయిపోయాను అన్న బాధను చెప్పుకోలేక, కొడుకు చెయ్యి వదలలేక, ఒక్కసారిగా వచ్చిన కన్నీటిని ఆపుకోలేక తలను మెల్లగా వెనక్కి వాలుస్తాడు. అభిలాష కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది..
“ఏమైంది మీకు?” అని కేక వేస్తుంది అమ్మ.
“కాసేపు ఆగు… గుండె కొట్టుకుంటుంది. ఆయనకి ఇక మీద ఎలాంటి ఒత్తిడినీ ఇవ్వకుండా చంటి పాపలాగాచూసుకోవాలి.”
“నా తల్లి… అమ్మ… కంగారు పడకు. నాకు ఏమీ కాదు. మనం ఆయన చుట్టూ ఉంటే ఆ సంతోషమే ఆయనకు ఆరోగ్యం అవుతుంది,” అంటారు.
అటువంటి మాటలతో ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది..
అలా ఏడాది గడుస్తుంది. ఇంతలో డాక్టర్— “మందులు వాడుతూ ఉండండి. ఏమీ కాదు. ఆయనకు సంతోషం ఇచ్చే మాటలు చెప్పండి. ఆవేశానికి గురి చేయొద్దు,” అని చెప్పడంతో అభిలాష వచ్చే దుఃఖాన్ని ఆపుకుని బయట కూర్చుంటుంది.
భార్య అటు వెళ్లడం చూసిన రాజశేఖర్— “పిచ్చిది… ఎంతసేపూ నా గురించే లోపల ఆలోచిస్తుంది. కానీ బయటికి ఏమి చెప్పదు. ఏదీ అడగదు. మీ అమ్మ పిచ్చిది… తనని చూసుకోండి,” అంటూ ఏడుస్తాడు..
డాక్టర్ వచ్చి— “ఇప్పుడే చెప్పాను కదా… ఆయనని ఆవేశానికి గురి చేయవద్దు,” అని చెప్తాడు.
“అలాగే,” అంటుంది లాక్షణి..
అలా రోజూ చుట్టాలందరూ రావడం చూసి ఎంతో సంతోషిస్తాడు రాజశేఖర్. “కూతురు పెళ్లి చేసినప్పుడు కూడా ఇలానే వస్తే బాగుంటుంది,” అని అందరితో సంతోషంగా గడుపుతాడు.
లాక్షణి కూడా— “నాన్న… ఆ విషయం ఇప్పుడు ఎందుకు? సంతోషంగా గడుపుదాం,” అని ఆ రోజు వచ్చిన వాళ్లతో సంతోషంగా ఉంటుంది. ఇంతమంది ఉంటే నాకు ఏమవుతుంది…
రాజశేఖర్— “చెప్పండి… మీ వాళ్లు రారు గాని, ఇప్పుడు మాత్రం ఇలా పరిగెత్తుకొచ్చేసారే! అబ్బో… మీరంటే అభిమానం, ప్రేమనా ఇంకేమైనా రా!"
"చాల్లేఅండి… ఎప్పుడూ మా వాళ్లని ఏదో ఒకటి అనడమే. మీ మామ వస్తున్నాడు రేపు పెద్ద బస్సు ఎక్కి. అప్పుడు చూడండి ఇల్లు!” అంటాడు.
ఒక్కసారిగా అందరూ నవ్వుతారు. ఏదో బాధపడుతూ—ఆయనకి ఏమీ కాదు. ఆ సంతోషమే ఆయనని బ్రతికించి కాపాడుతుంది అని ఎవరో పిలిస్తే కళ్ళు తడుచుకుంటూ అటు వెళ్తాడు నవీన్..
అది గమనించిన లాక్షణి తమ్ముడి దగ్గరికి వస్తుంది. “ఏమైందిరా?” అని అడుగుతుంది.
“ఏం లేదు అక్క. నువ్వు అందర్నీ చూసుకుంటూ ఉండు. తినడానికి ఏమైనా తీసుకువస్తాను. నేను నీకు డబ్బులు వేశా. ఫోన్‌లో చూసుకో. అమ్మ టీలు పెడుతుంది,” అంటాడు.
తమ్ముడి వైపు చూస్తూ తల నిమురుతుంది. అలా పిల్లల్ని చూస్తూ ఆరోజు అంతా— ఇక నాకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఇంతమంది ఉంటే బ్రతికినన్నాళ్లు బతికేస్తా. బాధ్యతలు తీర్చుకుని అందరితో సంతోషంగా గడుపుతా అని రాజశేఖరం అనటంతో అందరూ అలా చూస్తూ ఉంటారు..
నీతి :
తండ్రి లోకమే కుటుంబ సభ్యుల శ్రేయస్సు.
***
యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు యామిని కోళ్ళూరు ....చదువు ఎం.ఏ ...ఎంఫిల్...
నా చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో లోనే జరిగింది....
నా అక్షరమే నాలో నింపేను ఉత్సాహంనా అక్షరమే ఆయుధం నా రచనలకు స్ఫూర్తి దాయకం....
గత నాలుగు సంవత్సరాలుగానేను సాహితీ సమూహాల్లో కవితలు,,, వ్యాసాలు....,కథలు,,,రాయటం.... సమీక్షలు చేయటం....పలు సన్మానాలు,,,,ప్రశంసా పత్రాలు అందుకొన్నాను ..... కొన్ని సదస్సులో.... ఐదవ తెలుగు ప్రపంచ సదస్సులో ...అంతర్జాల సదస్సులో పాల్గొన్న,,, నిత్య విద్యార్థిని..... ఇంకా భాష గురించి నేర్వాల్సింది చాలా వుంది.......నేను ఇలా ఈ స్థానంలో వున్నానంటేనాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి,,,, గురువులు...రక్తసంబంధీకులు,,,మావారు,,,,, పిల్లలు.... సాన్నిహిత్యాలు వీరి వెన్నుదన్నే కారణం....
ఎందరో కవులు కవయిత్రులు నుంచి కూడాఎంతో తెలుసుకోవాలి....
ఇంకా బాగా రాయాలి......నా లక్ష్యం ఆశయం నేను చేరుకోవాలి....
ప్రస్తుతానికి ఇదే నా గురించి....ధన్యవాదాలు
యామిని కోళ్ళూరు ✍️




Comments