top of page

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 3



'Nenu Premisthunnanu - Episode 3'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 28/01/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు,    నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు వంశీ. అలాంటి వంశీ కాలేజీ లో ఒక అమ్మాయిని చూసిన తర్వాత.. లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్ లో వారి పరిచయం బాగా పెరిగింది. స్వాతికి ఏమైనా ఇబ్బంది కలిగినా..చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ..ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు వంశీ..

ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 3 చదవండి. 


వంశీ బీచ్ కు వెళ్ళినప్పుడల్లా.. "నా మీద ఆమె కు ఏ అభిప్రాయం ఉందో నని తెగ ఆలోచించేవాడు. ఉదయించే సూర్యుడిలా ఆమె ను ఉదయం చూసేవాడు..మళ్ళీ అస్తమించే సుర్యుడిలా సాయంత్రం వంశీ కళ్ళ ముందే అస్తమించేది. స్వాతి ఏ రంగు డ్రెస్ వేస్తే,    అ డ్రెస్ కే అందం వచ్చేది. నలుపు,    ఆకుపచ్చ రంగులలో ఆమె నిజంగా అప్సరసే అని చెప్పాలి. ఎంతో నెమ్మదైనా మనసు,    అమాయకంగా చూసే ఆ చూపు,    భూమి ని ముద్దాడి నడిచే ఆ హంస నడక.. వంశీ కు బాగా నచ్చిన విషయాలు.


ఒక రోజు బస్ స్టాప్ లో ఆమెను కలసినప్పుడు 'హాయ్' చెప్పగానే స్వాతి చిరునవ్వుతో పలకరించి తరువాత.. 


"వంశీ..నన్ను కొంత మంది కామెంట్ చేసారు" అని చెప్పింది. ఆశ చాక్లెట్ కొనడానికి వెళ్తే,    ఆశ ఆశ అని ఏడిపించారని చెప్పింది. వాళ్ళు అక్కడ లేకపోయేసరికి...పట్టించుకోవద్దని చెప్పాడు వంశీ.


ఇలాగ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎప్పుడు తన ప్రేమ విషయం చెబుదామన్నా..ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు..ఒకవేళ వారి స్నేహం చెడిపోతే..వంశీ భరించలేడు. టైం వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాడు..


ఒకరోజు స్వాతి చాలా డల్ గా ఉండడం చూసి "ఏమైంది స్వాతి! ఏమైనా ప్రాబ్లం..? నువ్వు అలా ఉంటే..చూడడానికి బాగుండదు. ఎప్పుడు నవుతూ ఉంటే,    చాలా బాగుంటావు.." అని వంశీ అన్నాడు.. 


ఈలోపు స్వాతి ఫ్రెండ్స్ అక్కడకి వచ్చారు. అప్పుడు వంశీ.." మీ ఫ్రెండ్స్ ని ఎప్పుడు నాకు పరిచయం చెయ్యలేదు స్వాతి..ఇప్పుడైనా చేస్తావా..?"


స్వాతి ఫ్రెండ్స్ ఎప్పుడు తనతోనే ఉంటారు. స్నేహ...అండ్ లైలా..కాలేజీ లో ఎక్కువ అందరూ కలిసే బయటకు వెళ్తారు. బర్త్ డే  పార్టీలు... అన్నీ కలిసే చేసుకుంటారు.


స్వాతి తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది వంశీ కి...


"స్నేహ..ఇది నా స్కూల్ ఫ్రెండ్. నాలాగ కాదు వంశీ..చాలా గడుసుది తెలుసా? ఇంకా ఇది..లైలా..ఇది చూడడానికే  చాలా సైలెంట్ గా ఉంటుంది. కాని లోపల చాలా ఆలోచనలు దీనికి..." 


వంశీ..అందరితోను కలిసిపోయేవాడు. ఎవరికి  డౌట్స్ ఉన్నా..క్లియర్ చేసేవాడు. హెల్ప్ చేసేవాడు. స్వాతి అంటే ఎక్కడో సాఫ్ట్ కార్నెర్ మాత్రం ఉంది తనకి...


ఒకసారి కాలేజీ లో పిక్నిక్ ఏర్పాటు చేసారు. అందరూ పిక్నిక్ కు పేర్లు ఇచ్చారు. స్వాతి మాత్రం పేరు ఇవ్వలేదు.


"స్వాతి! కాలేజీ పిక్నిక్ కు రావట్లేదా..?"

"లేదు వంశీ..మా ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు..."

"ఎందుకు...?"

"మా ఫ్రెండ్స్ ఎవరూ రావట్లేదు..అందుకే.."

"ఎందుకు రావట్లేదు..."

