నేనెలా?
- Dr. C S G Krishnamacharyulu
- Jul 22
- 2 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #Nenela, #నేనెలా, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Nenela - New Telugu Poem Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 22/07/2025
నేనెలా? - తెలుగు కవిత
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
చెట్టు మాటున దాగి వాలి సంహరణ
నిండు చూలాలి నడవుల పాల్చేసిన దుర్ఘటన
నీచ కుల తాపసి శంభూకుని శిరఛ్చేదన
సాగించిన వాడు ఆదర్శ దేవుడు.
నేనెలా పూజించేది?
వర్ణ వివక్షను నేర్పే పురాతన అచారాలు
స్త్రీని పురుషాధీనగ చేసిన నీతి బోధనలు
సనాతన ధర్మ సంక్లిష్ట ప్రవచనాలు
బ్రతుకు నేర్పని సూక్తి ముక్తావళులు
నేనెలా పాటించేది?
టీవీలలో పస లేని పిడి వాదనలు
పత్రికలలో తర్క శూన్య కథనాలు
చలన చిత్రాలలో కామప్రదర్శనలు
రాజకీయుల బూతు నిందారోపణలు
నేనెలా నేర్చేది?
జగతి సర్వతో ముఖ ప్రగతి లక్ష్యం
విద్వేష రహిత శాంతి సమాజం
సర్వజనహిత జీవన సాఫల్యం
ఆవిష్కరించు జ్ణాన రధ ప్రయాణం
నేనెలా చేసేది?
***
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
మంచి,చెడులను తర్కించి ఆలోచన చేసే ప్రతి మనిషిలో మెదిలే ప్రశ్నలకు అక్షర రూపం కల్పించిన కవి అభినందనీయులు
ఇంతమంచి కవిత చదివాక నేనెలా ఉండగలను అభినందించకుండా ?బాగుంది