రెంట్ ఫ్రీ!

Rent Free - Telugu Inspirational Article | Kotha Viritha
రెంట్ ఫ్రీ! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 14/11/2026
మనసులో అతనికి అద్దె లేకుండా చోటిచ్చి, అద్దెగా మనశ్శాంతిని చెల్లించడం ఎంతవరకు సమంజసం?
ఈ ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచే కొత్త విరిత గారి ఆలోచనాత్మక రచన “రెంట్ ఫ్రీ!”.
మనిషి నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ద్వేషిస్తాం.
వాళ్ల మాటల్ని, పనుల్ని మనసులో పెట్టుకుంటాం!
నచ్చినవారిని తలుచుకుంటే సంతోషిస్తాం,
నచ్చనివారిని తలుచుకుంటే కోపంతో రగిలిపోతాం!
వాళ్లు మాట్లాడితే ఆనందంగా అర్థాలు వెతుకుతాం,
మాట్లాడకపోతే ఏదో కుట్ర చేస్తున్నారని అనుకుంటాం!
ప్రేమించినవారి తప్పుల్ని కూడా క్షమిస్తాం,
నచ్చనివారి మంచిని కూడా తప్పుగానే చూస్తాం!
ఒకరిని తలుచుకుంటే నవ్వొస్తుంది,
మరొకరిని తలుచుకుంటే కోపం వస్తుంది!
చిత్రమేంటంటే, ఇద్దరికీ మనసులో చోటిచ్చేది "మనమే"!
ఒకరు ఆనందాన్నిస్తే, మరొకరు బాధను ఇస్తారు!
నచ్చని మనిషికి నిత్యం హారతి ఇచ్చేది మనమే,
ద్వేషిస్తున్నామంటూ రోజూ తలుచుకునేది మనమే!
మనసులో ప్రేమను దాచుకుంటాం, అలాగే ద్వేషాన్ని కూడా దాచుకుంటాం!
తేడా ఏంటంటే, ప్రేమ మనసుకు సంతోషాన్నిస్తుంది,
ద్వేషం మన ప్రశాంతతను దూరం చేస్తుంది!
వాళ్లు మనసులో ఉన్నంతకాలం వాళ్లదే రాజ్యం, మన ప్రశాంతతకు మనమే పెట్టుకుంటాం అడ్డంకి!
ప్రేమైనా, ద్వేషమైనా మనసులో చోటిచ్చేది మనమే, సంతోషమైనా, బాధైనా అనుభవించేది మనమే!
నువ్వు ద్వేషించే మనిషి నీ మనసులో ఉన్నాడంటే, నీ మనసుపై అధికారం నీకు కాదు… అతనికే ఇచ్చినట్టే!
నీ మనసులో నీకు నచ్చని మనిషికి "రెంట్ ఫ్రీ" గా ఇల్లు ఇచ్చి, అద్దెగా నీ ప్రశాంతతను చెల్లిస్తూ,
రోజూ అతని గురించే ఆలోచిస్తూ ఉంటే…
నష్టపోయేది నువ్వే,
రాజభోగం అనుభవించేది అతనే!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.










Comments