"స్నేహ ఏమో తన బావ తో ఏదో ట్రిప్ ప్లాన్ చేసిందంట..లైలా ఏమో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని రాదంట..మా ఫ్రెండ్స్ రాకపోతే,    నన్ను బయటకు పంపరు మా డాడీ..ఏం చెయ్యమంటావు..?"

"మీ ఫ్రెండ్స్ ని ఒకసారి పిలువు...మాట్లాడాలి.." అన్నాడు వంశీ


"వంశీ..! పిలిచావంటా..." అంది స్నేహ..

"ఏమిటి పిక్నిక్ కు రావట్లేదా..?"

"లేదు.. రావట్లేదు.."


"కాలేజీ లో పిక్నిక్ కు ఇయర్ కి ఒక్కసారే ఉంటుంది. పాపం చూడు.. మీ వల్ల స్వాతి కుడా రాలేకపోతుంది. మీ వల్ల తన ఎంజాయ్ చెయ్యలేకపోతుంది.."

"నిజమే...కానీ మా బావ..తో నేను ట్రిప్ కి వెళ్తున్నాను..."

"మీ బావ తో ట్రిప్ తర్వాత పెట్టుకో...లైలా,    నువ్వు మీ ఇంట్ల ఫంక్షన్ తర్వాత పెట్టుకో..అంతే..!"


"నీకు నా బావ గురించి.. నా గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు వంశీ..?"


"నాకు నా బావంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇద్దరమూ కలిసి పెరిగాము. నేను పుట్టిన తర్వాత నుంచే బావ కు పెళ్ళాన్ని అని ఫిక్స్ అయిపోయారు ఇంట్లో అంతా..పెరిగిన తర్వాత నేను కుడా బావను చాలా ఇష్టపడ్డాను. బావకు కుడా నేనంటే చాలా ఇష్టం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళి చేద్దామని ఇంట్లో అన్నారు. మా బావ ఎప్పుడో మంచి జాబ్ లో సెటిల్ అయ్యాడు. మంచి జాబ్,    శాలరీ. నా కోసమే..వెయిట్ చేసున్నాడు. మా బావ తలచుకుంటే,    నా కన్నా మంచి అమ్మాయిని,    అందమైన అమ్మాయిని చేసుకోగలడు. కానీ,    నేనంటే ఇష్టం కనుక.. వెయిట్ చేస్తున్నాడు. అలాంటి బావ ట్రిప్ కి పిలిస్తే,    నేను వెళ్ళకపోతే ఎలా..?


మా బావ.. నేను..ఉహ తెలిసినప్పటినుంచి లవ్ లో ఉన్నాము. ప్రతి వాలెంటైన్స్ డే కి నాకు ప్రపోజ్ చేస్తాడు. షాపింగ్ కి కలిసే వెళ్తాము. నేను కుడా నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళి కి రెడీ గానే ఉన్నాను. త్వరలో మా ఎంగేజ్మెంట్ ఉంది. నేను నా బావ తో నా లైఫ్ ని చాలా గొప్పగా ఉహించుకున్నాను..ఈ పిక్నిక్ లు ఈవన్నీ నాకు ఎక్కువ ఏమీ కాదు.."


"అయినా లవ్ చేస్తేనే..తెలుస్తుంది ఆ ఫీలింగ్..లేకపోతే ఎలా తెలుస్తుంది?" అని అంది వంశీ తో..


"నిన్ను హర్ట్ చేసి ఉంటే,    'ఐ యాం సారీ'..అయినా ఎవరు ఎప్పుడు లవ్ లో పడతారో ఎవరు చెప్పగలరు చెప్పు? నేను అంటున్నది ఏమిటంటే,    నెక్స్ట్ వీక్ మీ బావతో ట్రిప్ కి వెళ్ళొచ్చు కదా అని..నీ లవ్ ని నేను తక్కువ చెయ్యట్లేదు.." అన్నాడు వంశీ 


"ఓకే...అలాగే..మా బావ తో చెప్పి.. నెక్స్ట్ వీక్ వెళ్తాను.  ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో వంశీ,    నాకు కొంచం కొంచం తెలుస్తున్నాది" అంది స్నేహ 


"లైలా! నువ్వూ స్వాతి చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ కదా..స్నేహ నువ్వు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కదా...మీరందరూ తనతో పిక్నిక్ వస్తే,    స్వాతి చాలా హ్యాపీ అవుతుంది.."


"వంశీ! మా కజిన్ సిస్టర్ బర్త్డే ఫంక్షన్ ఉంది..నేను ట్రై చేస్తాను..మా కజిన్ సిస్టర్ నేను చాలా క్లోజ్.."


"బర్త్డే ఫంక్షన్ కి రాత్రి వెళ్లి విష్ చెయ్యచు లైలా...నువ్వు పిక్నిక్ కి రావాలి.."

"అంతగా చెబుతున్నావు..వస్తాను వంశీ.." అంది లైలా..

=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ



50 views0 comments
bottom of page