చివరకు మిగిలేది
- Kotha Viritha

- 1 day ago
- 2 min read
చివరకు మిగిలేది, తెలుగు వ్యాసం, జీవిత సత్యం, విజయం, జీవన విలువలు, ప్రేమ, మానవత్వం, బంధాలు, ప్రేరణ, తెలుగు సాహిత్యం, ఆలోచింపజేసే వ్యాసం, Inspirational Article, Life Lessons, Success, Human Values, Telugu Articles, Telugu Literature, Positive Thinking, Motivation, Mana Telugu Kathalu

Chivaraku Migiledi - Telugu Inspirational Article | Kotha Viritha
చివరకు మిగిలేది - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 28/06/2026
జీవితంలో విజయం అంటే చాలామంది డబ్బు, హోదా, పేరు ప్రతిష్ఠలను ఊహిస్తారు. కానీ కాలం గడిచేకొద్దీ మనకు అర్థమయ్యేది వేరే సత్యం. మనతో కలిసి నడిచిన మనుషులు, మనం పంచిన ప్రేమ, మన వల్ల ఎవరికైనా కలిగిన ఆనందం, మనం కాపాడుకున్న విలువలే చివరికి మన జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తాయి. "చివరకు మిగిలేది" అనే ఈ ఆలోచింపజేసే తెలుగు వ్యాసం, అసలైన గెలుపు మనుషుల హృదయాల్లో నిలిచిపోవడమేనని లోతైన సందేశాన్ని అందిస్తుంది.
"నేను గెలిచాను…" "నేను ఓడాను…"
ఈ రెండు మాటలు మన జీవితంలో ఎన్నోసార్లు వినిపిస్తాయి. కానీ నిజంగా మనం గెలిచామా, ఓడిపోయామా అని ఎవరు నిర్ణయిస్తారు? కనిపించే విజయాల వల్లనా, మన పేరు ముందు చేరిన పదవుల వల్లనా, బ్యాంకులో పెరిగిన అంకెల వల్లనా, లేక మన కోసం నిలిచిన మనుషుల వల్లనా?
కొన్నిసార్లు ప్రపంచం మనల్ని విజేతగా చూస్తుంది. కానీ మనం చేరుకున్న శిఖరం మీద నిలబడి వెనక్కి చూసినప్పుడు, మన కోసం ఎదురుచూసిన బంధాలు కనిపించకపోతే…
మన వల్ల గాయపడిన హృదయాలు గుర్తొస్తే, మన ప్రయాణంలో కార్చిన కన్నీళ్లు గుర్తుకు వస్తే… ఆ విజయానికి నిజంగా అర్థం ఏముంటుంది? ఎందుకంటే జీవితం మార్కుల పట్టిక కాదు, అది మనుషుల జ్ఞాపకాల పుస్తకం. మనం ఎంత సంపాదించామో కంటే, ఎంత ప్రేమను సంపాదించామో ముఖ్యం.
ఎంత ఎత్తుకు ఎదిగామో కంటే, మన వల్ల ఎంతమంది కూలిపోలేదో ముఖ్యం. ఎన్ని విజయాలు సాధించామో కంటే, ఎన్ని విలువలను కాపాడుకున్నామో ముఖ్యం. చివరికి, మన సమాధి మీద చెక్కేది మన విజయాల జాబితా కాదు. మన చేతులు ఎవరి కన్నీళ్లైనా తుడిచాయా..?
మన పేరు వినగానే ఎవరి పెదవుల మీదైనా చిరునవ్వు మెరిసిందా, మనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని,
"ఇంకొంచెం కాలం ఉంటే బాగుండేది" అని ఎవరి మనసైనా నిశ్శబ్దంగా బాధపడిందా?
అదే మన అసలైన గెలుపు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
ఈ వ్యాసం మీ మనసును తాకితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. జీవిత విలువలను గుర్తుచేసే ఇలాంటి మరిన్ని తెలుగు వ్యాసాలు, స్ఫూర్తిదాయక రచనల కోసం మన తెలుగు కథలును అనుసరించండి.
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






మానవతావిలువలు కాపాడుతూ సాటి వాళ్ళ పట్ల దయగా ఉంటూ జీవితంలో ముందుకు పోవడమే అసలైన మనిషి లక్షణం.వీరు ఎన్నేళ్లయిన గుర్తుండి పోతారు అందరి మనసుల్లో