top of page
Original.png

అదే కదా మ్యాజిక్

సోషల్ మీడియా, జీవిత పాఠం, వ్యంగ్య వ్యాసం, సమాజం, విలువలు, నిజాయితీ, మనిషితనం, తెలుగు సాహిత్యం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అదే కదా మ్యాజిక్' వ్యాసంలో సోషల్ మీడియా ప్రపంచం మరియు నిజ జీవిత విలువల మధ్య తేడాను ఆలోచిస్తూ నిలిచిన యువ భారతీయుడు.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అదే కదా మ్యాజిక్' వ్యాసంలో సోషల్ మీడియా ప్రపంచం మరియు నిజ జీవిత విలువల మధ్య తేడాను ఆలోచిస్తూ నిలిచిన యువ భారతీయుడు.

Ade Kadaa MagicTelugu Inspirational Article | Kotha Viritha

అదే కదా మ్యాజిక్ తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 27/06/2026


నీతులన్నీ ఆన్‌లైన్‌లో చర్చించుకొని, పనికి కావాల్సిన పనులు ఆఫ్‌లైన్‌లో చేసుకోవడం.

అదే కదా మ్యాజిక్.


సోషల్ మీడియాలో నిజాయితీ గురించి క్లాసులు తీసుకోవాలి, అవసరం వచ్చినప్పుడు మాత్రం

"కొంచెం అడ్జస్ట్ అయిపోదాం" అనాలి.


"మనిషితనం ముఖ్యం" అని పోస్ట్ పెట్టాలి, మనిషి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం "బ్రో... కొంచెం బిజీగా ఉన్నా" అని తప్పించుకోవాలి.


అవినీతి దేశాన్ని నాశనం చేస్తోందని గంటల తరబడి డిబేట్లు పెట్టాలి, మన పని త్వరగా కావాలంటే మాత్రం "సార్... కొంచెం చూసుకోండి" అని కవర్ అందించాలి.


సంబంధాల విలువ గురించి కోట్ షేర్ చేయాలి, అవసరం తీరాక కాల్స్ ఎత్తకుండా ఉండాలి.


సత్యం గురించి ఉపన్యాసాలు ఇవ్వాలి, స్వార్థం కోసం ఐదు నిమిషాల్లో మాట మార్చేయాలి.


రోజుకో దేవుడి ఫోటో వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాలి, పక్కింటివాడి కష్టానికి మాత్రం "నాకెందుకులే" అనుకోవాలి అని తలుపులు మూసేయాలి.


"సమాజం మారాలి" అని స్టేటస్ పెట్టాలి,కానీ మారాల్సింది మనమే అని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు.


పిల్లలకు విలువలు నేర్పాలి,

కానీ వాళ్ల ముందే అబద్ధాలు చెప్పాలి.


"డబ్బు అంతా కాదు" అని కోట్స్ పెట్టాలి, కానీ మనిషిని మాత్రం అతని బ్యాంక్ బ్యాలెన్స్‌తో కొలవాలి.


విలువలు జీవించడానికి కావు, లైకులు, షేర్లు సంపాదించడానికి.

మనసులో ఏముందో ముఖ్యం కాదు, టైమ్‌లైన్‌లో ఏముందో ముఖ్యం. పాపాలు ఆఫ్‌లైన్‌లో చేయాలి, పుణ్యాలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయాలి.


ఎందుకంటే ఈ కాలంలో, మంచి మనిషిగా ఉండడం కంటే, మంచి మనిషిలా కనిపించడం ఎక్కువ లాభదాయకం.


అదే కదా మ్యాజిక్.


మీ అభిప్రాయం ఏమిటి?

ఈ రోజుల్లో మంచి మనిషిగా ఉండడం ముఖ్యమా? లేక మంచి మనిషిలా కనిపించడం ముఖ్యమా? మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Soo true Akka.. maname society ani baga cheppav.. gurthu chesinanduku danyavadalu.. hope atleast this article brings changes in few ppl

Like
bottom of page