top of page
Original.png

దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి

నేలకొండపల్లి, బౌద్ధ స్థూపాలు, బౌద్ధారామం, తెలంగాణ పర్యాటకం, ఖమ్మం, శాతవాహనులు, చాళుక్యులు, బాలసముద్రం, చారిత్రక ప్రదేశాలు, పురావస్తు, బౌద్ధమతం, తెలంగాణ చరిత్ర, Buddhist Heritage, Nelakondapalli, Telangana Tourism, Historical Places, Archaeology, Buddhist Stupa, Telugu Travel, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి' వ్యాసంలో తెలంగాణలోని నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు, పురాతన బౌద్ధ క్షేత్రం మరియు పరిసరాల వైమానిక దృశ్యం. 
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి' వ్యాసంలో తెలంగాణలోని నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు, పురాతన బౌద్ధ క్షేత్రం మరియు పరిసరాల వైమానిక దృశ్యం. 

Darsaneeya Sthalam Nelakondapalli - Telugu Inspirational Article | Gorrepati Sreenu

దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | గొర్రెపాటి శ్రీను

Published in manatelugukathalu.com on 28/06/2026


తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు సమీపంలో ఉన్న నేలకొండపల్లి భారతదేశంలోని ప్రముఖ బౌద్ధ వారసత్వ కేంద్రాలలో ఒకటిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాలు, శాతవాహనుల కాలం నాటి నాణేలు, పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన అనేక విలువైన అవశేషాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ప్రశాంతమైన వాతావరణం, బాలసముద్రం చెరువు, అభివృద్ధి చెందిన బౌద్ధారామం, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఈ నేలకొండపల్లి తెలంగాణ పర్యాటక రంగంలో విశిష్టమైన స్థానాన్ని పొందింది.


తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ దర్శనీయ ప్రదేశం నేలకొండపల్లి గ్రామం.

ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపాలు ఈ ప్రదేశానికి విశేషమైన పేరు రావడానికి కారణం.

ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన బౌద్ధ మత ఆరాధకులు ఇక్కడ ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.

సమీపంలో పెద్ద చెరువును తవ్వడం (ఈ చెరువు కు బాలసముద్రం అని పేరు) కూడా జరిగింది.


చాళుక్య రాజులు ఈ చోటును దర్శించినట్లు గా ఆధారాలు ఉన్నాయి.

క్రీస్తుశకం 2వ శతాబ్దం లో ఇక్కడ స్తూపాలు నిర్మించినట్లుగా చారిత్రాత్మకంగా ఆనవాలు లభించాయి.


ఈ స్థూప ప్రదేశం 8 ఎకరాలు ఉన్నట్లు గా గుర్తించారు.ఈ గ్రామం ఖమ్మం పట్టణానికి 21 కి.మీ దూరంలో ఉంటుంది.


శాతవాహన రాజుల నాడు వాడిన నాణేలు సైతం ఈ చోట దొరకడం జరిగింది.

క్రీస్తుశకం 2వ శతాబ్దం లో ఈ ప్రదేశాన్ని దర్శించిన ప్రఖ్యాత చరిత్రకారుడు టోలెమీ తన ఖగోళ రచనల పుస్తకంలో ఈ నేలకొండపల్లి ప్రాంతం గురించి రాయడం జరిగింది.

దక్షిణ భారతావనిలో ప్రసిద్ధి బౌద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ చోటును చైనా, జపాన్ దేశ పర్యాటకులు విశేషంగా దర్శించుకుంటున్నారు.


పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బౌద్ధ విగ్రహాలు,మట్టి పాత్రలు,నాణేలు అనేకం లభించడంతో ఈ నేలకొండపల్లి గ్రామం ప్రత్యేకతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి,బౌద్ధారామం అభ్యున్నతికి కృషి చేస్తుండడంతో నేడు గ్రామం పేరు దేశమంతటా మారుమ్రోగుతుంది.


***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page