'Hot Ice Cream' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 01/02/2024
'హాట్ ఐస్ క్రీం' తెలుగు కథ
రచన: L. V. జయ
"అబ్బా! తిరిగి తిరిగి కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి. ఇంక నడవడం నా వల్ల కాదు" అంది జాగృతి.
"వెకేషన్ కి వచ్చి నడవలేనంటే ఎలా ? పెయిన్ కిల్లర్ వేసుకో. తగ్గిపోతుంది" అన్నాడు సమర్థ్.
" ఎన్ని రోజులుగా రోజూ నడుస్తున్నామో. పాదాల దగ్గర పొంగిపోయింది. ఈ నొప్పులు పెయిన్ కిల్లర్ తో కూడా తగ్గేటట్టు లేవు" అంది జాగృతి.
"ఇక్కడ రిసార్ట్ లో స్పా వుంది. వెళ్లి మసాజ్ చేయించుకో. కొంచెం హాయిగా ఉంటుంది. రేపు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ లో చాలా నడవాలి". అన్నాడు సమర్థ్.
" సరే. నేను, శాన్వి వెళ్తాము. శాన్వికి మెడ దగ్గర నొప్పిగా వుంది అంటోంది" అని శాన్వి తో స్పా కి వెళ్ళింది జాగృతి.
స్పా చాలా నచ్చింది ఇద్దరికీ. చిన్న, చిన్న గుడిసెలు చాలా వున్నాయి. కొంచెం దూరంలో బీచ్. లోపల మంచి మ్యూజిక్, చిన్న వాటర్ ఫౌంటెన్. అలా వాటర్ పడుతున్న సౌండ్ వింటూ మసాజ్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు ఇద్దరూ.
జాగృతికి ఫుట్ మసాజ్ చెయ్యడానికి వచ్చింది ఒక అమ్మాయి. పేరు విలాన్. నవ్వుతూ పలకరించింది. మసాజ్ చేస్తున్నంతసేపూ మాట్లాడుతూనే వుంది. "మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని రోజులు వుంటారు బాలి లో ? ఇదేనా మొదటిసారి రావడం బాలికి ? ". ఇలా చాలా ప్రశ్నలు.
అన్నిటికి సమాధానం చెప్పింది జాగృతి.
"మీకు బాలి నచ్చిందా ? ఏం చూసారు ఇప్పటి వరకు ?" అని అడిగింది శాన్విని.
"గరుడ విష్ణు కెంచన, సరస్వతి టెంపుల్, మంకీ సాంక్చువరి, ది గేట్స్ అఫ్ హెవెన్. ఇలా చాలా చూసాం" చెప్పింది శాన్వి.
"మీరు హిందూనా? నేను కూడా హిందునే. బాలి లో చాలా మంది హిందూస్ వున్నారు. కానీ మీవి, మావి కొన్ని ట్రేడిషన్స్ లో తేడా ఉండచ్చు".
"మీరు వీగనా, వెజిటేరియేనా? మీరు ఇక్కడ ఏ రెస్టరెంట్స్ లో తింటున్నారు? ఇండియన్ రెస్టౌరెంట్స్ కి వెళ్తున్నారా? ". ఇలా మాట్లాడుతూ మసాజ్ చెయ్యటం విలాన్ కి అలవాటేమో అనుకుని అన్నిటికి సమాధానం చెప్పింది జాగృతి.
"నాకు ఇండియా అన్నా, ఇండియన్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఢిల్లీ లో పని చేస్తుంది. ఇండియన్ ని పెళ్లి చేసుకుంది. అక్కడే హ్యాపీగా ఉంటోంది. నాకు కూడా ఇండియా వెళ్లాలని వుంది. అంతా చూడాలని వుంది. ముఖ్యంగా జైపూర్. అక్కడ అందమైన పాలస్ లు చూడాలని వుంది. మంచి రుచికరమైన ఫుడ్ తినాలని వుంది. " మాట్లాడుతూనే వుంది విలాన్.
"యెల్లో బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా తెస్తుంది నాకోసం ".
"యెల్లో బాల్స్ ఏంటి?" అడిగింది జాగృతి.
" యెల్లో బాల్స్. ఇండియా లో చాలా ఫేమస్ కదా".
అర్ధం కాలేదు జాగృతికి.
" దేవుడి దగ్గర పెడతారు కదా అవి " అంది విలాన్.
"ఓహ్ తినే పదార్థమా ? లడ్డూ నా ?" అడిగింది జాగృతి.
"అవును. గణేష్ కి పెడతారు. చాలా స్వీట్ గా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది" అంది విలాన్.
లడ్డూ ని యెల్లో బాల్ చేసేసింది అనుకుని నవ్వుకున్నారు జాగృతి, శాన్వి.
"మీరు తినే ఆరంజ్ కలర్ థింగ్ ని ఏమంటారు?" ఇంకో ప్రశ్న.
అది కూడా తిండికి సంబంధించింది మళ్ళీ. ఆలోచించారు జాగృతి, శాన్వి. ఏం తింటాం ఆరంజ్ కలర్ ది అని.
"ఆరంజ్ కాదు. రెడ్ కలర్ లో ఉంటుంది. కట్ చేసి బిర్యానీ లో వేస్తారు. "
శాన్వి కి అర్ధం అయ్యింది ఉల్లిపాయ గురించి అడుగుతోంది అని.
"రెడ్ ఆనియన్ " అని చెప్పింది శాన్వి.
"వైట్ కలర్ లో వుండే దాన్ని ఏమంటారు మరి ?".
