top of page

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 4



'Nenu Premisthunnanu - Episode 4'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 02/02/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


వంశీ కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా.. చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ.. ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు వంశీ.. 

కాలేజీ పిక్నిక్ కి రావడానికి స్వాతిని ఒప్పిస్తాడు వంశీ. 


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 4 చదవండి. 


“ఈ డిస్కషన్స్ అన్నీ వదిలేయండి. పిక్నిక్ కు ఇంకా చాలా టైం ఉంది.. దాని కన్నా ముందు స్వాతి బర్త్ డే వస్తుంది.. దానికి ప్లాన్ చెయ్యండి..” 


స్వాతి బర్త్డే పార్టీ అంటే వంశీ కు పెద్ద పండుగే మరి. ఎప్పుడు ఆ రోజు వస్తుందో అని వేచి చూసాడు. తన కోసం ఒక గిఫ్ట్ కొని ఉంచాడు. ఫ్రెండ్స్ అందరూ రాత్రి విషెస్ చేస్తారని తెలుసు. అందరికన్నా తానే ముందు విష్ చెయ్యాలని ఒక మంచి కార్డు కొని.. ముందుగానే పోస్ట్ చేసాడు. 


బర్త్ డే రోజు.. స్వాతి కాలేజీ లో కొత్త డ్రెస్ లో మెరిసిపోతుంది. లంగా వోణి లో అదిరిపోయింది.. గ్రీన్ కలర్ వోణి లో నిజంగానే చాలా బాగుంది. మార్నింగ్, అందరికన్నా ముందుగా తనకి విష్ చెయ్యాలని.. బస్ స్టాప్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం స్వాతి అక్కడకు వచ్చింది. దూరం నుంచి స్వాతి నవ్వుతు 'హాయ్' చెప్పింది.. 


"డ్రెస్ సూపర్.. " అని సైగ చేసాడు వంశీ. దగ్గరకు వెళ్లి.. విష్ చేసి.. “గిఫ్ట్ ఇచ్చాను.. "


"థాంక్స్.. " అని చెప్పింది.. 

"ఏమిటి ఈరోజు ప్లాన్స్.. ?" అని అడిగాడు వంశీ.


"మా ఫ్రెండ్స్ తో సాయంత్రం బయటకు వెళ్తాను.. "


"ఎక్కడికో తెలుసుకోవచ్చా.. ?"


"అలా సరదాగా.. వెళ్తాము.. పార్టీ అడిగారు.. నువ్వు కుడా తప్పకుండా రావాలి వంశీ.. "


"అలాగే స్వాతి.. సరే.. నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా.. "


సాయంత్రం పార్టీ కోసం స్వాతి ఒక బేకరీ లో అందరిని కలిసింది. ఆ రోజు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు.. కేకు కటింగ్ లో ఫస్ట్ పీస్ వంశీ కే తినిపించింది స్వాతి. ఆ రోజు చాలా హ్యాపీ గా గడచింది వంశీ కు.. 


ఆ రోజు రాత్రి స్వాతి.. అమ్మతో మాట్లాడుతున్నప్పుడు.. ప్రేమ, పెళ్ళి గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు.. ఈ ప్రేమలు అంటే.. ఇంట్లో నాన్నగారికి ఇష్టంలేదని టాపిక్ వచ్చింది.. 


"అమ్మా!.. ఏమిటమ్మా! ప్రేమిస్తే తప్పా.. ఎప్పుడూ నాన్న ఎందుకు ప్రేమంటే కోపంగా ఉంటారు.. ?"


"ప్రేమించడం తప్పు కాదు స్వాతి.. "


"మరి నాన్న కు ఎప్పుడూ భయపడుతూనే ఉండాలా అమ్మా!.. ?"