"అది కూడా ఆనియన్. వైట్ ఆనియన్" చెప్పింది శాన్వి.
"ఓహ్. నేను ఇంకా బ్రదర్ ఆనియన్, సిస్టర్ ఆనియన్ అని అనుకున్నాను. " అంది విలాన్.
రెడ్ ఆనియన్, వైట్ ఆనియన్ కి వచ్చిన కొత్త పేర్లు విని నవ్వుకున్నారు శాన్వి, జాగృతి.
"పర్పల్ కలర్ లో ఉంటుంది అది ఏమిటి?" అడిగింది విలాన్.
చూడడానికి సన్నంగా వుంది కానీ తిండికి సంబంధించిన ప్రశ్నలు ఇన్ని అడుగుతోంది ఏంటి ఈ అమ్మాయి. ఏమిటో ఇలా చిక్కుపోయాం. ఈ అమ్మాయి పేరు విలాన్ కాదు విలన్ అయ్యి ఉంటుంది. మధ్యలో వెళ్ళిపోటానికి కూడా లేదు అని అనిపించింది ఒక నిమిషం జాగృతికి. తనకి వచ్చిన ఆలోచనకి నవ్వుకుని శాన్విని చూసింది.
శాన్వికి అర్ధం అయ్యి " పోనిలే అమ్మ. టైంపాస్ అవుతోంది. నవ్వు వస్తోంది" అంది.
"నేను, నా ఫ్రెండ్ ఇక్కడ ఒకసారి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము. ఐస్ క్రీం ఆర్డర్ చేసాం. ఫస్ట్ టైం చూసాను అలాంటి ఐస్ క్రీం. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి" అని చేతులు ఊపుతూ చెప్పింది విలాన్.
ఆ పుస్ పుస్ పుస్ అని చూపించిన విధానానికి నవ్వు వచ్చింది జాగృతికి, శాన్వికి.
"చాలా బాగుంది. మీరు కూడా తింటారా అది ? ".
దేని గురించి మాట్లాడుతోందో అర్ధంకాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు జాగృతి, శాన్వి.
"కుల్ఫీ నా?" అడిగింది శాన్వి.
"కాదు. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి" అని మళ్ళీ చేతులు పూవులు విచ్చుకున్నట్టు చూపిస్తూ చెప్పింది విలాన్.
"ఈ పుస్ పుస్ పుస్ ఐస్ క్రీం ఏమిటి" నవ్వుకున్నారు జాగృతి, శాన్వి.
"హ. గుర్తు వచ్చింది దాని పేరు. హాట్ ఐస్క్రీమ్".
"ఐస్ క్రీం హాట్ గా ఉండడం ఏమిటి ? "అంది జాగృతి.
"బౌల్ లో తెచ్చి ఇచ్చారు. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి. " ఈ సారి కూడా చేతులు ఊపుతూనే చెప్పింది.
"వేడి తట్టుకోలేక చిన్న టవల్ లో పట్టుకుని వచ్చారు. ఐస్ క్రీం అడిగితే హాట్ ఐస్క్రీమ్ తెచ్చారు. ఎలా తినాలా అనుకున్నాం. చూడడానికి వేడి గా వుంది. కానీ తింటే చల్లగా వుంది. అది చేస్తున్నప్పుడు కూడా చూసాం మేము. పాన్ మీద చేసారు. ఫ్రైడ్ ఐస్ క్రీమా దాని పేరు, హాట్ స్క్రీమా. మర్చిపోయా ".
"అబ్బా. అర్ధం అయ్యింది. ఐస్ క్రీం రోల్స్" అంది జాగృతి. ఐస్ క్రీం రోల్స్ కి కూడా కొత్త పేరు ఇచ్చింది విలాన్ అని నవ్వుకున్నారు జాగృతి, శాన్వి.
"మళ్ళీ రేపు రండి. నా దగ్గరే మసాజ్ చేయించుకోండి. " అంది విలాన్.
"మళ్ళీ ఇలా కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తారా? " అంది నవ్వేస్తూ అంది శాన్వి.
"తప్పకుండా " నవ్వేస్తూ బై చెప్పింది విలాన్.
మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ 30 నిముషాలు ఎలా గడిచాయో కూడా తెలియదు. విలాన్ మాట తీరు, నవ్వు మొహం, అమాయకత్వం అన్ని నచ్చాయి వాళ్ళకి. తనతో ఒక ఫోటో తీయించుకుని, టిప్ ఇచ్చి, నొప్పులు తగ్గినందుకు హాయిగా నవ్వుకుంటూ బయటికి వస్తుంటే విలాన్ అడిగింది "రేపు వస్తారా మళ్ళీ. మీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. రేపు కూడా వస్తే ఇంకా కొంచెం నొప్పి తగ్గుతుంది".
"మేము రేపు వెళ్ళిపోతున్నాం. ఇంక రావడం కుదరదేమో. నైస్ టు మీట్ యు " అని చెప్పి బయటకి వస్తూవుంటే అడిగింది విలాన్ "నేను గుర్తు ఉంటానా మీకు" అని.
వెనక్కి తిరిగి చెప్పారు ఇద్దరు ఒకేసారి. "ఎలా మర్చిపోతాం. ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం మీ దగ్గర " అంటూ నవ్వుతూ బై చెప్పి వచ్చారు జాగృతి, శాన్వి.
యెల్లో బాల్స్, బ్రదర్ ఆనియన్, సిస్టర్ ఆనియన్, పుస్ పుస్ పుస్ హాట్ ఐస్ క్రీం గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.
సమాప్తం.
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
జయ
Comments