“మీ నాన్న ఎందుకు ప్రేమ అంటే అంత ద్వేషిస్తున్నారో నీకు తేలియదు. ఇప్పుడు ఇలాగ ఉన్నారే గానీ.. మీ నాన్న అందరిలాగా చాలా సాఫ్ట్ మనిషి. కాలేజీ రోజుల్లో మీ నాన్న కు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసారు. ఎవరి ప్రేమను ఆయన ఓకే చెయ్యలేదు. మీ నాన్న స్కూల్ లో ఫస్ట్, కాలేజీ లో ఫస్ట్ గా ఉండేవారు. అతని తెలివితేటలు చూసి.. అమ్మాయిలంతా ఆయనతో స్నేహం చెయ్యాలని కోరుకునే వారు. కానీ, మీ నాన్న అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ కి, ప్రేమ కి 'నో' అనేవారు. దానికి కారణం తెలియాలంటే, నీకు మీ అత్త గురించి తెలియాలి స్వాతి..” 


"నాకు ఒక అత్త కుడా ఉందా.. ?" అడిగింది స్వాతి.

 

"ఉండేది.. ఇప్పుడు లేదు స్వాతి.. "


"ఏమైంది.. అత్తకి.. ?"


"మీ అత్త చనిపోయింది.. "


"ఎలా?"


మీ అత్త అంటే, మీ నాన్న కు చాలా ఇష్టం. చెల్లి అంటే ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి మీ అత్త.. కాలేజీ లో చదువుతున్నప్పుడు తన క్లాసు మేట్ ని ప్రేమించింది. ప్రేమించిన విషయం చెబితే.. ఎక్కడ ఇంట్లో తిడతారో అని.. చెప్పలేదు. ఒక రోజు.. మీ అత్త కి కొన్ని అబ్బాయిల ఫోటోలు చూపించి, ఎవరు నచ్చరో మీ తాతగారు అడిగారు. ఏం చెప్పాలో తెలియని మీ అత్త.. ఏమి చెప్పలేక.. తర్వాత చెబుతానని చెప్పింది. 


ఒకరోజు మీ అత్త ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. అందరూ ఇల్లంతా వెతికారు. కానీ ఎక్కడ కనిపించలేదు. కొన్ని రోజుల వరకూ చాలా చోట్ల వెతికించారు. కానీ, మీ అత్త జాడ ఎక్కడ తెలియలేదు. ఎక్కడున్నా.. హ్యాపీ గా ఉండే ఉంటుందనుకుని ఇంక వెతికే ప్రయత్నాలు చెయ్యలేదు. 


చాలా రోజుల తర్వాత ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది మీ అత్త రాసింది. తన కోసం వెతకొద్దని.. తను హాపీ గానే ఉన్నానని చెప్పింది. అందరూ ఆ రోజు కోపంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం అందరూ మర్చిపోయారు. 


కొన్ని రోజుల తర్వాత, ఇంటికి పోలీసులు వచ్చారు. ఏమిటని అడిగితే, మీ అత్త సూసైడ్ చేస్కుందని చెప్పారు. ఎందుకు అంటే, భర్త తో ప్రాబ్లం అని చెప్పారు. ఆ రోజు నుంచి మీ నాన్న కి ప్రేమ అంటే ఇష్టం, నమ్మకం పోయాయి. అప్పటినుంచీ.. మీ నాన్న ఇలా ఉన్నారు. 


కాలేజీ లో ఎంత మంది ప్రపోజ్ చేసిన 'నో' అనేసారు. చాలా మంది అమ్మాయిలు తమని పెళ్ళి చేసుకోకపోతే, సూసైడ్ చేసుకుంటామని అన్నా.. మీ నాన్న కేర్ చెయ్యలేదు. తర్వాత నన్ను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. నేనూ.. మీ నాన్న చాలా హ్యాపీ గానే ఉన్నాము. 


ఇప్పుడు నువ్వు ప్రేమించినా.. మీ నాన్న అసలు ఒప్పుకోరు. అర్ధం చేసుకో స్వాతి.. 



=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ



57 views0 comments
bottom of page